TS DEECET: ఆగస్టు 22 నుంచి డీఈఈసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్!
2022-24 విద్యా సంవత్సరానికి గానూ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రవేశాల నిమిత్తం.. జులై 23న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10న ఫలితాలను వెల్లడించారు.
TS DEECET: ఆగస్టు 22 నుంచి డీఈఈసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్!
తెలంగాణ డీసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2022
తెలంగాణ రాష్ట్రంలో డీఈఈసెట్లో ఉత్తీర్ణులైన వారికి ఆగస్టు 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. పూర్వపు జిల్లా కేంద్రాల్లోని డైట్ కళాశాలల్లో పరిశీలన జరుగుతుంది. మొత్తం 6550 మంది అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నారు. ఆగస్టు 22న 3391 మంది అభ్యర్థులకు; ఆగస్టు 23న 1509 మంది అభ్యర్థులకు; ఆగస్టు 24న 1117 మంది అభ్యర్థులకు; ఆగస్టు 25న 533 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఒకవేళ ఆగస్టు 25న పూర్తికాని అభ్యర్థులకు ఆగస్టు 26న ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు.