రాష్ట్రవ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులకు ఎనిమిది రోజులు జరిగిన రెసిడెన్షియల్ మోడ్ వృత్యంతర శిక్షణ ముఖ్యాంశాలు

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
రాష్ట్రవ్యాప్తంగా  ప్రధానోపాధ్యాయులకు ఎనిమిది రోజులు జరిగిన రెసిడెన్షియల్ మోడ్ వృత్యంతర శిక్షణ ముఖ్యాంశాలు
17-5-2023 నుండి 24-5-2023 వరకు
*లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించడమే దీని లక్ష్యం*
 *లీడర్ షిప్ క్వాలిటీస్  ఎలా ఉండకూడదో  కడప జిల్లా, వీరపునాయునిపల్లె మండలం లోని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యవహారం నుండి జాలు వారిన క్రింది కధనం*. 
✅ ప్రధానోపాధ్యాయుడు అనబడే వ్యక్తి పాఠశాలలోని అందరి సిబ్బందిని ఒకేలా చూడాలి
✅ పాఠశాలలోని సిబ్బందిలో ఒకరిద్దరిని తన తొత్తులుగా పెట్టుకొని వారు బెల్లు కొట్టిన తరగతి గదిలోకి 20 నిమిషాలు పోకపోయినా ఏమీ అనుకోకుండా ఉండకూడదు
✅ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడు తన తొత్తులుగా వ్యవహరించేటటువంటి ఒకరిద్దరు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేయకపోయినా వెనకేసుకొని రాకూడదు
✅ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడు పదవ తరగతి పిల్లలకు స్పెషల్ క్లాస్సులు నిర్వహించాలి అని పై అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చినప్పుడు తన తొత్తులకు అయితే స్పెషల్ క్లాసులు ఉండవని, మిగిలిన వారికైతే సాయంకాలం 5 వరకు తప్పకుండా ఉండాలని నియమాలు ఉండకూడదు
✅ పాఠశాలల్లోనే ప్రధానోపాధ్యాయుడు తన తొత్తులుగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు పాఠశాలకు 10 నిమిషాలు లేటుగా వచ్చిన చిరునవ్వుతో స్వాగతం పలికే చెప్పినట్టుగా ఉండకూడదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒకరిద్దరి ఉపాధ్యాయులను తన తొత్తులుగా నియమించుకొని పాఠశాల పనులు ,బోధనేతర కార్యక్రమాలు చేయించుకుంటూ కాలం లేదా పబ్బం గడపకూడదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన జీతం వస్తూ ఉంటే చాలు అనే విధంగా వ్యవహరించకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు  మరియు మూడవ తరగతి నుంచి అన్ని తరగతులకు సరిగా చదువు వస్తూ ఉన్నదా లేదా అని చూసుకోవాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిబ్బంది మధ్య సహృద్భావ వాతావరణ ఉండేటట్లు చూసుకోవాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిబ్బంది మధ్య సహృద్భావ వాతావరణాన్ని చూసి సహించలేనటువంటి లక్షణం, ఓర్వలేనటువంటి విధానం ఉండకూడదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తను మాత్రం ఆన్ డ్యూటీ సౌకర్యాలు వినియోగించుకుంటూ పాఠశాలకు తనేదో దైవదత్తము లేదా రాచరికము లేదా నిరంకుశ విధానము అనేటటువంటి పెడన దోరనులను విడనాడాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సర్వీసు పుస్తకములు తన తొత్తులకు మెడికల్ లీవులు తదితర వివరాలు నమోదు చేయకుండా వారికి ఆర్థిక ప్రయోజనం కలిగేటట్టు విధంగా వ్యవహరించకూడదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలకు వచ్చినటువంటి నిధులను సక్రమంగా ఖర్చు పెడుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలకు వచ్చినటువంటి నిధులను ఉపాధ్యాయులు అందరికీ పూర్తిస్థాయిలో తెలిసే విధంగా ప్రవర్తించాలి 1000 రూపాయలకు రెండు వేల రూపాయలకు కూడా కకృతి పడి జేబులో పెట్టుకొని తనను అడిగేవాడు లేడని వ్యవహరించడం లీడర్షిప్ క్వాలిటీ కాదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తనవరకు విచారణలు వచ్చినప్పుడు పాఠశాల సిబ్బంది అంతా ఒకటిగా ఉంటూ ఎదుర్కోవాలి అని ,మిగిలిన వారికి విచారణలు వచ్చినప్పుడు ఒకటికి రెండు జత చేసి వారికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించకూడదు. అందరికీ ఒకే నియమము ఉండాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒకప్పుడు పాఠశాల సహాయకులుగాను లేదా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను ఉండి ఉన్నాము అనేటటువంటి సూత్రము అనునిత్యము గుర్తించుకోవాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతిరోజు కనీసం నాలుగు లేదా ఐదు పీరిరెడ్లు అయినా తీసుకొని విద్యార్థిని విద్యార్థులకు బోధించాలి వారు కూడా లెసన్ ప్లాన్లు రాయాలి అదే లీడర్షిప్ అంటే. 
