TODAY EDUCATION/TEACHERS TOP NEWS 20/10/2022
2020 ప్రాతిపదికనే ఉపాధ్యాయ బదిలీలు
నేడు ఉపాధ్యాయ ఉత్తర్వులు రెండో ఎంఈఓ పోస్ట్ పై ప్రభుత్వం మడత పేజీ
దీపావళికైనా డీఏ
బకాయిలివ్వండి:పీజేఏసీ- అమరావతి
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* ప్రభుత్వం ఉద్యోగులకు పాత డిఏ బకాయిలను దీపావళి కానుకగా చెల్లిస్తే లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపినట్లవుతుందని ఏపీజేఏసీ- అమరావతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు విజ్ఞప్తి చేశారు. డీఏ ఎరియర్స్ 2018 జూలై నుండి కోట్లాది రూపాయలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయన్నారు. ఆర్థికపరమైన ఏ అంశం పరిష్కరించకపోయినా ప్రభుత్వానికి సహకరిసు _న్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు అనేక రాష్ట్రాలు డీఏలతో పాటు దీపావళి కానుకగా అందించటంతో పాటు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అదనంగా బోనస్ ప్రకటించాయని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు కూడా దసరా, దీపావళి పండుగలకు కొత్త డీఏలు ఇవ్వటంతో పాటు పెండింగ్ బకాయిలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించారని తెలిపారు. ఏపీజేఏసీ- అమరావతి పక్షాన ఇప్పటికే తేదీ ఈనెల 12వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్వయంగా కలిసి, మా సంఘం లేఖ ద్వారా 2018 జూలై నుండి రావాల్సిన పాత డీఏ బకాయిలతో సహా 2022- జనవరి మరియు జూలై రెండు డీఏలు, ఇతరత్రా బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న, వారికి రావాల్సిన డబ్బులు కూడా సంవత్సరాల తరబడి ప్రభుత్వం చెల్లించకపోవడం వలన తీవ్ర నిరాశ నిస్పృహలకు గురై, అసలు డీఏలు ఇస్తారా, లేదా అనే ఆందోళనతో ఉద్యోగ సంఘాలపై మండిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ దీపావళి పండుగ కానుకగానైనా ముఖ్యమంత్రి వైఎస్ఆగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించి పెండింగులో ఉన్న 2022- జనవరి, జూలై డీఏలు ప్రకటించి పది లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందించగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
5జితో డిజిటల్ విద్య
*♦️కొత్త శిఖరాలకు చేరిన బోధనా విధానం*
*♦️గుజరాత్లో ఎక్స్టెన్స్ స్కూళ్లకు శ్రీకారం*
*♦️తరగతి గదిలో విద్యార్థులతో మోడీ*
*♦️పాఠ్యాంశాలు విన్న ప్రధాని*
*♦️మౌలిక వసతులకు హామీ*
*♦️రూ. 10వేల కోట్లతో ప్రణాళిక రూపకల్పన*
*🌻అహ్మదాబాద్:* ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాం ధీనగర్లోని మిషన్ స్కూల్కు వెళ్లారు. కొద్దిసేపు విద్యా ద్దిగా మారారు. తరగతి గదిలో విద్యార్ధులతో ఆసి బెంచ్ పై కూర్చుతున్నారు. ఒక విద్యార్థి పాఠ్యాంశాన్ని భోధిస్తుంటే శ్రద్ధగా విన్నారు. డిజిటల్ అనుభవాలపై తనపక్కన కూర్చున్న విద్యార్థినిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో సరదాగా సంభాషిం చారు. టెక్నాలజీ ద్వారా విద్యార్థులు ఎలా నేర్పుకుంటున్నారో ప్రత్యక్షంగా గమనించారు. ఈ ఆసక్తికరమైన” సన్నివేశం బుధవారం గాంధీనగర్ లో వినిపించింది. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని, మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించిన ప్రధాన తరగతి. గదిలో తానూ విద్యార్థిగా మారారు. 5జ్ కెక్నాలజీ దేశ విద్యా వ్యవస్థను తదుపరి దశకు తీసుకెళ్తుందని అన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి సహాయపడే అత్యాధునిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాలలో దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులను నియమించామని, 1.5 లక్షల తరగతి గదులు నిర్మించామని మోడీ చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు గ్రామాలకు వెళ్లి పిల్లల్ని చేయిపట్టుకుని స్కూళ్లకు తీసుకెళ్లి మెరుగు పరిచామని గుర్తు చేశారు.రూ.10వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ మిషన్ స్కూల్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందించింది. ప్రాజెక్టులో భాగంగా కొత్త తరగతి గదులు, స్మార్ట్ క్లాస్ రూమ్ లు, కంప్యూటర్ ల్యాగ్లు, మౌలిక సదుపాయాల అప్ గ్రేడేషన్ వంటి పనులు చేస్తారు. ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా, రూ.5587 కోట్లతో మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తారు. 1.5 లక్షల ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తారు. 20 వేల కంప్యూటర్ బ్యాబ్ లు, ఏడేల అటల్ టింకరింగ్ ల్యాబ్ లతోపాటు 50 వేట తరగతి గదులను కొత్తగా నిర్మిస్తారు.
