TSPSC: 113 TS ASSISTANT MOTOR VEHICLE INSPECTOR NOTIFICATION
తెలంగాణ రాష్ట్రంలో 113 సహాయ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఉద్యోగ ప్రకటన (నం.31/2022) జారీ చేసింది. ఈ పోస్టులకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఏప్రిల్
23న రాత పరీక్ష జరుగుతుంది. మల్టీజోన్-1లో 54, మల్టీజోన్-2లో 59 ఏఎంవీఐ పోస్టులు ఉన్నాయి.
వివరాలు:
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్: 113 పోస్టులు
అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్). లేదా డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటారు వాహన(ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01/07/2022 నాటికి 21 – 39 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.45,960-రూ.1,24,150.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) పేపర్-1, పేపర్-2, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.320.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 12/01/2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01/02/2023.
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్ టైప్): 23/04/2023.