AP EAPCET Counselling Dates 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ (AP EAPCET 2022 Counselling Dates)
విడుదలైంది. ఎంపీసీ స్ట్రీమ్ ప్రవేశాలకు సంబంధించి ఆగస్టు 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కన్వీనర్ పోలా భాస్కర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 సహాయకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈఏపీసెట్‌లో మొత్తం 1,73,572 మంది అర్హత సాధించారు. వీరిలో ఎంపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు మొదట కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://eapcet-sche.aptonline.in/EAPCET/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
- ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: ఆగస్టు 22 – 30
- సర్టిఫికెట్ల పరిశీలన: ఆగస్టు 23 – 31
- కాలేజీలు, కోర్సుల ఎంపికకు ఆప్షన్ల నమోదు: ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 2
- ఆప్షన్లలో మార్పు: సెప్టెంబరు 3న
- సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 6న
- కాలేజీల్లో రిపోర్టింగ్: సెప్టెంబరు 6 – 12
- తరగతులు ప్రారంభం: సెప్టెంబరు 12 నుంచి