TODAY EDUCATION TEACHERS TOP NEWS 19/12/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
TODAY EDUCATION TEACHERS TOP NEWS 19/12/2022
*♻️51 మంది టీచర్లకు*
 *షోకాజ్‌ నోటీసులు..?♻️*
*♦️కోర్టుకెళ్లారని విద్యాశాఖ ఆగ్రహం*
*🪷అనంతపురం విద్య, డిసెంబరు 18:* 
ఉపాధ్యాయ బదిలీల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా 51 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు విద్యా శాఖాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 
2021లో అడహక్‌ ఉద్యోగోన్నతులు పొందిన టీచర్లు తాము పనిచేస్తున్న స్థానాలు ఖాళీ చూపకూడదనీ, తమనే కొనసాగించాలని కోరుతున్నారు. 
ఇటీవల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో వీరు కూడా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
 దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. విద్యాశాఖ అధికారులను ఆశ్రయించకుండా, నేరుగా కోర్టుకు వెళ్లడంపై వారికి నోటీసులు జారీ చేశారు. 
అనంతపురం జిల్లాలో 28, శ్రీసత్యసాయి జిల్లాలో 23 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
*_సచివాలయ సిబ్బందికి “బోధనేతర” బాధ్యతలు_*
*_వెల్ఫేర్ అసిస్టెంట్ కు బడి పిల్లల హాజరు పర్యవేక్షణ_*
*_ప్రతి స్కూల్ లోనూ ఫిర్యాదుల బాక్స్ – వాటి బాధ్యత మహిళా పోలీసులకు.._*
*_ఏఎన్ఎమ్, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు మధ్యాహ్న భోజన పర్యవేక్షణ_*
*_⛲సీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు⛲_*
*_🏮ఇచ్చిన హామీ నెరవేర్చాలి: ఎమ్మెల్సీలు_*
*_🏮జనవరిలో ఉద్యమం ఉధృతం : నక్కా వెంకటేశ్వర్లు_*
*_🏮యూటిఎఫ్ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో 4, 5 K వాక్_*

*⤴️ఉపాధ్యాయులకు _ఆన్లైన్లో_ కనిపించని పాయింట్లు..📋*

*_💥ఉపాధ్యాయ బదిలీ గందరగోళం💥_*
*_117 జీఓ అమలు ప్రభావం_*
*_సర్దుబాటు పేరుతో హడావుడి_*
*_2021 ఎస్ఏ పదోన్నతులకూ భంగపాటు_*
*_హైకోర్టును ఆశ్రయించిన 623 మంది_*
*_ఎస్ఏలకు హైకోర్టులో ఊరట_*
*_విద్యార్థులు – ఉపాధ్యాయ నిష్పత్తి అమలు ఏదీ?_*
*🍁పాయింట్ల పితలాటకం!🍁*
*💠 ఉపాధ్యాయుల బదిలీల్లో తొలగని గందరగోళం*
*💠 విలీన పాఠశాలల్లో టీచర్లకు అధిక పాయింట్లు*
*💠 విలీనం కాని పాఠశాలల్లో టీచర్లకు తక్కువ పాయింట్లు*
*💠 గడువు ముగిసినా ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయిలో వివరాలు నమోదుకాని వైనం*
🔺జిల్లాలో టీచర్ల బదిలీల అంశం గందరగోళంగా మారింది. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి ఆధారంగా బదిలీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. విలీన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు అధిక పాయింట్లు, విలీనం కాని పాఠశాలల్లో టీచర్లకు తక్కువ పాయింట్ల కేటాయింపుతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన విధ్యావిధానం అమలులో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టగా, సక్రమంగా టీచర్ల బదిలీ ప్రక్రియను చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.
