TSTRT RECRUITMENT FOR 1523 SPECIAL EDUCATION TEACHERS: స్పెషల్ టీచర్ల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు రాష్ట్రంలో తొలిసారి 1523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ శనివారం(ఆగస్టు 26) జీఓ జారీ చేసింది.

TSTRT RECRUITMENT FOR 1523 SPECIAL EDUCATION TEACHERS

ఈ కొలువులను పాఠశాల విద్యాశాఖ నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) ద్వారా భర్తీ చేస్తామని తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం జీఓ జారీచేసింది. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 796, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 727 కొలువులను మంజూరు చేశారు. రాష్ట్రంలో మొత్తం 18,857 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాకు 91, అతి తక్కువగా సిరిసిల్ల జిల్లాకు 20 కొలువులు మంజూరు చేశారు.

జిల్లాల వారీగా స్పెషల్ టీచర్స్ పోస్టులు వివరాలు…

నాగర్‌కర్నూల్‌ 84, రంగారెడ్డి 78, సూర్యాపేట 74, కామారెడ్డి 72, నిజామాబాద్‌ 69, సంగారెడ్డి 65, కొత్తగూడెం 56, ఖమ్మం 56, యాదాద్రి 55, హైదరాబాద్‌ 54, మెదక్‌ 53, సిద్దిపేట 52, వికారాబాద్‌ 49, మహబూబ్‌నగర్‌ 43, నిర్మల్‌ 40, జగిత్యాల 39, ఆదిలాబాద్‌ 38, జనగామ 38, వరంగల్‌ 37, మహబూబాబాద్‌ 36, వనపర్తి 36, మంచిర్యాల 34, గద్వాల 31, నారాయణపేట 31, కరీంనగర్‌ 30, హనుమకొండ 30, మేడ్చల్‌ 30, పెద్దపల్లి 27, ఆసిఫాబాద్‌ 26, భూపాలపల్లి 25, ములుగు 24.

error: Content is protected !!