IB SYLLABUS IN AP SCHOOLS: The Andhra Pradesh government has taken a historic decision to introduce the International Baccalaureate (IB) syllabus in government schools. This move aims to raise the educational standards to an international level and provide quality education to students. The state government has signed an agreement with the IB Organization, and the curriculum will be made available to students in over 45,000 government schools. The introduction of the IB syllabus is expected to nurture critical thinking, creativity, and global citizenship among students.
IB curriculum for AP government schools
The government of Andhra Pradesh has chosen to implement the International Baccalaureate (IB) curriculum in public schools, making it the first state to do so.Today, the state government and the International Baccalaureate organization signed a Memorandum of Understanding to bring public schools up to level with private ones in terms of amenities as well as curriculum and course offerings.
The introduction of the IB curriculum in schools has received permission from the state Cabinet. The state’s educational structure would be seamlessly adapted to include the IB syllabus, according to a directive by the chief minister, YS Jagan Mohan Reddy. It is anticipated to be put into effect during the following school year.
Olli-Pekka Heinonen, director of IB, and Matt Costello, chief business development officer, were practically present when the Memorandum of Understanding was signed. Chief Minister YS Jagan Mohan Reddy spoke at the event and emphasized the need of giving the state’s students access to top-notch educational opportunities. The IB students’ diplomas, according to him, would be respected all over the world.
He also agreed that implementing the IB syllabus would be difficult. Only a small number of corporate schools often use the IB curriculum, and they charge parents outrageous fees.Since taking office, the Chief Minister has placed a high priority on schooling, renovating government facilities to give pupils access to better restrooms, drinking water, laptops, interactive whiteboards, and other physical infrastructure.
ఐబీ సిలబస్ ఏంటీ?
International Baccalaureate: ఇంటర్నేషనల్ బాకలారియేట్(IB) ఎడ్యుకేషన్ బోర్డు అంటే ఏంటి?
ఈ బోర్డు ఎందుకంత ప్రత్యేకమో తెలుసా?
International Baccalaureate: జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ఏపీలో ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టబోతున్నట్టు చెప్పారు.
దీంతో అసలు ఆ సిలబస్ ఏంటనే చర్చ మొదలైంది.
పోటీ పరీక్షలు, ఇతర కోర్సులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న నేటి యుగంలో ఐబీ సిలబస్ ఎలాంటి ప్రభావం చూపుతోందో ఓ సారి చూద్దాం.
🌼ఐబీ అంటే ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ అని అర్థం.
ఇది ఒక నాన్ ఫ్రాఫిట్ ఫౌండేషన్. పిల్లలపై పరీక్షలు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు 1960ల్లో స్విట్టర్జ్‌లాండ్‌కు చెందిన కొంత మంది టీచర్స్ తయారు చేసిన ప్రత్యేకమైన విద్యావ్యవస్థ ఇది.
1968లో స్విట్టర్జ్ లాండ్ లోని జెనీవాలోని దీన్ని స్థాపించారు. అప్పటి నుంచి మొదలై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 159దేశాల్లో ఈ విద్యావిధానం అమల్లో ఉంది.
🌼మూడేళ్ల నుంచి 19 ఏళ్ల వయస్సున్న విద్యార్థులకు వివిధ దశల్లో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేస్తారు. వీళ్లు. ఈ విద్యావ్యవస్థలో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి అధికారిక పరీక్షలు ఉండవు ఈ చదువులకు.
నేటి భారత దేశ విద్యా విధానంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం అయితే చాలు అనే ధోరణి కనిపిస్తోంది. కానీ నగరాల్లో మాత్రం రకరకాల బోర్డులు అందుబాటులో ఉండటం వల్ల ఏ బోర్డులో చదివించాలి, ఏ బోర్డు కింద చదివిస్తే భవిష్యత్ బాగుంటుంది అనే చర్చ కూడా సాగుతుంది.
స్టేట్ బోర్డు, CBSE, ICSE, CISCE, NIOS, IB, CIE ఇలా చాలా రకాల బోర్డులు ఉన్నాయి.
ఈ మధ్య IB (ఇంటర్నేషనల్ బాకలారియేట్) బోర్డుపై తల్లిదండ్రులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.
అసలు ఈ ఇంటర్నేషనల్ బ్యాకలారియేట్ బోర్డు అంటే ఏంటి? ఈ బోర్డుపై తల్లిదండ్రులు ఆసక్తి చూపించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నేషనల్ బాకలారియేట్(IB):-
ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) అనేది 3 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు అధిక నాణ్యతతో విద్యను అందించే ఓ ఎడ్యుకేషన్ బోర్డు.
🌼 ఇదో అంతర్జాతీయ లాభాపేక్ష లేని విద్యా సంస్థ.
🌼 ఈ విద్యా విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్ లాంటి నైపుణ్యాలు అలవడతాయి.
🌼 ఓపెన్-మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి.
