AP Teachers Promotion Relinquishment, Charges Pending Details Submission

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

 AP Teachers Promotion Relinquishment, Charges Pending Details Submission

Relinquishment Details Data submission: MEO లకు సూచనలు

ఆన్లైన్ పదోన్నతులలో భాగంగా ఉపాధ్యాయ ప్రమోషన్ విషయమై మరికొన్ని అవసరమైన వివరాలు పొందుటకై కొత్త సర్వీసు ఎనేబుల్ చేయడమైనది. ఇది మండల విద్యా శాఖ అధికారులు ధృవీకరించిన వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపడం ద్వారా ఫైనల్ కన్ఫర్మేషన్ చేసుకోవడం జరుగుతుంది. క్లుప్తంగా ఇలా…

1. sims.ap.gov.in/TPM అనే లింక్ లోకి వెళ్ళాలి.

2. జిల్లా విద్యాశాఖ అధికారి వారి ద్వారా యూజర్ ఐ డీ మరియు పాస్ వర్డ్ పొందాలి.

3. User ID మరియు password, captcha కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వవలెను. 

4. లాగిన్ అవగానే password రీసెట్ చేసుకోమని కొత్త పాపప్ విండో వస్తుంది.

5. Password రీసెట్ చేసుకొని తిరిగి కొత్త password తో లాగిన్ అవగానే… 

6. Management సెలక్షన్ చేసుకొని పాఠశాల సెలక్షన్ చేసుకొంటే… ఆ పాఠశాల లోని ఉపాధ్యాయుల వివరాలు వస్తాయి.

7. ఇందులో కొన్ని వివరాలు ఆటోమేటిక్ గా వస్తాయి.

8 విండో చివరలో Relinquishment చేశారా అని అడుగుతుంది.అనగా గతంలో ఈ ఉపాధ్యాయునికి పదోన్నతి అవకాశం వచ్చినప్పుడు వ్యక్తిగతకారణాలతో తిరస్కరించారు అనుకొందాము. అప్పుడు yes సెలక్షన్ చేసుకొనండి.ఇప్పుడు ఎన్నిసార్లు relinquishment చేశారు అని అడుగుతుంది. అది కూడా సెలక్షన్ చేయాలి.ఇంతవరకు మీకు ప్రమోషన్ అవకాశం రాకపోతే No సెలక్షన్ చేయాలి..

9. తదుపరి DSC ర్యాంకు ఎంటర్ చేయాలి.

10. తదుపరి Charges pending అనే ప్రశ్న వస్తుంది.

ఆ ఉపాధ్యాయుని పై ఏవైనా కేసులు ఉంటే ఆ వివరాలు yes అని సెలక్షన్ చేసుకొని, details అనే ఫీల్డ్ లో కేసు వివరాలు నమోదు చేయాలి. ఏ కేసులూ లేకుంటే No సెలక్షన్ చేస్తే చాలు. ఇది ఉపాధ్యాయ వ్యక్తిగత బాధ్యత పై వారి నుండి వివరాలు సేకరించి సమర్పించవలెను.

11. ఇలా ఈ ఉపాధ్యాయుని ఎదురుగా మొదట్లో ఉన్న check box పై క్లిక్ చేసి సమర్పించవలెను.

12. ఇలాసమర్పించే సందర్భంలో ఒక్కొక్క ఉపాధ్యాయునివి లేదా కొంతమందివి లేదా అందరివీ ఒకేసారి సబ్మిట్ చేసే వెసులుబాటు ఉంది.

13. ఈ విధంగా ఆ మండల విద్యా శాక అధికారి తన పరిధిలోని అందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు వివరాలు సమర్పించవలెను.

14. మీరు వివరాలు సబ్మిట్ చేయగానే వారి వివరాలు DEO గారి లాగిన్ లోకి వెళ్ళి పోతాయి.

15. అంటే ఎప్పటికప్పుడు పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ వివరాలు మీకు తెలిసిపోతాయి.

16. ఒకవేళ ఏవైనా తప్పుగా సబ్మిట్ చేసి ఉంటే మీ DEO గారికి రాతపూర్వకంగా తెలియజేయగలరు. వారి లాగిన్ లో ఎడిట్ కి అవకాశం ఉంది.

Login Link click here

Relinquishment Details Data proforma pdf download

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!