గుజరాత్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల లేమిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేరుగా సవాల్ విసురుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్లో ప్రచారం చేసిన క్రివాల్ సిసో డియా వంటి నేతలు డిజేపీ పాలనలో స్కూళ్ల దుస్థితిపై విమర్శల దాడి చేశారు. ఢిల్లీలోని స్కూళ్లు, విద్యా వ్యవ ఎను ప్రస్తావిస్తూ బీజేపీ అసమర్థతను ఎత్తిచూపారు. ఈ క్రమంలో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రాజెక్టును ప్రధాని మోడీ తన సొంతరాష్ట్రమైన గుజరాత్లో ప్రారంభింభినట్లు తెలుస్తున్నది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
పది విడతల్లో పిల్లల సంరక్షణ సెలవులు వాడుకోవచ్చు:మహిళా ఉద్యోగులకు వెసులుబాటు
*🌻సాక్షి, అమరావతి*: మహిళా ఉద్యోగులు ఇకనుంచి పిల్లల సంరక్షణ సెలవులను 10 విడతల్లో వినియో గించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ 3 విడతల్లో వినియోగించుకోవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే ఏపీ సచివాలయ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మూడు విడతలకు బదులుగా పది విడతల్లో సెలవులను వినియోగించుకునేందుకు వీలుగా సాధారణ పరి పాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎవరైనా కొన్ని రోజులు పిల్లల సంరక్షణ సెలవులు వినియోగించుకుంటే.. మిగతా సెల వులను పది విడతల్లో వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తులు
*🌻విజయవాడ సిటీ, న్యూస్టుడే*: ఈ విద్యాసంవత్సరంలో (2022-23) 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష(ఎన్ఎంఎంఎస్)కు ఈ నెల 31 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, నగరపాలక సంస్థ, ఎయిడెడ్, మండల పరిషత్తు పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. పరీక్ష ఫీజు ఓసి, బీసీ విద్యా ర్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 ఎస్ బీఐ ద్వారా చెల్లించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం www.bse.ap.gov.in వెబ్సైట్ లేదా జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
విద్యాశాఖ ఉత్తర్వులపై ఉపాధ్యాయుల ఆందోళన
*🌻నె హ్రూ చౌక్(గుడివాడ), న్యూస్ టుడే*: మున్సిపల్ ఉపాధ్యాయుల సెలవులు, ఇంక్రి మెంట్లు, మెడికల్ బిల్లులు మంజూరు చేసే అధికారాన్ని జిల్లా విద్యాశాఖాధికారికి కల్పిస్తూ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ నెల 17న జారీ చేసిన ఉత్తర్వుల పట్ల మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి. డీడీవో అధికారాలు ప్రధానోపాధ్యాయులకే ఇవ్వాలని గతంలో అనేక సార్లు ఉపాధ్యాయ సంఘాలు విన్నవించినప్పటికీ విద్యా శాఖ అధి కారులు తోసిపుచ్చి, ఇప్పుడు డీఈఓకి ఇవ్వడం తగదన్నారు. ఇటువంటి నిర్ణయాల కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడతారని, వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్ డిమాండు చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
విద్యార్థులకు బలవర్ధక ఆహారం అందించండి:ఆహార కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్రెడ్డి
