_ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి ఆసీస్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీ విజేతకు రూ. 13.05 కోట్లు (1.6 మిలియన్ యూఎస్ డాలర్లు) దక్కనున్నాయి. 16 జట్లు పాల్గొంటున్న వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఆరున్నర కోట్లు మూటగట్టుకోనుంది. గత ప్రపంచకప్ ప్రైజ్‌మనీనే కొనసాగించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది._
*⭕ఐఏఎస్ అధికారుల బదిలీ*
🪷─━━━━━🫧━━━━━━─🪷
*_AP:ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ సీఈవోగా ఎం. గౌతమిని నియమించారు. భూపరిపాలన శాఖ అదనపు చీఫ్ కమిషనర్‌గా ఉన్న ఇంతియాజ్‌కు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రసుత్తం అమూల్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న బాబును ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా నియమించారు._*
*⭕దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా ఆరు రైళ్లు*
🪷─━━━━━🫧━━━━━━─🪷
_హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా ఆరు రైళ్లను ప్రవేశపెట్టారు. దీంతోపాటు కొన్ని రైళ్లను ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్‌లుగా, ఎక్స్‌ప్రెస్‌ల నుంచి సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. HYD-CSTముంబయి(22731), CSTముంబయి-HYD(22732) రైళ్లను ఎక్స్‌ప్రెస్ నుంచి సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. అక్టోబరు 1నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతోపాటు 36 ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. మచిలీపట్నం-విశాఖపట్నం, కాచిగూడ-కర్నూలు, సికింద్రాబాద్-రేపల్లె, గుంటూరు- సికింద్రాబాద్, హుబ్లీ-విజయవాడ తదితర ప్యాసింజర్ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి._
*⭕టెస్లా కారు.. నీళ్లలో షికారు*
🪷─━━━━━🫧━━━━━━─🪷
*_రోడ్డుపై, నీళ్లలో నడిచే కార్లను జేమ్స్ బాండ్ సినిమాల్లోనే చూశాం. దాన్ని నిజం చేయబోతున్నది టెస్లా కంపెనీ. నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. సైబర్‌ట్రక్ మాడల్ కారులో ఈ సదుపాయం ఉంటుందని వెల్లడించారు._*
*⭕రూ.4కోట్లతో అమ్మవారికి అలంకరణ
🪷─━━━━━🫧━━━━━━─🪷
_దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిని చాటుకుంటున్నారు ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచతన క్షేత్రంలో రూ. 4కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణకు రూ.2వేలు, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను ఉపయోగించారు. గత సంవత్సరం రూ.3.50 కోట్లతో అమ్మవారిని అలంకరించామని.. ఇప్పుడు రూ.4 కోట్లతో అలంకరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు._
*⭕కరెంట్ ఖాతా లోటు @ 2.8 శాతం*
🪷─━━━━━🫧━━━━━━─🪷
*_2022-23లో జూతో ముగిసిన మొదటి త్రైమాసికానికి కరెంట్ ఖాతా లోటు 2,390 కోట్ల డాలర్లకు పెరిగింది. ఆర్ బీఐ రిలీజ్ చేసిన డేటా ప్రకారం, జీడీపీ 2.8%కి సమానమిది. ఆ మూడు నెలల కాలానికి వాణిజ్య లోటు భారీగా పెరగడం ఇందుకు కారణమైంది. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికానికి లోటు 1340 కోట్ల డాలర్లుగా నమోదైంది._*
*⭕అరకు కాఫీకి వందేళ్లు*
🪷─━━━━━🫧━━━━━━─🪷
_వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీనగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు. అయితే స్వాతంత్ర్యం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది. మొదట్లో పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా 3 Periodఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరించాయి. ఇంతలా విస్తరించడానికి ఇక్కడి వాతావరణమే ప్రధాన కారణం._
*⭕అరకు కాఫీ రుచికి కారణం అదే*
🪷─━━━━━🫧━━━━━━─🪷
*_సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ 3 Periodపొడవాటి మిరియాలు, సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో సాగవుతాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది._*
*⭕భూ అంతర్భాగంలో భారీ సముద్రం🌫️*
🪷─━━━━━🫧━━━━━━─🪷
_ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ సముద్రం భూమి పైన కాదు.. భూలోతు పొరల్లో దాగి ఉన్నట్లు తేల్చారు. భూమిపై నీరే 70 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన ఇన్స్‌టిట్యూట్ ఎట్ గోతే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. భూమి అంతర్భాగంలో చాలా హెచ్చు స్థాయిలో నీరు ఉన్నట్లు స్టడీలో వెల్లడించారు. భూ ఉపరితలానికి సుమారు 660 కిలోమీటర్ల లోతులో ఆ నీరు ఉన్నట్లు గుర్తించారు._
