TODAY EDUCATION/TEACHERS TOP NEWS 16/12/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
TODAY EDUCATION/TEACHERS TOP NEWS 16/12/2022
పాఠశాలలో పట్టపగలు దోపిడీ

*📚✍️ఖాళీలెన్ని..?📚✍️*
*♦️బదిలీల దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు*
*♦️తేలని లెక్కలతో ఉపాధ్యాయుల ఆందోళన*
*🌻మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే*
ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తు చేసుకునే గడువు సమీపిస్తున్నా ఇంకా వివిధ అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు డిమాండ్లను ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సవరణలు చేయాలని కోరారు. దానిపై కూడా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విధానపరమైన లోపాలు, గందరగోళ పరిస్థితుల్లో బదిలీలు చేపట్టడంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
♦️ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈనెల 17వ తేదీలోపు బదిలీలు కోరుకునే వారందరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆ దిశగా ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలు ప్రదర్శించాల్సి ఉండగా ఇప్పటివరకు విద్యాశాఖ దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇంకా మండలాల వారీగా వివరాలు సేకరిస్తూనే ఉన్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా పదివేలకుపైగా ఉండగా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 ఏళ్లు పూర్తి చేసుకున్న హెచ్‌ఎంలు తప్పనిసరిగా బదిలీ కావాల్సి  ఉంది. దీంతోపాటు ఈ సారి సర్వీసుతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. గురువారం సాయంత్రానికి 1500 వరకు ఖాళీలు ఉన్నట్లు గుర్తించినట్లు సిబ్బంది ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు బుధవారం నాటికే ఆన్‌లైన్‌లో పెడతామని చెప్పి, ఇప్పటివరకు పూర్తిచేయకపోవడం పట్ల ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*♦️హేతుబద్ధీకరణపైనా అంతే..*
బదిలీల్లో భాగంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టారు. ఏ ఉపాధ్యాయులు బదిలీ కావాలో… మండలం నుంచి ఎంతమంది కావాల్సి వస్తుందో తెలియకుండా ఎలా దరఖాస్తు చేసుకుంటారని సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు ఈ ఏడాది అక్టోబరులో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన వారినుంచి అంగీకారం తీసుకున్నారు. వారు ఏ హోదాలో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలనేది మార్గదర్శకాల్లో పొందుపరచకపోవడం, అధికారులు కూడా ఏ విషయం చెప్పకపోవడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది  పదోన్నతులు పొందిన వాళ్లు కూడా బదిలీలకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలా లేదా తరువాత ప్రత్యేకంగా నిర్వహిస్తారా అన్నది కూడా చెప్పలేదు. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండగా అదీ లేదు. కొంతమంది మాత్రం వ్యక్తిగతంగా జిల్లా ఆసుపత్రిలో సంబంధిత వైద్యులవద్దకు వెళ్లి పత్రాలు తీసుకుంటున్నారు. ఇలా వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
*♦️సర్వర్‌ స్థాయి పెంచాలి*
బదిలీల అంశంపై సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సవరించాలని కోరాం. ఇంతవరకు  ఎలాంటి సవరణలు చేయలేదు. ఖాళీలు ప్రకటించలేదు, వివిధ అంశాలపై జీవోలో స్పష్టత లేదు. ఇలా అనేక సమస్యలతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ఉమ్మడిజిల్లా ప్రాతిపదికన బదిలీలు జరుగుతున్నా అధికారులనుంచి సక్రమంగా సమాచారం అందడం లేదు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి సర్వర్‌ పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రెండు రోజులే గడువు ఉన్నందున వెంటనే సర్వర్‌స్థాయి పెంచడంతోపాటు సమస్యలపై ఒక స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.
*▪️మనోహర్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి*
*♦️ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా..*
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా బదిలీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సర్వర్‌ సమస్య  ఉంటే వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తున్నాం. ఖాళీల వివరాలతోపాటు అన్ని అంశాలపై నిర్దేశించిన నిబంధనల ప్రకారం జరుగుతుంది. మా దృష్టికి వచ్చిన సమస్యలను శాఖాపరంగా వేగవంతంగా పరిష్కరిస్తున్నాం.
