TODAY EDUCATION/TEACHERS TOP NEWS 08/11/2022
విద్యా శాఖతో గేమ్స్
విద్యా సమీక్ష కేంద్రం ఏర్పాటు
*🌻ఈనాడు, అమరావతి*: పాఠశాల విద్యా శాఖలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పర్యవేక్షణకు ‘విద్యా సమీక్ష కేంద్రం’ పేరుతో రాష్ట్ర స్థాయిలో విద్య కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, నాడు- నేడు, విద్యార్థుల హాజరు, ఇతర కార్యక్రమాలను ఈ కేంద్రం ద్వారా పర్యవేక్షించనున్నట్లు పేర్కొంది. జిల్లా ఇన్ఛార్జి, సూపర్వై జర్లను డిప్యూటేషన్పై నియమించనున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఇంటర్లో సీబీఎస్ఈ సిలబస్ అమలుకు నిపుణుల కమిటీ
*🌻ఈనాడు, అమరావతి:* ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేసేందుకు సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్నందున భవిష్యత్తులో ఈ విద్యార్థులు ఇంటర్కు వచ్చేటప్పటికి ఆ సిలబస్ అమలుకు చర్యలు చేపట్టారు. సిలబస్ రూపక ల్పన, అమలుకు సబ్జెక్టు నిపుణులను నియమించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
సకాలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశాం :ఏపీ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధుల వెల్లడి
*🌻లబ్బీపేట (విజయవాడతూర్పు):* ఇటీవల పాఠ్యపుస్తకాల ముద్రణ, సరఫరాకు సంబం ధించి వచ్చిన కథనాలు సత్యదూరమని, వాటి ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వెబ్ ఆఫ్ సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.వి.సూర్యనారాయణ, కె. మధు సూదనరెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా విజయవా డలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధికారుల సహకారంతో, వారి పర్యవేక్షణలో ముద్రణ, సరఫరా చేశామని, పక్కరాష్ట్రాల కంటే ముం దుగానే పాఠశాల విద్యార్థులకు అందించామని తెలిపారు. అదేవిధంగా 2022-23కి ప్రభుత్వ మే పేపర్ పంపిణీ చేసి ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల పుస్తకాలు ముద్రణ చేయించి అతితక్కు వ ధరకే విద్యార్థులకు కూడా సరఫరా చేసింద ని చెప్పారు. ఈ విధానం వల్ల విద్యార్థుల తల్లి దండ్రులపై రూ.20 కోట్ల వరకు భారం తగ్గిం దని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వా న్ని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బీమిరెడ్డి ప్రసా దె రెడ్డి, ఉపాధ్యక్షుడు మైనేని సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి జాస్తి నాగేశ్వరరావు, కోశా ధికారి బి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఎయిడెడ్ టీచర్లకు అందని జీతాలు
*♦️ఈఎంఐలు కట్టుకోలేక ఇబ్బందులు*
*♦️గత పది నెలలుగా ఇదే తంతు*
*🌻అమరాతి,ఆంధ్రప్రభ*: కొత్త నెల ప్రవేశించి వారం రోజులు దాటినప్పటికీ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఇంతవరకు జీతాలు పడలేదు. ఈ ఒక్క నెల మాత్రమే కాదని, గత పది నెలలుగా ఇదే తంతు కొనసాగు తుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది ఉపాధ్యాయులు జీతాన్ని షూరిటీగా పెట్టి రుణాలు పొందారని, వారందరికీ ఇఎంఐలు మొదటి మూడు తేదీల్లోనే ఉంటాయని, కానీ జీతాలు ఒకటో తారీఖుకు రాని కారణంగా ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతు న్నారు. రాష్ట్రంలోని మిగిలిన టీచర్లందరికీ జీతాలు చెల్లించగా ఎయిడెడ్ టీచర్లకు మాత్రం ప్రతి నెలా ఆలస్యమౌ తోంది. రాష్ట్రవ్యాప్తంగా వీరు మూడు వేల మంది దాకా ఉంటారు. వీరికి జీతాలు చెల్లించే హెడ్ ఆఫ్ అకౌంట్ను మా ర్చడం వల్లనే ఆలస్యమౌతోందని చెబుతున్నారు. గతంలో 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ప్రతి నెల సక్రమంగా జీతాలు చెల్లించేవారు. అయితే ఇటీవల కాలంలో 061, 061 హెడ్ ఆఫ్ అకౌంట్స్ కిందకు జీతాలు చెల్లింపు మార్చారు. అప్పటి నుండి అంటే దాదాపు పది నెలల నుండి ఎయిడెడ్ టీచర్లకు ప్రతి నెలా ఆలస్యంగానే జీతాలు వస్తున్నాయి. దీనికి అధికారులే కారణమని టీచర్స్ గిల్డ్ నేత ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
*♦️పెన్షనర్లకు, జడ్పీ టీచర్లకు ……*
ఒక్క ఎయిడెడ్ టీచర్లకు మాత్రమే కాక పెన్షనర్లకు, జెడ్పి టీచర్లకు కూడా చాలా చోట్ల ఇంత వరకు జీతాలు అందలేదు. తమ పెన్షన్ ఇంకా జమ అవలేదని అనంతపురం జిల్లాలో దాదాపు ఆరు వేలమంది పెన్షనర్లు రోడ్డెక్కి ఆందోళన క ూడా నిర్వహించారు. కర్నూల్ జిల్లాలో చాలా జెడ్పి స్కూల్లో టీచర్లకు ఇంకా జీతాలు అందలేదు. ఇప్పటికీ జీతాలు రాని కారణంగా బ్యాంక్ లోన్స్ చెల్లింపులు, నిత్యావసరాల కొనుగోలు, పిల్లల ఫీజులు, ఆరోగ్య సంబంధ అవసరాల్లో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు తెలిపారు. తక్షణమే ఉపాధ్యాయులకు జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఎంఇసి స్థానంలో సైన్స్ కోర్సులు :ఎస్సి గురుకులాల్లో ప్రవేశపెట్టాలి : మంత్రి నాగార్జున