✅ పాఠశాల సిబ్బంది అడగకపోయినా పాఠశాల నిధులను ఎలా ఖర్చు చేసినారు వివరిస్తే లీడర్షిప్ క్వాలిటీ అవుతుంది
✅ పాఠశాల యాప్లు మిగతా సిబ్బంది చేస్తున్నప్పుడు ప్రధానోపాధ్యాయులు కనీసం రోజుకు మూడు పీరియడ్లు వెళ్లాలని నియమం గుర్తుండదా
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రోజుకు రెండు లేదా మూడు పీరియడ్లు బోధనకు వెళ్లకుండా, తను మాత్రం లెసన్ ప్లాన్ రాయకోకుండా, ఇతరులు మాత్రం రాయాలి అని అనుకోవడం ఎలా ఉంటుంది అంటే ఆవుపోయి చేలో మేస్తూ దూడను మాత్రం గట్టున మేయండి అనే సామెతగా ఉంటుందని గుర్తుంచుకోవాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాంప్లెక్స్ పరిధిలో ఉన్నట్లయితే తన కాంప్లెక్స్ పరిధిలో కూడా పాఠశాలల్లో సజావుగా నడిచేటట్లు ఆ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు సరిగా పాఠశాలకు వచ్చేటట్లు చూసుకోవాలి
✅ కాంప్లెక్స్ లో సంవత్సరంలో ఒక్కరోజు కూడా పర్యటన చేయకుండా పరిశీలన కోసం వినియోగించే డబ్బును ఎలా ఖర్చు పెడతారు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనేటటువంటి వారు మిగతా సిబ్బంది ప్రతిరోజూ మేము పాఠశాలకు వెళ్తున్నాము బోధించడానికి వెళ్తున్నాము అనేటటువంటి వాతావరణం వాళ్లకి ఉండాలి అని భావిస్తారు.అంతేగాని ఈరోజు పాఠశాలకు పోతున్నాం ఏమి జరుగుతుందో ఏమో ఈ హెడ్మాస్టర్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఏమో అని ప్రతిరోజు ఆందోళన కలిగించే విధంగా ఉండకూడదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనేటటువంటి వారు పాఠశాల కమిటీ చైర్మన్ ను ఏదో తన వైపు ఉన్నాడని తన ఇష్ట ప్రకారం చేసుకుంటూ వెళ్తే తనకేమీ కాదని ఆలోచన  విడనాడాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల నిధులు ఉపయోగించేటప్పుడు పేరెంట్స్ సంతకాలు దొంగవి చేసుకొని లేదా పిల్లలతో చేయించుకొని వారికి వివరంగా చెప్పకుండా నగదు డ్రా చేయకూడదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు పది నిమిషాలు లేటుగా వచ్చిన లేదా పాఠశాల చివరి సమయంలో పది నిమిషాలు ముందుగా వెళ్లిపోయిన అడిగే వారు లేరు అనేటటువంటి బ్రమను విడనాడాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన తొత్తులు అనబడేటటువంటి సిబ్బందికి తక్కువ పీరియడ్లు వేసి అనగా రోజుకు రెండు మూడు పీరియడ్లు మాత్రమే వేసి మిగిలిన సిబ్బందికి రోజుకు 7 పీరియడ్లు వేయకూడదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తనకు ముఖస్తుతి చేసేటటువంటి వారికి ఒక రకమైనటువంటి విలువ ఇస్తూ, నిజాయితీ నిక్కచ్చిగా ఉండేటటువంటి సిబ్బందికి ఇంకో రకమైనటువంటి విలువ ఇస్తూ కాలం గడుపుతూ ఉండకూడదు. పాఠశాల అనేది మీ నాన్నగారి సొత్తు కాదనేటటువంటి విషయం గుర్తుంచుకోండి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ యొక్క వ్యవహార శైలిపైన, విద్యార్థుల యొక్క వ్యవహార శైలి ఆధారపడి ఉంటారని అనునిత్యం గుర్తుపెట్టుకోండి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీకు బోధనేతర సిబ్బంది ఉంటే వారి చేతనే పాఠశాల రికార్డులు వ్రాయించుకోండి అంతేగాని మీకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బోధ నేతల పనులు బోధనా సిబ్బందితో చేయించుకుంటూ ఉంటే బోధన కుంటుపడి విద్యార్థుల జీవితాలు నాశనమైతాయని విషయం గుర్తుంచుకోండి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సెలవులు మంజూరు చేసేటప్పుడు తన తొత్తులుగా వ్యవహరించేటటువంటి వారికి ముందుగా సెలవులు మంజూరు చేసి ,మిగిలిన వారు సిబ్బంది మొత్తం సెలవు పెడుతున్నారు మీకు సెలవు ఇవ్వడం కుదరదు అనేటటువంటి దొంగ తిరుగుడు వ్యవహారం మానుకోండి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రధానోపాధ్యాయుడు తప్పు చేసిన ప్రధానోపాధ్యాయుల వారందరికీ ఈ నియమాలు వర్తిస్తాయనేటటువంటి విషయం గుర్తుంచుకొని మీ యొక్క వ్యవహార శైలి మీ యొక్క నడవడిక మార్చుకోవాలని అందరి అభిప్రాయం