*▪️తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి*
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️విశ్వవిద్యాలయాల్లో*
 *స్పాట్‌ కోటాలో సీట్ల భర్తీ✍️📚*
*🌻ఈనాడు, అమరావతి:* విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటాలో మిగిలిన సీట్లను స్పాట్‌ కోటా కింద భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈఏపీసెట్‌, ఈసెట్‌ మినహా మిగతా అన్ని కోర్సుల్లోనూ స్పాట్‌ కోటాలో భర్తీ చేసుకునే వీలు కల్పించింది. ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఉండాలనే నిబంధన విధించారు. ఈ నెల 20 నుంచి వర్సిటీల వారీగా స్పాట్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్లు ఇస్తారు. ప్రతి సంవత్సరం వందల్లో సీట్లు మిగులుతుండడంతో స్పాట్‌ కింద భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఉన్నత విద్యామండలి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ మెమో జారీ చేసింది. స్పాట్‌లో చేరేవారికి బోధన రుసుముల చెల్లింపు వర్తించదు. విద్యార్థులే ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఆరు జడ్పీలకు గ్రేడ్-2*
 *ప్రధానోపాధ్యాయలు✍️📚*
*🌻పెడన గ్రామీణం, న్యూస్టుడే:* బందరు డివిజన్లో 12 మండలాల్లో ఆరు జడ్పీ ఉన్నత పాఠశాలలకు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయ పోస్టుల్ని డీఈఓ తాహెరాసుల్తానా మంజూరు చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి వర్గోన్నతి పొంది ఆరు నుంచి పదో తరగతి వరకు 138 మంది విద్యార్థులు ఉన్న పాఠశా లలకు ఈ పోస్టుల్ని మంజూరు చేశారు. పల్లెతుమ్మలపాలెం జడ్పీ, కోడూరు జడ్పీ, బందరు మండలం కోన జడ్పీ, ఎదురుమొండి జడ్పీ, పెడన పట్టణ తోటమూల జడ్పీ, పెడన మండల నందమూరు జడ్పీ లకు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పోస్టుల్ని మంజూరు చేశారు. ఇప్పటి వరకు అదే పాఠశాలల్లో పని చేస్తోన్న సీనియర్ పాఠశాల సహాయక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. త్వరలో జరగనున్న కౌన్సెలింగ్లో ఈ పాఠశాలలకు గ్రేడ్-2 ప్రధానోపాధ్యా యులు కోరుకునేందుకు అవకాశం కల్పిస్తారని బందరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఆన్‌లైన్‌ దరఖాస్తులకు*
 *ఆహ్వానం✍️📚*
*🌻నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే :* ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొనే  విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు తెలిపారు. ఈమేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో జరిగే వివిధ సృజనాత్మక రచన పోటీల్లో పాల్గొని ప్రధానమంత్రి ఈవెంట్‌కు ఎంపికయ్యే అవకాశం పొందవచ్చని సూచించారు. 9వ తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నమోదు చేసుకునేలా మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️‘అక్రమ బదిలీలతో*
 *పారదర్శకత ఎలా?’✍️📚*
*🌻కడప విద్య, న్యూస్‌టుడే :* ఉపాధ్యాయ బదిలీలకు షెడ్యూల్‌ విడుదల చేసి, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు నిర్వహించడం పారదర్శక పాలనలో భాగమా అని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ్‌కుమార్‌, పాలెం మహేష్‌బాబు ప్రశ్నించారు. గురువారం స్థానిక యూటీఎఫ్‌ భవన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. తమ పాలన పారదర్శకతకు మారుపేరని పదే పదే ప్రకటించుకునే రాష్ట్ర ప్రభుత్వం, దొడ్డిదారిన ప్రభుత్వ ఉత్తర్వులతో అక్రమ బదిలీలు నిర్వహించడం దుర్మార్గమన్నారు. అక్టోబరులో చేపట్టాల్సిన బదిలీలు డిసెంబరు వరకూ నిర్వహించకుండా కాలయాపన చేయడం అక్రమ బదిలీల కోసమేనని తేటతెల్లమవుతోందన్నారు. సిఫార్సు బదిలీలతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సిఫార్సు బదిలీలను రద్దుచేసి తమ పారదర్శకతను, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్‌కుమార్‌, రమణ, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️864 మంది గురువులకు*
 *స్థానచలనం✍️📚*
*♦️అదనంగా ఉన్న పాఠశాలల నుంచి బదిలీ*
*🌻ఒంగోలు నగరం, న్యూస్‌టుడే:* ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో తొలి అంకం కొలిక్కి వచ్చింది. పాఠశాలల్లో నిర్దేశించిన విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా ఉన్న ఉపాధ్యాయులను బదిలీ చేసేందుకు జాబితా సిద్ధం చేశారు. ఆ సమాచారాన్ని డీఈవో కార్యాలయం నుంచి మండల విద్యాశాఖాధికారులకు పంపించారు. ఆ మేరకు ఆ ఉపాధ్యాయులు కూడా బదిలీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో 90 మంది విద్యార్థులకు ఒక సబ్జెక్టు టీచర్‌ కొనసాగాల్సి ఉంటుంది. ఆ లెక్క మించి ఉంటే అటువంటి ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. ఆ విధంగా ఉమ్మడి ప్రకాశంలో 864 మందికి స్థాన చలనం కలగనుంది. దాదాపు 700 పాఠశాలల్లో అదనంగా ఉన్నట్లు సమాచారం.