*🪷ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :* 
నూతన విద్యావిధానం అమలులో భాగంగా 3, 4, 5 తరగతులు విలీనమైన ఉన్నత పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఎనిమిది సంవత్సరాల్లో స్పౌజ్‌ కేసుల ద్వారా బదిలీ అయితే మళ్లీ అవకాశం కల్పించారు. వీరు గతంలో ప్రిఫరెన్సియల్‌ కేటగిరీని ఉపయోగించుకుని బదిలీ అయినా, ప్రస్తుతం మళ్లీ ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. దీంతోపాటు విలీనమైన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు, రేషనలైజేషన్‌ పాయింట్లు, ప్రత్యేక పాయింట్లు, ఓల్డ్‌ స్టేషన్‌ పాయింట్లు ఇచ్చారు. విలీనం కాని పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు రేషనలైజేషన్‌ పాయింట్లు ఐదు మాత్రమే కలిపి మిగిలిన కోటాలో పాయింట్లు కేటాయించలేదు. దీంతో విభజించు, పాలించు అనే పద్ధతిపై తమ బదిలీలు జరుగుతున్నాయని టీచర్లు అంటున్నారు. ఇటీవల విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు భేటీ అయిన సమయంలో అందరికీ సమాన పాయింట్లు ఇస్తామని హామీ ఇచ్చినా అమలులోకి రాలేదని టీచర్లు అంటున్నారు.
*♦️ముగిసిన గడువు♦️*
టీచర్లు, విద్యార్థుల నిష్పత్తిని బట్టి 400 మంది టీచర్లు మిగులుబాటుగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తేల్చారు. విలీనమైన, విలీనంకాని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు సమానంగా పాయింట్లు కేటాయించలేదు. ఉదాహరణకు కలిదిండి మండలంలో 8 సంవత్సరాలపాటు పనిచేసి, మొవ్వ మండలం ముత్రాసిపాలెంలోని పాఠశాలకు 23 నెలలక్రితం టీచరు బదిలీపై వచ్చారు. ఆ పాఠశాలలో గతంలో 28 మంది పిల్లలుండగా, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల సంఖ్యను సదరు టీచరు 50కి పెంచారు. విద్యార్థుల సంఖ్య 43 కన్నా అధికంగా ఉండటంతో ఇక్కడ ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టును ఇచ్చారు. రెండేళ్లక్రితం వచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచిన సెకండరీ గ్రేడ్‌ టీచరును మిగులుబాటుగా చూపి వేరే ప్రాంతానికి బదిలీ చేస్తామని దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ టీచరుకు రెండు సంవత్సరాలకు 6 పాయింట్లు, 10 సంవత్సరాల సర్వీసుకు ఏడాదికి 0.5 మార్కుల చొప్పున 5 పాయింట్లు ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచిన టీచరుకు తాజాగా కలిపిన రేషనలైజేషన్‌ పాయింట్లు ఐదుతో కలిపి 16 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. నూతన విద్యావిధానంలో 3, 4, 5 తరగతులు విలీనమైన పాఠశాలలో పనిచేస్తున్న టీచరుకు గతంలో పనిచేసిన 8 సంవత్సరాలకుగాను ఓల్ట్‌స్టేషన్‌ పాయింట్ల కింద ఏడాదికి మూడు పాయింట్ల చొప్పున 24 పాయింట్లు, రీ ఆప్పోర్షన్‌మెంట్‌ పాయింట్లు 5, పది సంవత్సరాల సర్వీసుకుగాను 5 పాయింట్లు చొప్పున మొత్తం 34 పాయింట్లు ఇస్తున్నారు. దీంతో ఒకే ఏడాది ఉద్యోగంలో చేరి విలీనమైన పాఠశాలలో పనిచేస్తున్న, విలీనం కాని పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు పాయింట్ల కేటాయింపులో వ్యత్యాసం నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచిన ఎస్‌జీటీలు బదిలీకోసం ధర ఖాస్తు చేసుకుంటే పాయింట్లలో వెనుకబడి పోతున్నారు.
