AP DME:Notification For 1458 Posts of Senior Residents – 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP DME:Notification For 1458 Posts of Senior Residents – 2022 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్… ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో 49 స్పెషాలిటీల్లో మొత్తం 1,458 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:

సీనియర్ రెసిడెంట్: 1,458 పోస్టులు

స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్‌, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్‌/ రేడియాలజీ,ఎమెర్జెన్సీ మెడిసిన్‌, డెంటిస్ట్రీ/ డెంటల్ సర్జరీ, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ/ సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, నియోనాటాలజీ, ప్రోస్థోడోంటిక్స్, ఓరల్ పాథాలజీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ/ ఎండోడొంటిక్స్, ఆర్థోడాంటిక్స్, పెడోడాంటిక్స్ & ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ/ కమ్యూనిటీ డెంటిస్ట్రీ, పీరియాడోంటిస్, ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ, ఓరల్ మాక్సియోల్లో ఫేషియల్ సర్జరీ.

అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్‌/ ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ప్రభుత్వ మెడికల్ & డెంటల్ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు అర్హులు. 

వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్ రూ.85,000; రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీ(పీజీ) రూ.70,000; రెసిడెంట్ డెంటిస్ట్ (పీజీ) రూ.65,000 ఉంటుంది.

సర్వీసు కాలం: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.500, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2022. 

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE 

ONLINE APPLY LINK

JOIN OUR TELEGRAM

error: Content is protected !!