*⭕బంగారం పేరుతో భారీ మోసం*
🪷─━━━━━🫧━━━━━━─🪷
*_తమ వద్ద స్వచ్ఛమైన బంగారు నాణేలు ఉన్నాయని చెప్పి నకిలీ బంగారు నాణేలు ఇచ్చి మోసం చేస్తున్న ఘటనలు కర్ణాటకలోని దావణగెరెలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి కేసులపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించినా.. మోసపోతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే కేరళకు చెందిన మురళీధర్ అనే వ్యక్తికి.. దావణగెరెలో నకిలీ బంగారు నాణేలు పేరిట రూ.30 లక్షలు టోకరా వేశాడు ఓ మోసగాడు._*
*⭕క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్*
🪷─━━━━━🫧━━━━━━─🪷
*_ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కింద ఫెస్టివల్ ఆఫర్లు ప్రారంభం అయ్యాయి. అమెజాన్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో వినియోగదారులకు లభించే డిస్కౌంట్లు పెరుగుతాయి._*
*⭕5జీ సేవలను ప్రారంభించిన మోదీ*
🪷─━━━━━🫧━━━━━━─🪷
_దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో 5జీ సేవల (5G Services)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుబాటులోకి తీసుకొచ్చారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ – 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని.. దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 5జీ సేవలకు సంబంధించిన ప్రదర్శనను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఈ సేవల సామర్థ్యానికి సంబంధించిన డెమోను రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ.. మోదీకి వివరించారు. ఆ తర్వాత 5జీ సేవల పనితీరును మోదీ స్వయంగా పరిశీలించారు._
*⭕కేదార్‌నాథ్ వద్ద విరిగిపడ్డ మంచుచరియలు*
🪷─━━━━━🫧━━━━━━─🪷
*_హిమాలయాల్లోని కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద ఇవాళ ఉదయం భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. కేదార్‌నాథ్ ఆలయం వెనుక భాగంలో సుదూరంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కూలాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంచు కొట్టుకువచ్చింది. అయితే ఆలయానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. చూస్తుండగానే ఒక్కసారిగా మంచు శిఖరం నేలకు ఒరిగింది. భారీ మొత్తంలో మంచు కొండల మధ్య వ్యాపించింది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు._*
*⭕భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు*
🪷─━━━━━🫧━━━━━━─🪷
_దేశీయ చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరను మరోసారి తగ్గించాయి. హైదరాబాద్లో 19కేజీల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర రూ.36.5తగ్గింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్ లో సిలిండర్ రూ.2099.5 నుంచి రూ.2063గా ఉంది. విజయవాడలో రూ. 2035.5, విశాఖపట్నంలో రూ.1908.5కి చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. 14.2కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు._
*⭕గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్*
🪷─━━━━━🫧━━━━━━─🪷
*_దేశంలో కోట్లాది మంది గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. కొత్త నిబంధన ప్రకారం.. ఇప్పుడు ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్లు వినియోగదారులు ఏడాదికి కేవలం 15 సిలిండర్లను మాత్రమే కొనుగోలు చేయగలరు. అయితే LPG సిలిండర్లపై నెలవారీ రేషన్ నెలకు 2 సిలిండర్లుగా నిర్ణయించటం జరిగింది. అయితే గతంలో ఇలాంటి పరిమితులు లేవు._*
*⭕ఇవి నా జీవితంలో మరిచిపోని క్షణాలు: సూర్య*
🪷─━━━━━🫧━━━━━━─🪷
_రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు (National Film Awards) పొందిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని నటుడు సూర్య అన్నారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ‘‘సురారై పోట్రు’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. భారత ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు._
*⭕ప్రపంచకప్ విజేతకు 13 కోట్లు🏏*
🪷─━━━━━🫧━━━━━━─🪷
_*ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి ఆసీస్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీ విజేతకు రూ. 13.05 కోట్లు (1.6 మిలియన్ యూఎస్ డాలర్లు) దక్కనున్నాయి. 16 జట్లు పాల్గొంటున్న వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఆరున్నర కోట్లు మూటగట్టుకోనుంది. గత ప్రపంచకప్ ప్రైజ్‌మనీనే కొనసాగించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.*_