*♦️గడువు పెంచాలి♦️*
టీచర్లు దర ఖాస్తులు చేసుకునే సమయంలో ఆన్‌లైన్‌ విధానంలో పాయింట్లు కలిసే విధానం తప్పులతడకగా ఉంది. టీచరు గతంలో 8 సంవత్సరాలపాటు పనిచేసిన ఓల్డ్‌ స్టేషన్‌కోటాలో 24 పాయింట్లు కలవాల్సి ఉండగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఈ పాయింట్లు కలవడం లేదు. విలీనమైన, విలీనంకాని పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఐదు రేషనలైజేషన్‌ పాయింట్లు కలిపిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తిరిగి దరఖాస్తు చేసుకునే గడువును మరో రెండు, మూడు రోజులు పెంచాలని టీచర్లు కోరుతున్నారు. ఈ ఐదు పాయింట్లు కలుపుకోవాలంటే ఇప్పటికే బదిలీకోసం ఆన్‌లైన్‌లో చేసుకున్న ధరఖాస్త్తులను డిలీట్‌ చేయాల్సి ఉంది. ఎంఈవో, డీవైఈవో కార్యాలయాల్లో ఈ డిలీట్‌ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. ఇక్కడ డిలీట్‌ అయిన తరువాత మళ్లీ కొత్తగా బదిలీకోసం దరఖాస్తు చేయాల్సి ఉంది. ఈనెల 10వ తేదీన బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గడువు ముగిసినా ఆన్‌లైన్‌లో పాయింట్ల కేటాయింపులో మార్పులు చేయలేదని టీచర్లు చెబుతున్నారు.
*🏮అదే గందరగోళం..!*
*▪️ఐటీ సెల్‌లో సమస్యలు చెబుతున్న టీచర్లు*
*▪️ఆఖరి రోజు వరకూ అస్పష్టమైన ఆదేశాలే*
*▪️విలీనం ఎఫెక్ట్‌ పాయింట్లపై వివాదం*
*▪️పూటకో మాట… రోజుకో సవరణ*
*▪️అప్‌డేట్‌ అవని ట్రాన్స్‌ఫర్స్‌ సైట్‌*
*▪️అప్లికేషన్‌ ఎడిట్‌కు ఆఖరిరోజు ఆప్షన్‌*
*▪️మొహం చాటేసిన కొందరు డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు*
*▪️పట్టించుకోని ఉన్నతాధికారులు*
*🌻అనంతపురం విద్య, డిసెంబరు 18*: ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఉన్నఫలంగా బదిలీల షెడ్యూల్‌ ప్రకటించి, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలతో కొట్టుకు చావండి అన్న చందంగా విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరు తయారైందన్న విమర్శలు వస్తున్నాయి. బదిలీలకు దరఖాస్తు చేసేందుకు ఇచ్చిన ఆఖరి గడువు రోజు కూడా గంటకో మాట, పూటకో సరవణ ఇస్తూ ఉపాధ్యాయులతో ఆటలాడుతోంది. ఇప్పటికే వేలాది టీచర్లు దరఖాస్తు చేశారు. ఆదివారం మధ్యాహ్నానికే 6,368 మంది అప్లై చేశారు. చివరి రోజు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చారు. పోనీలే ఎడిట్‌ చేయిద్దామనుకుంటే కొందరు డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు కనీసం పట్టించుకోవడం లేదు. ఒక వైపు ప్రభుత్వ అడ్డగోలు ఉత్తర్వులతో, మరో వైపు అధికారులు నిర్లక్ష్య ధోరణితో బదిలీల ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ఏ ఉపాధ్యాయుడిని కదిలించినా….తలలు పట్టుకుంటున్నారు. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*షెడ్యూల్‌ అమలు.. హు్‌షకాకి!*
ఉపాధ్యాయ బదిలీలకు విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈనెల 12, 13 తేదీల్లోనే ఖాళీలు ప్రదర్శిస్తామన్నారు. అదేవిధంగా బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ గడువు ప్రకటించారు. అయితే రోజురోజుకు వందలాది మంది టీచర్లు అనేక రకాల సమస్యలతో డీఈఓ ఆఫీ్‌సకు క్యూ కడుతుండటంతో ఈ నెల 18 వరకూ గడువు పొడిగించారు. అయితే షెడ్యూల్‌ మేరకు ఇప్పటి వరకూ ఖాళీలపై విద్యాశాఖ స్పష్టమైన ప్రకటన చేయలేని దుస్థితి నెలకొంది. దీనికితోడు దరఖాస్తు చేసుకునే టీచర్లకు సవాలక్ష సందేహాలను అలాగే ఉంచారు. బదిలీల షెడ్యూల్‌ ఇవ్వడానికి ముందే టీచర్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(టి్‌స)ను అప్‌డేట్‌ చేసి ఉండాలి. దాన్ని అప్‌డేట్‌ చేయకుండానే ముందుకెళ్లడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
