బదిలీలపై ఈ రోజు ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన వివిధ అంశాలపై యుటియఫ్ పక్షాన పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ మువ్వా రామలింగం గారిని కలిసి చర్చించడమైంది.
AP 1000 CBSE Schools 10th Hindi Deleted Syllabus 2024-25 Review the syllabus of Hindi subject…
1. 2021లో ఎల్ఎఫ్ఎల్ హెడ్యాక్టర్ గా ప్రమోషన్ పొందిన వారి ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం హైస్కూల్లో విలీనం అయ్యింది. ఇలాంటి వారికి రీ-ఆపార్షన్మెంట్ పాయింట్లు మరియు పాత స్టేషన్ పాయింట్లు వర్తిస్తాయి.
2. ఇటీవల పాఠశాల విద్యాశాఖలో అబ్దార్థ అయిన ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రస్తుతం ఏ మేనేజ్మెంట్లో పనిచేస్తూ ఉంటే బదిలీలలో వారు అదే మేనేజ్మెంట్ పాఠశాలలనే కోరుకోవాలి.
3. నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో ఉన్న ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ సప్లస్ చూపబడిన నలుగురు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ విషయం ప్రత్యేకంగా చర్చించాము. వీరి బదిలీ అంశాన్ని నెల్లూరు జిల్లాకు కేటాయించిన స్పెషల్ ఆఫీసర్కు అప్పగిస్తారు.
1. రీ-అపార్షన్మెంట్ కు గురై 80% లోపు అంగవైకల్యం కలిగిన ఉపాధ్యాయులకు రీ- అపారస్మెంట్ పాయింట్లతోబాటు స్పెషల్ పాయింట్లు కూడ కేటాయిస్తారు. 80%పైగా అంగవైకల్యం కలిగినవారిని అదే పాఠశాలలో నిలుపుదల చేస్తారు. వారికి బదులుగా వారి ముందున్న సీనియర్ను కదుపుతారు.
5. మ్యాపింగ్ చేసిన పాఠశాలలో సీనియర్ లేదా జూనియర్ ఏ ఉపాధ్యాయుడు రీ-ఆపార్షన్మెంట్ కు గురి అయినప్పటికి 5 పాయింట్లు కేటాయించాలని కోరాము. తప్పక పరిశీలిస్తామన్నారు.
6. మ్యాపింగ్ చేసిన పాఠశాలలో ఎఫెక్ట్ అయిన ఉపాధ్యాయునికి మాత్రమే రీ- ఆపారస్మెంట్ పాయింట్లు ఇస్తున్నారు. వీరితోబాటు ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టు ఇవ్వడం వల్ల ఎఫెక్ట్ అయిన టీచర్లకు, 98కంటే తక్కువ రోల్ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో తొలగించిన స్కూల్ అసిస్టెంట్లు, వీరి వల్ల ఎఫెక్ట్ అయిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు 137,972 రోల్ కంటే తక్కువ ఉన్న ఉన్నత పాఠశాలల్లో తొలగించిన ప్రధానోపాధ్యాయుడు మరియు పిడి లేదా పింటి పోస్టులో పనిచేస్తున్న టీచర్లకు కూడా రీ-ఆపార్షన్మెంట్ పాయింట్లతోబాటు పాత స్టేషన్ పాయింట్లు కూడా ఇవ్వాలని కోరాము. తప్పనిసరిగా పరిశీలిస్తామన్నారు.
7. ఎస్ టి / స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన పాఠశాలలోనే స్కూల్ అసిస్టెంట్ / హెడ్మాష్టర్గా ప్రమోషన్ పొందిన వారికి సంబంధించి 8/5 స॥లు పూర్తి అయిన వారికి మొత్తం కాలానికి స్టేషన్ పాయింట్లు ఇస్తారు. మిగిలిన వారికి ప్రమోషన్ పొందిన కేడర్ లో వచ్చే స్టేషన్ పాయింట్లు మాత్రమే ఇస్తారు.
8. 2014 డిఎస్సిలో ఎటిగా చేరిన వారిని 2016 నుండి 2019 వరకు డిఇఓ పూల్లో ఉంచారు. వీరికి 2019 ఆగష్టు 1వ తేదీన పర్మినెంట్ పోస్టులు కేటాయించారు. వీరిలో రీ- ఆపార్షస్మెంట్కు గురైన వారికి 2019 ఆగష్టు 1 ఉండి. మాత్రమే స్టేషన్ పాయింట్లు ఇస్తున్నారు. వీరికి డిఇఓ పూల్లో పనిచేసిన కాలానికి కూడా పాయింట్లు ఇవ్వాలని కోరాము. తప్పుక పరిశీలిస్తామున్నారు.
9. క్రింది కేడర్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పౌజ్ పాయింట్లు వినియోగించుకున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్ కేదర్లో కొత్తగా వినియోగించుకొనుటకు అనుమతించాలని కోరాము. ఏ కేడర్లో పనిచేసినా ప్రధానోపాధ్యాయులకు 5 సం||లు మిగిలిన వారికి 5 సం||లు పూర్తి అయితేనే ప్రిఫరెన్షియల్ కేటగర్, స్పౌజ్ పాయింట్లు వినియోగించు కోవాలని తెలిపారు.
10. ఉపాధ్యాయుల TIS వివరాలు తప్పుగా నమోద్ అయిన వాటిని ఎడిట్ చేయడానికి డిఇఓలకు అధికారం ఇచ్చారు.
11. ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ సబ్జెక్టు టీచర్లుగా కన్వర్షన్ పొందిన వారికి దరఖాస్తు చేసు కొనుటకు స్కూల్ అసిస్టెంట్ వివరాలు చూపేలా సాఫ్ట్వేరు సరి చేసామని తెలిపారు.
12. 2013 నుండి 2015 వరకు కేటగిరీ-4 ఏరియాగా పాఠశాల 2015 నుండి కేటగిరీ-3కు మార్పు జరిగింది. దీని ఆధారంగా పాయింట్లు కేటాయించబడడం లేదు. దీనిని సరి చేసేందుకు డిఇఓలకు అధికారమిస్తామన్నారు.
13. 2020లో ప్రమోషన్ పొందిన స్కూల్ అసిస్టెంట్ (హిందీ) వారికి 2021 జనవరిలో తాత్కాలిక ప్లేసులు కేటాయించారు. 2022లో కోర్టు కేసు ఫైనల్ కావడంతో వెబ్ అప్షన్ ద్వారా పర్మినెంట్ ప్లేసులు కేటాయించడం జరిగింది. వీరికి ప్రస్తుత స్టేషన్ పాయింట్లతోపాటు తాత్కాలికంగా పనిచేసిన కాలంనాటి పాయింట్లు కూడా ఇవ్వాలని కోరాము. పరిశీలిస్తామన్నారు.
14. అంతర్ జిల్లా బదిలీలలో బదిలీపై వచ్చిన వారికి మొత్తం సర్వీస్ పాయింట్లు ఇస్తారు. అయితే 8-అపారన్ మెంట్ కు గురె అయిన వారికి పాయింట్లు ఇచ్చే విషయమై ఆలోచిస్తామన్నారు.
పై పాయింట్లతోబాటు ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పాయింట్లు, రీ-ఆపారన్మెంట్ పొందిన వారందరికీ 5 పాయింట్లతోబాటు పాత స్టేషన్ పాయింట్లు కేటాయించాలని కోరడం జరిగింది. ఈ సమస్యలు చర్చించి పరిష్కరించే నిమిత్తం ఉపాధ్యాయ సంఘాలతో కో-ఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.