EMRS – 2023 Result Released for 10,391 Teaching and Non-Teaching Staff Posts.దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాల (EMRS)ల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు (EMRS Exam Results) ను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ జనవరి 22 నాడు విడుదల చేసింది. మొత్తం 10,391 బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్ పోస్టులకు డిసెంబర్ 16, 17, 23, 24 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. భారీ సంఖ్యలో అభ్యర్థులు రాసిన ఈ పరీక్షలో ఎంపికైన వారి వివరాలను పీడీఎఫ్‌ల రూపంలో విడుదల అయ్యాయి.తాజాగా పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని జనవరి 3న విడుదల చేశారు. ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తాజాగా ఫలితాలను విడుదల చేశారు.
EMRS – 2023 Result for 10,391 Teaching and Non-Teaching Staff Posts
EMRS – 2023 key for 10,391 Teaching and Non-Teaching Staff Posts