🌼 ప్రపంచంలో సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
🌼 ఉన్నతా విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
🌼 ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ బోర్డులో చదువుకున్న పిల్లలను ప్రవేశాలు లభిస్తాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) ప్రోగ్రాములు
ప్రైమరీ ఇయర్స్ ప్రొగ్రామ్(PYP): PYP అనేది 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం. మొత్తం 10 సంవత్సరాల పాటు ఉండే ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులను అన్ని రకాలుగా సిద్ధం చేస్తారు.
ఏదైనా నేర్చుకునేలా, కుతూహలం, కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్, ఆలోచించడం లాంటివి నేర్పిస్తారు.
ఈ ప్రోగ్రామ్ లో ఎలాంటి పరీక్షలు కానీ, గ్రేడింగ్ కానీ ఉండవు.
PYP ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివరలో సైన్స్ ఎగ్జిబిషన్ లాంటిది నిర్వహిస్తారు.దాంతో పిల్లలను అసెస్ చేస్తారు.
మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్(MYP):
MYP అనేది 11 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉంటుంది. 5 సంవత్సరాల పాటు ఉండే ఈ MYP ప్రోగ్రామ్ లో అన్ని రకాల విద్యను ప్రోత్సహిస్తారు. ఇందులో మొత్తం 8 గ్రూపులు ఉంటాయి.
ఆర్ట్స్, లాంగ్వేజ్, లాంగ్వేజ్ అక్విజిషన్, మ్యాథ్స్, డిజైన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇండివిడ్యూవల్స్ అండ్ సొసైటీస్, సైన్సెస్ అనే 8 గ్రూపులు ఉంటాయి.
ప్రతి గ్రూపు నుంచి విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో పిల్లల నైపుణ్యాలను, ఎంత నేర్చుకుంటున్నారు అనే దానిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
డిప్లొమా ప్రోగ్రామ్(DP):
ఈ DP ప్రోగ్రామ్ 16 నుంచి 19 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే మూడేళ్ల పాటు ఈ డిప్లోమా ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, లాంగ్వేజీ అక్విజిషన్, సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్, ఇండివిడ్యూవల్స్ అండ్ సొసైటీస్ అనే 6 గ్రూపులు ఉంటాయి. డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివర్లో సర్ఠిఫికేట్ ఇస్తారు. ఈ డిప్లొమా సర్ఠిఫికేట్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోటా పని చేస్తుంది.
కెరీర్ రిలేటెడ్ ప్రోగ్రామ్(CP):
CP అనేది 16 నుంచి 19 సంవత్సరాలు ఉన్న విద్యార్థుల కోసం. ఇది విశ్వవిద్యాలయాలు, ఉపాధి, తదుపరి ట్రైనింగ్ కోసం విద్యార్థులను సిద్ధం చేసే రెండేళ్ల ప్రోగ్రామ్. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్ లో విజయం సాధించడానికి అసరమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందిస్తారు.
IB బోర్డు ప్రత్యేకతలు, ప్రయోజనాలు;
IB విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రశ్నలు అడగడం నేర్పిస్తారు. ఇది మంచి అభ్యాసకులుగా మారడానికి, సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది.
రాయడం, మాట్లాడటం, ప్రెజెంటేషన్ సహా వివిధ మార్గాల్లో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే నైపుణ్యాలు బోధిస్తారు. ఇది వారి చదువులో, వారి కెరీర్‌లో మరింత విజయవంతం కావడానికి సహాయపడుతుంది.
IB విద్యార్థులు విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల గురించి నేర్చుకుంటారు. ఇది వారికి మరింత సహనాన్ని, ఇతరులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది.
బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా IB విద్యార్థులను తయారు చేస్తారు. ఇది ప్రపంచంలో సానుకూల మార్పును తీసుకురావడానికి సహాయపడుతుంది.
ఇండియాలో ఎక్కడెక్కడ IB స్కూళ్లు ఉన్నాయి?
భారత్ లో 200 లకు పైగా IB వరల్డ్ స్కూల్స్ ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని PYP ప్రోగ్రామ్ వరకే విద్యను అందిస్తాయి. కొన్ని MYP వరకే ఉంటాయి. మరికొన్ని డిప్లొమా ప్రోగ్రామ్ ను మాత్రమే అందిస్తుంటాయి.
స్కూల్స్ సంబంధిత వివరాల కోసం www.ibyb.org సైట్ చూడవచ్చు.
అలాగే ఫీజులు స్కూళ్లను, వాటి స్థాయిని బట్టి ఫీజులు ఉంటాయి.
సంవత్సరానికి లక్షల్లోనే ఫీజులు ఉంటాయి. ముస్సోరి, కొడైకెనాల్, యూడబ్ల్యూసీ లాంటి స్కూళ్లలో ఫీజులు 20 లక్షలకు పైగానే ఉంటాయి.