*♦️ధ్రువపత్రాల సమస్య*: బదిలీ అయ్యేవారు ఆన్‌లైన్‌లో ఈనెల 17 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు ఉన్న ఉపాధ్యాయులు, అయిదేళ్లు పూర్తయిన హెచ్‌ఎంలు తప్పనిసరిగా దరఖాస్తుచేయాలి. సున్నా సర్వీసు ఉన్నవారికి బదిలీ కోరుకునే అవకాశం కల్పించినప్పటికీ అది వారి ఇష్టం మేరకు ఆధారపడి ఉంటుంది. ప్రాధాన్య కేటగిరీలైన క్యాన్సర్‌, గుండె జబ్బులు, డయాలసిస్‌ చేయించుకునే వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జీజీహెచ్‌ మెడికల్‌ బోర్డు ఇచ్చే ధ్రువపత్రం సమర్పించాలి. వారికి అదనపు మార్కులు కేటాయిస్తారు. ఆరు నెలల లోపు తీసుకున్న వైద్య ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. బదిలీలు జరిగి దాదాపు ఆరేళ్లు అయినందున కొత్తగా ఈ తరహా వ్యాధుల బారిన పడినవారు ఇప్పటికిప్పుడు పత్రాలు సాధ్యంకాక ఇబ్బందులెదుర్కొంటున్నారు. కొంతమంది జీజీహెచ్‌లో సంప్రదించగా ఈనెల 17లోపు ఇవ్వడం కష్టమని చెప్పినట్లు సమాచారం.
*♦️వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు:* ఆన్‌లైన్‌లో బదిలీకి దరఖాస్తు చేసినవారిలో కొంతమందికి ఓటీపీ రావడంలేదు. అటువంటివారు విద్యాశాఖ కార్యాలయంలో 85209 25309 నంబరుకు సంప్రదిస్తే ఓటీపీ చెప్పే ఏర్పాట్లు చేశారు. పదోన్నతిపొందిన ఉపాధ్యాయుడు తన కేడర్‌ మారి అదే పాఠశాలలో పనిచేస్తుంటే పాత సర్వీసు మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సీనియారిటీ జాబితా తయారు చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు పాఠశాలల్లో ఉన్న ఖాళీలను బదిలీల కోసం చూపించారు.
*♦️ఆ 11 మందికి నేతల సిఫార్సులు*
ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు నేరుగా ప్రభుత్వం నుంచి బదిలీ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులు ఉమ్మడి ప్రకాశంలో 11 మంది ఉన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన సమావేశంలో నేరుగా వారి వివరాలను ఆయా విద్యాశాఖ అధికారులకు అందజేశారు. వారు కోరుకున్న స్థానాలు కేటాయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణ బదిలీలు పొందిన వారితోపాటు వారికి కూడా డీఈవోలు ఉత్తర్వులు అందజేస్తారు. ఎక్కువ మంది 20 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందడానికి అవకాశం ఉన్న పోస్టులకు ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు సమాచారం. ముందుగా ఈ విషయాన్ని బయట పెడితే సంఘాలు ప్రశ్నించే అవకాశం ఉన్నందున గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. పరిశీలన సమయంలో వైద్య పత్రాలు
ప్రాధాన్య కేటగిరీల ఉపాధ్యాయులు తొలుత ఆన్‌లైన్‌లో బదిలీ దరఖాస్తు చేసుకొని, పరిశీలన సమయంలో వైద్య ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చు. గతంలో ఈ పత్రం పొందినవారి వివరాలు సర్వీసు రిజస్టర్‌లో నమోదై ఉంటే సరిపోతుంది. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కొంతమంది ఇప్పటికే శాశ్వత పత్రం పొంది ఉన్నట్లయితే అవి  ఇవ్వవచ్చు.
