SSC STENOGRAPHER GROUP C&D RECRUITMENT 2022
న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు…
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్)
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి (గ్రూప్-సి)
ఖాళీలు: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను బట్టి పోస్టుల సంఖ్య నిర్ణీత సమయంలో వెల్లడిస్తారు.
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయోపరిమితి: 01.01.2022 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్ డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 20.08.2022 నుంచి 05.09.2022 వరకు.
ఆఫ్‌లైన్ చలాన్ రూపొందించడానికి చివరి తేదీ: 05.09.2022.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 06.09.2022
చలాన్ ద్వారా చెల్లింపు చివరి తేదీ: 06.09.2022.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: నవంబర్, 2022.
Online Application for SSC Stenographer Grade C and D Recruitment 2022
Notification for SSC Stenographer 2022 Notification