APSRTC ACCEPTS DIGITAL AADHAR CARDS OF SENIOUR CITIZENS: ఏపీలోని సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఇకనుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేసీనియర్ సిటిజన్లు ఎటువంటి కార్డులు లేకుండానే టికెట్‌పై రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగుతున్న APSRTC బస్సుల్లో సీనియర్ సిటిజన్లు ఆరు రకాల ID కార్డులను చూపించడం ద్వారా ఛార్జీలపై 25 శాతం తగ్గింపు పొందుతున్నారు. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాస్‌పోర్ట్ మరియు రేషన్ కార్డ్ ఉన్నాయి. ఈ ఆరు కార్డుల్లో ఒకదానిని తీసుకెళ్లి బస్సు కండక్టర్‌కు చూపిస్తే రాయితీ టిక్కెట్ ఇవ్లేవబడుతుంది.లేకపోతే, డిస్కౌంట్ ఇచ్చేవారు కాదు.. అయితే, సీనియర్స్ కు వాటిని గుర్తుపెట్టుకుని తీసుకెళ్లడం కష్టంగా మారింది.
ఈ విషయమై సీనియర్ సిటిజన్ల నుంచి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. ప్రస్తుతం భౌతిక రూపంలో బస్సుల్లో అనుమతించే ఆరు ఐడీ కార్డులను డిజిటల్ రూపంలో కూడా అనుమతించాలన్నారు. ఈ వినతులను ప్రభుత్వం ఆమోదించింది. ఇక నుంచి ఈ కార్డులు డిజిటల్ రూపంలో ఉన్నా ఫోన్ లో వినియోగించుకునేలా అనుమతించాలని ఆదేశించారు. అయితే, ఇక్కడ డిజిటల్ రూపంలో ఉన్న ఆధార్ కార్డు మాత్రమే అనుమతించబడుతుంది.
ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే టిక్కెట్‌లతో పాటు ఓఆర్‌ఆర్‌ఎస్ ఆర్టీసీ కౌంటర్లలో, ఏటీబీ ఏజెంట్ల ద్వారా ఇచ్చే టిక్కెట్‌లకు కూడా ఇదే నిబంధన వర్తింపజేయాలని డీఎంలు, యాజమాన్యాలను ఆర్టీసీ ఈడీ ఆదేశించింది. దీనితో, ఈ మూడు స్థానాల్లోని సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డును ఫోన్‌లో చూపించటం ద్వారా 25 శాతం తగ్గింపుతో టిక్కెట్లను పొందవచ్చు.. ప్రభుత్వ నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.