 *▪️బి.విజయభాస్కర్‌, డీఈవో*
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఇంటర్‌ ప్రథమ ఏడాది*
 *ఫీజు గడువు జనవరి 7📚✍️*
*🌻ఈనాడు, అమరావతి:* ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫీజులను జనవరి ఏడో తేదీలోపు చెల్లించాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. అపరాధ రుసుములతో 25వరకు అవకాశం కల్పించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️బదిలీల్లో సిఫారసులకు*
 *పెద్దపీట!✍️📚*
*🌻అనంతపురం విద్య, న్యూస్‌టుడే:* ఎంతో కాలంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల సమీపంలోని స్థానాలు దక్కడం కష్టమే. ఉమ్మడి అనంత జిల్లాలో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫారసు లేఖలతో కోరుకున్న స్థానాలకు బదిలీ చేయించుకోవడానికి పావులు కదుపుతున్నారు. సిఫారసుల మేరకు సీల్డ్‌కవర్లలో ప్రభుత్వం నుంచి అధికారులకు జాబితా అందినట్లు సమాచారం. దొడ్డిదారిలో బదిలీలు ఉత్తర్వులు వచ్చినట్లు తెలియడంతో పలువురు ఉపాధ్యాయులు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి వెళ్లారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 30 మంది సిఫారసు బదిలీలు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. 2020లోనూ కొందరు అనువైన స్థానాల్లో చేరారు. తాజాగా మరికొందరు పావులు కదుపుతున్నారు. దీంతో నగరం, పట్టణాలకు సమీపంలోని పాఠశాలల్లో ఖాళీలన్నీ భర్తీ అయినట్లు తెలుస్తోంది.
*♦️పదేళ్లుగా పనిచేసినా అంతే..*
ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసే ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. కొందరు పదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువశాతం మందికి కోరుకున్న స్థానాలు దక్కేపరిస్థితి లేదు. ప్రత్యేక కేటగిరిలో స్పౌజ్‌, దివ్యాంగులు తదితరులు ఉన్నారు. వారికి స్థానాలు కేటాయించిన తరువాతనే సాధారణ ఉపాధ్యాయులకు అవకాశం ఇస్తారు. దీంతో దగ్గర పాఠశాలలకు వచ్చే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు.
*♦️ఖాళీలపై స్పష్టత ఏదీ?*
సిఫారసు బదిలీల కారణంగా కొన్ని స్థానాలు బ్లాక్‌లో ఉంచారు. ఖాళీలు 12, 13 తేదీల్లోనే వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి రెండ్రోజులు మాత్రమే గడువుంది. ఖాళీలు తెలియకుండా ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తుకు 17వ తేదీ వరకూ గడువుందని ఆలోపు ఖాళీలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️గురువుల బదిలీలకు వేళాయె✍️📚*
*♦️ఆన్‌లైన్‌లో తప్పుల తడకగా వివరాలు*
*🌻విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే*: గురువుల బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. పాఠశాల విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయుల చరవాణులకు వచ్చిన పాస్‌వర్డ్‌ ఆధారంగా వారు లాగిన్‌ అవుతున్నారు. ఆ వెంటనే టిస్‌ (టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) డేటా డిస్‌ప్లే అవుతోంది. ఇందులో పొందుపర్చిన సమాచారం తప్పుల తడకగా ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దరఖాస్తులకు 17వ తేదీ ఆఖరు కావడంతో వారిలో ఆందోళన నెలకొంది.
*♦️ఏమిటీ ‘టిస్‌’..*
ఉపాధ్యాయుడి సమగ్ర సమాచారం టిస్‌లో ఉంటుంది. ఇందులో అయిదు నెలల క్రితమే  సమాచారాన్ని క్రోడీకరించి పొందుపర్చగా కొందరి వివరాల్లో తప్పులు దొర్లాయి. వాటిని ఎంఈవోల లాగిన్‌లో సరిచేయాలి. వారికి పని ఒత్తిడి వల్ల చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బదిలీల్లో ‘టిస్‌’ డేటాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. సర్వీసు వివరాలు తప్పులతో పాయింట్లు కోల్పోయి ప్రమాదముందని గురువులు గగ్గోలు పెడుతున్నారు.