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా గమనించాల్సినది ఏమంటే లార్డ్ కర్జన్ విభజించు పాలించు అనేటటువంటి సూత్రాన్ని ఎలా అమలు చేశాడో లేదో మనం చూడలేదు కానీ చాలామంది ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో విభజించు పాలించు అనేటటువంటి సూత్రాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. మిమ్మల్ని బ్రిటీష్ వారి వారసత్వం అని అనుకోవాలా
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లలతో నీళ్లు తెప్పించడం పిల్లలతో ఊడిపించడం ఇంకా చేస్తున్నారు. మీ పిల్లలతో కూడా ఇలాగే చెేయిస్తే మీరు అయితే ఒప్పుకుంటారా
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తన తొత్తులును ఎలా కాపాడుకోవాలో అని ఆలోచించక డ్రాపౌట్స్ ఎలా పాఠశాలకు రావాలి రెగ్యులర్గా విద్యార్థిని విద్యార్థులు ఎలా పాఠశాలకు రావాలి లేదా మధ్యాహ్న భోజన కార్యక్రమం ఎంత రుచికరంగా, శుభ్రతగా ఉండాలి అని ఆలోచిస్తే పాఠశాల దినదిన అభివృద్ధి జరుగుతుంది
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తన తొత్తులు అయినటువంటి వారు పాఠశాలలో సెల్ఫోన్లో సీరియల్ చూసుకుంటా ఉన్నప్పటికీ కూడా వారిని అభినందిస్తున్నారు అని అంటే ఎంత దిగజారుడు వ్యవహారమో అర్థం చేసుకోండి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ ఉపకార వేతన పరీక్ష 8వ తరగతి పిల్లలకు వ్రాయించేటట్లు చూసుకోవాలి. అంతేగాని ఇదొక భారము అనే విధంగా ఉండకూడదు .ఒకవేళ వ్రాయిస్తూ ఉన్నప్పటికీ తూతూ మంత్రంగా వ్రాయించుకోకుండా చూసుకోవాలి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల పిల్లలకు ఏవైనా ఉపకార వేతనాలు వస్తాయని అన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఆమోదం తెలిపితే చాలా మంచిది
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా వ్యవహరించాలని మర్చిపోకూడదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదని బ్రమ పడుతూ ఉంటుందట ఇటువంటి వ్యవహారం ప్రధానోపాధ్యాయులకు శుభ సూచకం కాదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రార్థన సమయంలో అందరికీ శుభోదయం చెప్పడానికి కూడా మీకు ఇబ్బందికరంగా మీకు ఇగో అడ్డు వస్తున్నది అని అంటే ఇంక మిమ్మల్ని ఎవరూ మార్చలేరు అనే విషయంగుర్తుంచుకోండి
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వెళ్ళినప్పుడు డిపార్ట్మెంటల్ గా లేదా చీఫ్ ఆఫీసర్గా వెళ్ళినప్పుడు ఒక పాఠశాల విద్యార్థులకు కాపీలు జరిపించి మరల వెనక్కి తీసుకోవడం ఇతర పాఠశాల విద్యార్థులకు భేదభావం చూపించడం ఇది తగినటువంటి చర్య కాదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవైనా సమాచార హక్కు చట్టంలో వివరాలను అడిగినట్లయితే ఒకటి రెండు వాటికి సమాధానం రాసి 30 రోజులు కాలయాపన చేసి మిగిలిన వాటికి మరల వచ్చినప్పుడు చూద్దాంలే అని సహనాన్ని పరీక్షించే విధంగా ఉండకూడదు
✅ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వ్యవహారం అటు గ్రామంలో గాని ఇటు ఉపాధ్యాయ సిబ్బందిలో గాని ఈయనకు జీతం దండగ, ఉద్యోగం ఉండడము అసలే దండగ, అనేటటువంటి అభిప్రాయము వారి మనసులలో ఉండకూడదు. 