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్మీడియట్లో ఎంఇసి స్థానంలో సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఎంపిసి, బైపిసి కోర్సులను ప్రవేశపెట్టాలని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులు ప్రారంభమయ్యేలా చూడాలని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ గురుకులాల కార్యకలాపాలపై సచివాలయంలో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. గురుకులాల్లో మొత్తం 1.17లక్షల సీట్లు ఉంటే 1.09 లక్షల సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. ఎక్కువగా ఇంటర్మీడియట్ కోర్సుల్లోనే సీట్లు మిగిలాయని తెలిపారు. ఎంపిసి, బైపిసి వంటి సైన్స్ సీట్ల కోసం విద్యార్థులు పోటీపడుతున్నారని, ఎంఇసిలో చేరడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. విద్యార్థులకు జాబ్ గ్యారెంటీ ఇచ్చే మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ వంటి కోర్సులను జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మంచి మార్కులు సాధించే విద్యార్థులకు తరగతుల స్థాయిలో ప్రోత్సాహక బహుమతులను ఇచ్చే పథకాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. శాఖకు చెందిన గురుకులాలు, హాస్టళ్లు, ఎస్సీ కార్పొరేషన్కు చెందిన కాంప్లెక్సులు, లిడ్ క్యాప్కు చెందిన భవనాలు నిర్మాణ కార్యక్రమాలు, నిర్వహణ పర్యవేక్షించడానికి ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సి, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను, కేర్ టేకర్లు, లైబ్రేరియన్ ఖాళీలను భర్తీ
చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
సెక్టోరియల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
*🌻మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్ టుడే*: సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ డా.ఏ. శేఖర్ ఒక ప్రకటనలో తెలి పారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్-2 హెచ్ఎంలు, ఎంఈ వోలు, డైట్ అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేస్తూ ఐదేళ్ల కనీస సర్వీసు పూర్తి చేసిన స్కూల్ అసి స్టెంట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అక్టోబరు 31 నాటికి 50 ఏళ్లలోపు వయసు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు విద్య, వృత్తిపరమైన అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తులను ఈనెల 14వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు మచిలీపట్నంలోని కార్యాలయంలో అందించాలన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
సూపర్ సెష్పాలిటీ కోర్సుఫీజుల పెంచే జీవోను కొట్టివేత:ఏపి హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు
*🌻ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో* ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (ఎఎస్ఆర్సి) సిఫార్సులు లేకుండానే సూపర్ సెప్పాలిటీ కోర్సు ఫీజులు పెంచుతూ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. విద్యార్థులకు ఏపి హైకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆరు వారాల్లో ఏపి ప్రభుత్వం, నారాయణ మెడికల్ కాలేజీ చెరో రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నారాయణ మెడికల్ కాలేజ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారించి హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. తాజాగా జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ సుధాంశు ధులియాలతోకూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించి సోమవారం తీర్పు వెలువరించింది. ఎఎస్ఆర్సి సిఫార్సులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సెష్పాలిటీ కోర్సుల ఫీజులు పెంచడం సరికాదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఎఎస్ఆర్సీ సిఫార్సుల మేరకే ఫీజులు వసూలు చేయాలని, అంతకన్నా ఎక్కువగా వసూలు చేసిన సొమ్ములు విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎఎస్ఆర్సి సిఫార్సులు లేకుండా ప్రభుత్వం జీవో ఇవ్వడం తప్పని, దానితో లబ్ధిపొందిన కాలేజి కూడా తప్పేనని స్పష్టం చేసింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
