PRESS NOTE ON AP SSC ADVANCED SUPPLIMENTRY EXAMS RESULTS JULY 2022
ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం
ఆంధ్ర ప్రదేశ్ : విజయవాడ
పత్రికా ప్రకటన
SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ & బెటర్మెంట్ పరీక్షలు – జూలై 2022
విద్యార్థుల సంఖ్య:
ఈ సంవత్సరము పదోతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 06-07-2022 నుండి
15-07-2022 వరకు నిర్వహించబడినవి. స్పాట్ వాల్యుయేషన్ 18-07-2022 నుండి
20-07-2022 వరకు నిర్వహించబడినది. ఈ పరీక్షకు 2,06,648 మంది విద్యార్ధులు నమోదు
చేసుకున్నారు.
ఈ పరీక్షల యొక్క ఫలితములు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారి కార్యాలయం యొక్క వెబ్ సైటు
www.bse.ap.gov.in నందు పొందుపరచడమైనది.
ముఖ్య వివరములు:
> రాష్ట్రంలో పదవతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 64.23%
> బాలుర ఉత్తీర్ణత శాతం 60.83% కాగా బాలికల ఉత్తీర్ణత శాతం 68.76%
> బాలికలు బాలుర కంటే 7.93% ఉత్తీర్ణత శాతంతో ఆధిక్యత సాధించారు.
> రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అన్ని జిల్లాల కంటే 87.52% శాతం ఉత్తీర్ణత సాధించి ప్రధమ స్థానంలో
ఉన్నది. అదే విధముగా రాష్ట్రములో పశ్చిమ గోదావరి జిల్లా అన్ని జిల్లాలకంటే అతి తక్కువ
శాతం అనగా 46.66 % శాతం సాధించి చివరి స్థానంలో ఉన్నది.
DOWNLOAD AP SSC ADVANCED SUPPLIMENTRY EXAMS RESULTS JULY 2022 RESULTS