 ✅ ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నప్పటికీ లేడీ టీచర్లను ఏడిపించి అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు జెంట్స్ స్టాఫ్ రూమ్లో ప్రగల్బాలు పలకకూడదు. మీ వాళ్ళు కూడా ఎక్కడో ఒకచోట లేడీ సిబ్బందిగా పనిచేస్తూ ఉంటారని గుర్తించుకోండి
✅ ప్రధానోపాధ్యాయులు లేడీ టీచర్లకు సపరేట్ స్టాఫ్ రూమ్ లేకుండా వారిని మానసిక ప్రశాంతత లేకుండా చేయాలని ఆలోచించకూడదు. ప్రశ్నించేవాడు ఉంటే ఒక రకం ప్రశ్నించేవారు లేకపోతే ఇంకొక రకం వ్యవహార శైలి అస్సలు ఉండకూడదు
✅ ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు వచ్చినామా పోయినామా క్యాలెండర్లో పేజీలు మారుతున్నాయా లేదా అని చూసుకుంటూ జీతం డబ్బులు జేబులో చూసుకోవడం కాదు. పాఠశాల మొత్తం వ్యవహారాన్ని సమర్థవంతంగా చూసుకోవాలి
 ✅ ప్రధానోపాధ్యాయులుగా ఉంటున్నప్పుడు మొదటి అసిస్టెంట్ల పైన మొదటి అసిస్టెంట్గా ఉన్నప్పుడు ప్రధానోపాధ్యాయుల పైన ఫిర్యాదులు చేసుకుంటూ ఉండడం తగినది కాదు
✅ పాఠశాల ఘనవిజయాలలో అంతా నా పాత్రే అంటూ డబ్బా కొట్టుకోవడం, పరాజయాలు ఎదురైనప్పుడు ఇతరుల మీదకి నెట్టివేయడం ప్రధానోపాధ్యాయులు కు లీడర్షిప్ లక్షణం కాదు
✅ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో నిర్వహించిన తలపెట్టిన కార్యక్రమాలలో తన తొత్తులు హాజరైతే చాలని పదవ తరగతి వీడ్కోలు సమావేశాలలో పిల్లలకు ఇష్టమైన ఉపాధ్యాయులు లేనప్పటికీ ఒకరోజు కాకుండా రెండు రోజులు వీడ్కోలు సమావేశాలు జరపడం వారి విజ్ఞతకే వదిలేద్దాం
✅ ప్రధానోపాధ్యాయులు తనకు తొత్తులుగా ఉంటున్నట్టు వంటి ఒకరిద్దరూ ఉపాధ్యాయులకు అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తూ పోతే ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా చేసుకుంటూ పోతే చదువు విద్యావ్యవస్థ ఎటు పోతుందో ఆలోచన చేయండి
✅ ప్రధానోపాధ్యాయులు తన తొత్తులకు రెండు మూడు పీరియడ్లకు మించి వేయరని ఎన్నో పాఠశాలలో నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. 
✅ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు ఒకటి లేదా రెండు దినపత్రికలు కూడా పాఠశాలలకు తెప్పించలేని పరిస్థితిలో ఉన్నారని అంటే ,వచ్చే నిధులను ఏమి చేస్తున్నట్లు
✅ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు ఒకటి లేదా రెండు దినపత్రికలు కూడా తెప్పించలేని పరిస్థితుల్లో ఉంటే పాఠశాల లైబ్రరీ సక్రమంగా ఏ విధంగా జరుగుతుందో ఊహిద్దాం
✅ ప్రధానోపాధ్యాయులు తనకు అనుకూలమైనటువంటి యూనియన్ లీడర్లు పాఠశాలకు వస్తే సాదరంగా ఆహ్వానించి శాలువాలు కప్పి డిన్నర్లు కూడా చేసి కేకులు కూడా కట్ చేసుకునే  అంత విషయం ఏముంటది అంతగా అనుబంధం ఉంటే మీ ఇంటికి తోడుకొని పోయి పెట్టుకోలేరా
✅ ప్రధానోపాధ్యాయులు తన తొత్తులకు ఎక్కువగా పరిమిషన్లు ఇచ్చి తనకు అనుకూలంగా లేనటువంటి వారికి నెలకు ఒక పర్మిషన్ కూడా ఈయనటువంటి పరిస్థితిలు ఉన్నారు అని అంటే బ్రిటీష్ వారి నిరంకుషత్వమే మేలేమో అనిపించక మానదు. 
✅ ప్రధానోపాధ్యాయుడు చీఫ్ డిపార్ట్మెంటల్ గా వెళ్ళినప్పుడు కొన్ని ప్రైవేటు పాఠశాలలతో కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు
✅ తన తొత్తులు పదవీ విరమణ సందర్భంలో లేదా తన తొత్తులు శుభకార్యములకు ప్రధానోపాధ్యాయులు అత్యుత్సాహం ప్రదర్శించి సభలను ఘనవిజయం చేస్తూ, ప్రశ్నించినటువంటి వారి సభలకు ఆటంకం కలిగిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాము.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!