జీతాలివ్వండి మహాప్రభో: ఏపీటీఎఫ్
*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్రంలో చాలా మంది ఉపా ధ్యాయులు, ఉద్యోగులకు సోమవారం నాటికీ జీతాలు రాలేదని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) అధ్యక్షుడు హృదయరాజు, రాష్ట్రాపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శి తిమ్మన్న తెలిపారు. జీతాలు రాకపోవడంతో బ్యాంకు వాయిదాలు, నిత్యావసరాల కొనుగోలు, పిల్లల ఫీజులు, మందులు కొనుగోలుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వెల్లడించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
సెక్టోరియల్ అధికారుల నియామకానికిదరఖాస్తుల ఆహ్వానం
*🌻మచిలీపట్నం:* కృష్ణా జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కో-ఆర్డినేటర్ డాక్టర్ అమ ర్లపూడి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి, ఎంఐఎస్ మరియు ప్లానింగ్ కో-ఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకడమిక్ మానటరింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మానటరింగ్ ఆఫీసర్ (ఉర్దూ), అసిస్టెంట్ ఇంక్లూసివ్ ఎడ్యుకేష్ కో-ఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేసే ప్రధానోపాధ్యాయలు, ఎంఈవో లేదా డైట్ లెక్చరర్లు ఈ పోస్టులకు అర్హులన్నారు. అక్టోబర్ 31 నాటికి దరఖాస్తుదారుల వయస్సు 50 ఏళ్ల లోపు ఉండాలన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 14 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం మచిలీపట్నంలోని సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
డిమాండ్ లేని కోర్సుల స్థానంలో కొత్త కోర్సులు :ఎస్సీ గురుకులాల్లో ఎంఈసీ స్థానంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు
*♦️వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు*
*🌻సాక్షి, అమరావతి*: ఎస్సీ గురుకులాల్లో విద్యా ర్థుల నుంచి డిమాండ్ లేని కోర్సుల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధి కారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎంఈసీ స్థానంలో ఎంపీసీ, బైపీసీ ప్రవేశపెట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకు లాల కార్యకలాపాలపై రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి మేరుగు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో మొత్తం 1.17 లక్షల సీట్లు ఉండగా వీటిలో ప్రస్తుతం 1.09 లక్షల సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. ఖాళీగా మిగిలిన సీట్లలో ఎక్కువగా ఇంటర్ సీట్లే ఉన్నాయన్నారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీల్లోనే ఎక్కువమంది విద్యా ర్థులు చేరుతున్నారని తెలిపారు. దీంతో ఎంఈసీలో సీట్లు మిగిలిపోతున్నాయని వెల్ల డించారు. ఈ నేపథ్యంలో ఎంఈసీ స్థానంలో ఎంపీసీ, బైపీసీ సీట్లను ప్రవేశపెట్టాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
రేపటి నుంచి దిల్లీలో తెరచుకోనున్న పాఠశాలలు
*🌻దిల్లీ*: తీవ్ర వాయు కాలుష్య వాతావరణ పరిస్థి తుల్లో తాత్కాలికంగా మూసివేసిన ప్రాథమిక పాఠశా లల్ని బుధవారం నుంచి తిరిగి తెరవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సగం మంది సిబ్బంది ఇళ్ల నుంచే పనిచేయాలన్న ఆదేశాలనూ ఉపసంహరించుకుంది. బీఎస్ -3 పెట్రోలు, బీఎస్-4 డీజిల్ కార్లపై మాత్రం నిషేధం కొనసాగనుందని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందనీ, సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయ డమూ తగ్గుముఖం పట్టిందని వివరించారు. ఈ నేప థ్యంలో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంక్షల్ని సడలిస్తున్నట్లు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
అత్యవసర రుణం ఇకపై రూ. లక్ష
*🌻అవనిగడ్డ, న్యూస్టుడే*: స్థానిక మండల పరిషత్ టీచర్స్, సొసైటీలో ఇప్పటి వరకు ఇస్తున్న రూ.75వేల అత్యవసర రుణాన్ని రూ. లక్షకు పెంచుతూ సొసైటీ చేసిన ప్రతిపాదనను డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆమోదించినట్లు ఛైర్మన్ జీవీఎస్. పెరుమాళ్లు తెలిపారు. అక్టోబర్లో జరిగిన మహాజన సభలో ఈమేరకు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇక నుంచి రూ. లక్ష అత్యవసర అప్పుగా ఇస్తామని, ఆ మొత్తాన్ని పది సమాన వాయిదాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వివరాలకు సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