*పాయింట్ల కోసం టీచర్ల ఫైట్‌…*
ప్రభుత్వం గతంలో చేసిన అనేక తప్పిదాలు, వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు లేని సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద విలీన ప్రక్రియ వల్ల ఎఫెక్ట్‌ అయ్యే టీచరల్లో కొందరికి పాయింట్లు ఇచ్చి, మరికొందరికి పాయింట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. విలీన ప్రక్రియ వల్ల ఉన్నత పాఠశాలల్లోకి 3,4,5 క్లాసుల విలీనంతో ఎఫెక్ట్‌ అయ్యే టీచర్లకు ఓల్డ్‌ స్టేషన్‌ పాయింట్లతోపాటు,హేతుబద్ధీకరణ పాయింట్లు కూడా ఇస్తామన్నారు. అయితే…విలీనంతో అప్పర్‌ప్రైమరీ స్కూళ్లలో ఎఫెక్ట్‌ అయ్యే టీచర్లకు ఇచ్చే పాయింట్లపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో వందలాది మంది టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాల్లోని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షులకు, ప్రధానకార్యదర్శులకు మొదట్లో పాయింట్లు లేవన్నారు. దీంతో నాయకులు మండిపాటు, డిమాండ్ల సెగ తగలడంతో…ఇప్పుడు వారికి కూడా పాయింట్లు ఇస్తామంటున్నారు. దీనికితోడు 2021లో అడ్‌హక్‌గా ఉద్యోగోన్నతులు పొందిన టీచర్లు సైతం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే భారీగా టీచర్లు కోర్టును ఆశ్రయించారు. వారికీ క్లారిటీ ఇవ్వలేదు. కోర్టు మెట్లు ఎక్కిన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో గతంలో పాయింట్ల కోసం టీచర్లు ఫైట్‌ చేయాల్సి వస్తోంది.
*ఆప్షన్లు ఇచ్చినా…అధికారులేరీ…?*
ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రాతిపదికన బదిలీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆఖరి రోజు. మధ్యాహ్నానికి 6368 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సర్వీసు 5 ఏళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, 8 ఏళ్లు పూర్తయిన టీచర్లు 1276 మంది ఉండగా, రిక్వెస్ట్‌ టీచర్లు మరో 5,902 మంది ఉన్నారు. అయితే బదిలీ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక సాంకేతిక సమస్యలు ఉన్నతమవుతున్నాయి. దీంతో దరఖాస్తుల్లో అనేక పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. ఎస్‌జీటీల దరఖాస్తులు ఎడిట్‌ చేయడానికి ఎంఈఓలకు, స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయుల దరఖాస్తును ఎడిట్‌ చేయానికి డిప్యూటీ డీఈఓలకు అవకాశం ఇచ్చారు. కొందరు ఎంఈఓలు దీన్ని పూర్తి వదిలేశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం డిప్యూటీ డీఈఓ సైతం అనంతపురం జిల్లా డీఈఓ ఆఫీ్‌సకు వచ్చిన దాఖలాలు లేవు. శ్రీ సత్యసాయి జిల్లా డీఈఓ ఆఫీస్‌ స్టాఫ్‌ను సైతం రెండు రోజుల ముందు ఇక్కడికి పంపారు. ఆ జిల్లా విద్యాశాఖాధికారి తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. బదిలీల్లో వందలాది మంది ఉపాధ్యాయులు అనంతపురం జిల్లా డీఈఓ ఆఫీ్‌సకు వస్తుంటే…ఆ జిల్లా డీఈఓ ఇటువైపు దృష్టి పెట్టకపోవడంపై ఉపాధ్యా యులు మండిపడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా టీచర్లను గందరగోళంలోకి నెట్టుతున్నాయి.

*_🅰️🅿️ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తు గడువు నేటికి పొడిగింపు_*

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!