*♦️కొలిక్కిరాని ఖాళీలు*
ఉపాధ్యాయ ఖాళీలు నేటికీ కొలిక్కి రాలేదు. మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న వారు, క్లియర్‌ వేకెన్సీలు, హేతుబద్ధీకరణతో ఏర్పడిన ఖాళీలను బట్టి గురువులకు బదిలీల్లో కోరుకునే అవకాశం కల్పిస్తారు. ఆయా ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి. బుధవారం అమరావతిలో డీఈవోల సమావేశం నేపథ్యంలో ఖాళీల నిర్ధరణకు ఈ నెల 12, 13 తేదీల్లో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించారు. మళ్లీ ఎంఈవోలతో మరోమారు ఖాళీల నిర్ధ్దరణకు శుక్రవారం సమావేశం నిర్వహిస్తున్నారు.
*♦️నేడు ధ్రువపత్రాల నిజనిర్ధారణ*
ఉమ్మడి జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ(వైద్యం)కి సంబంధించి శుక్రవారం ధ్రువపత్రాల నిజ నిర్ధారణ జరగనుంది. ఉదయం పది గంటలకు విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి ధ్రువపత్రాలతో హాజరు కావాలని డీఈవో తెలిపారు. స్పౌజ్‌, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు కేన్సర్‌, ఓపెన్‌ హార్ట్‌ ఆపరేషన్‌, ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌, న్యూరో సర్జికల్‌ ఆపరేషన్‌, కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌, డయాలసిస్‌, విజువల్‌ ఛాలెంజ్‌డ్‌, ఆర్థోపెడిక్‌ ఛాలెంజ్‌డ్‌, 70 శాతం వైకల్యం తగ్గకుండా ఉన్న వారు, మెంటల్లీ ఛాలెంజ్‌డ్‌ వారు హాజరుకావాలని కోరారు.
*♦️రాతపూర్వకంగా ఇవ్వాలి*
ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చారు. నా లాగిన్‌లో సరిచేసుకునే వీలుంది. ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల నుంచి రాతపూర్వకంగా తీసుకొస్తే సరిచేస్తాం. ఆన్‌లైన్‌లో ఖాళీల వివరాలు పెట్టిన తర్వాత సరిచేసుకునే అవకాశం ఉండదు. ఐచ్ఛికాలకు ఇంకా సమయం ఉన్నందున మళ్లీ ఎంఈవోలతో సమావేశం పెట్టి నిర్ధరిస్తాం.
*▪️బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, విజయనగరం*
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఆదర్శ పాఠశాలల*
 *సిబ్బందికి సీపీఎస్‌✍️📚*
*🌻ఈనాడు, అమరావతి:* ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బందికి కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) అమలుకు ట్రెజరీ, అకౌంట్స్‌ విభాగం ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది డిసెంబరు నెల జీతాల్లో సీపీఎస్‌ వాటాను మినహాయించాలని సూచించింది. ఇప్పటి వరకు ఆదర్శ పాఠశాలల సిబ్బందికి ఎలాంటి మినహాయింపులు లేకుండా వేతనాలు చెల్లిస్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️బయట పిల్లల్ని బడిలో చేర్పించేందుకు ప్రత్యేక యాప్‌✍️📚*
*🌻ఈనాడు, అమరావతి*: బడి బయట పిల్లలను బడిలో చేర్పించేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ సూచించారు. బడిమానేసిన పిల్లలకు కనీసం నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ప్రత్యేక శిక్షణ అవసరమని వెల్లడించారు. విజయవాడలో గురువారం ‘నేనూ బడికిపోతా’ మొబైల్‌ యాప్‌, పోర్టల్‌ను ఆవిష్కరించారు. బడిబయట పిల్లల్ని గుర్తించి, బడిలో చేర్పించేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చారు. బడిమానేసిన పిల్లలను గుర్తించేందుకు ఇప్పటి వరకు వాలంటీర్లు చేసిన సర్వేను ఈ యాప్‌, పోర్టల్‌తో అనుసంధానం చేస్తారు. ఈ సమాచారంతో పాఠశాల విద్యాశాఖ పిల్లల్ని మరోసారి గుర్తిస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల వయసుకు తగినట్లుగా నేర్చుకునే సామర్థ్యాన్ని గుర్తించి, తరగతిలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్‌ ఏఎస్పీడీలు శ్రీనివాసరావు, శ్రీనివాసులరెడ్డి, యూనిసెఫ్‌ విద్యా విభాగం ప్రతినిధి గణేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️అన్ని తరగతులకు*
 *సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలే✍️📚*
*♦️1-7 తరగతులకు గణితం, ఆంగ్లం మార్పు* 
*♦️6, 7 తరగతులకు సామాన్య శాస్త్రంలో*
  
*♦️సాంఘిక శాస్త్రం ఒక్కటే రాష్ట్ర సిలబస్‌*
*🌻ఈనాడు, అమరావతి*: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-7 తరగతులకు సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్య పుస్తకాలు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతిలో అమలు చేస్తుండగా.. ఇక మొత్తం అన్ని తరగతులకు సీబీఎస్‌ఈ పుస్తకాలనే అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1 – 7 తరగతులకు గణితం, ఆంగ్ల పాఠ్యపుస్తకాలు, 6, 7 తరగతులకు సామాన్యశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి కొత్త పుస్తకాలు ఇస్తారు. సాంఘిక శాస్త్రం మాత్రం రాష్ట్ర సిలబస్‌ ఇస్తారు. ఇందులో ఏపీ చరిత్ర ఉంటుంది. సీబీఎస్‌ సిలబస్‌లో దేశ చరిత్ర మాత్రమే ఉంటుంది. అందుకే సాంఘిక శాస్త్రం వరకు రాష్ట్ర సిలబస్‌ పుస్తకం ఇవ్వనున్నారు. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాలను సీబీఎస్‌ఈ అనుసరిస్తుంది. ఎనిమిదో తరగతి నుంచే సీబీఎస్‌ఈ ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను రూపొందిస్తోంది. కింది తరగతులకు సిలబస్‌ను సూచిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎన్‌సీఈఆర్టీ సూచించిన సిలబస్‌ ఆధారంగా పాఠ్య పుస్తకాలను అందిస్తారు. వచ్చే ఏడాది తొమ్మిదో తరగతికి వీటినే అందిస్తారు. రాబోయే రోజుల్లో అన్ని తరగతులకు సీబీఎస్‌ఈ పుస్తకాలు ఇచ్చినా.. బోర్డు అనుమతి లేని బడుల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం రాష్ట్ర బోర్డే పరీక్షలు నిర్వహిస్తుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ చదివినా రాష్ట్ర బోర్డు పరీక్షలే రాయాల్సి ఉంటుంది. కరిక్యులమ్‌ పునఃసమీక్షపై నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యా సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈనెల 21 నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. 2020-21 నుంచి దశలవారీగా పాఠశాలలను సీబీఎస్‌ఈతో అనుసంధానం చేయడం వల్ల 8, 9 తరగతుల పాఠాలను ముందు తరగతి పాఠ్యాంశాలకు అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ మాజీ వీసీ వెంకటరామిరెడ్డి, సమగ్ర శిక్ష అదనపు రాష్ట్ర పథక సంచాలకుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*’📚✍️నేనూ బడికి పోతా’*
 *యాప్ ఆవిష్కరణ✍️📚*
*🌻అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి)*: బడి బయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘నేనూ బడికి పోతా’ మొబైల్ యాప్, వెబ్ పోర్టలు పాఠశాల విద్య కమిషనర్ సురేష్కుమార్ గురువారం విజ యవాడలో ఆవిష్కరించారు. వయసుకు తగ్గట్టుగా, నేర్చుకునే సామర్థ్యాన్ని బట్టి పిల్లలను తరగతుల్లో చేర్చుకోవాలన్నారు. సమగ్రశిక్ష అదనపు ఎస్పీడీ బి.శ్రీనివాస రావు మాట్లాడుతూ… సచివాలయాల సిబ్బంది సర్వే చేసి బడి బయట పిల్లలను గుర్తించారన్నారు. ఆ పిల్లలను బడిలో చేర్పించడం అందరి బాధ్యత అన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!