*🌻ఈనాడు, అమరావతి*: మెస్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో వసతి గృహాల విద్యార్థులకు బలవర్ధక ఆహారం అందించే దిశగా సంబంధిత వార్డెన్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార మిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి సూచించారు. వసతి గృహాల్లో భోజన సౌకర్యాలపై పలు చోట్ల లోపాలు గుర్తించామని.. వాటిని సరిదిద్దుకోవాలని చెప్పారు. విజయవాడలోని ఆహార కమిషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 19 జిల్లాల పరిధిలో 366 అంగన్ వాడీ కేంద్రాలను తనిఖీ చేశామని వివరించారు. రేషన్ దుకాణాల్లోనూ బియ్యం బదులుగా సొమ్ము ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వచ్చే నెల నుంచి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథ కానికి అవసరమైన బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా చేరవేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆహార కమిషన్ సభ్య కన్వీనర్ విజయసునీత, సభ్యులు కాంతారావు, లక్ష్మీరెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఆర్జిత సెలవుల సొమ్ము ఎప్పుడు?:రూ.200 కోట్ల కోసం ఏడాదిగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదురుచూపులు
*🌻ఈనాడు, అమరావతి*: ఏడాది క్రితమే ఆర్టీసీ ఉద్యోగుల ఆర్జిత సెలవు లకు నగదు తీసుకోవడానికి (లీవ్ ఎన్ క్యాష్మెంట్) వీలుగా బిల్లులు అప్ లోడ్ చేసినా ఇప్పటికీ సొమ్ము విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల 2020-21 సంవత్సరం ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించ డంతో ఉద్యోగులు గత ఏడాది ఇందుకు సమ్మతి తెలిపారు. 40 వేల మంది ఉద్యోగులకు ఉన్న 15-20 సెలవులను నగదుగా మార్చుకోవడానికి అధికా రులు అంగీకారం తెలిపారు. ఆ మేరకు చెల్లించాల్సిన రూ.200కోట్లకు సంబంధించిన బిల్లును సీఎఫ్ఎంఎస్లో గత అక్టోబరులో అప్లోడ్ చేసినట్లు తెలిసింది. ఒక్కో ఉద్యోగికి వాళ్ల సెలవులు ఆధారంగా.. కనీసం సగం నెల జీతం చొప్పున, ఎక్కువ మందికి పూర్తి జీతం మేర చెల్లించాల్సి ఉంది.
*♦️పట్టించుకోని ఆర్థికశాఖ:*
ఆర్టీసీ ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్మెంట్ మొత్తం విడుదల చేయాలంటూ ఉద్యోగులు పదేపదే కోరుతూనే ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సైతం సీఎం, మంత్రులు, ఆర్థిక, రవాణాశాఖల ముఖ్య కార్యదర్శులకు పలు దఫాలుగా వినతులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
వైద్య కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలి:జాతీయ వైద్య మండలి
*🌻ఈనాడు, దిల్లీ*: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు అన్నింటిలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరును (ఏఈబీఏఎస్) తప్పని సరిగా అమలు చేయా లని జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ఆదేశించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్ఎంసీ ప్రకారం.. వైద్య కళాశాలల్లోని సిబ్బంది, డ్మినిస్ట్రేటర్స్, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్స్ తప్పనిసరిగా ఏఈబీ ఏఎస్ పరిధిలో ఉండాలి. ప్రతి వైద్య కళాశాలలో ఏఈబీఏఎస్ ఉండాలి. హాజరు నమోదుకు ఎటువంటి ఆటంకం లేకుండా వైవై/ ఫైబర్ ఇంటర్నెట్తో దానిని అనుసంధానించాలి. సరైన కారణం లేకుండా రెండు రోజుల పాటు బయోమెట్రి క్లో లో హాజరు నమోదు కాకపోతే ఎన్ఎంసీ దానిని తీవ్రంగా పరిగణిస్తుంది. వేలి ముద్రలు తీసుకునేలా యంత్రాలను గోడకు అమర్చాలి. వేలిముద్రల సమస్య ఉంటే ఐరిస్ ద్వారా హాజరు స్వీకరించే ఏర్పాట్లు చేయాలి. కళాశాలల్లోని సిబ్బంది అంతా ఉదయం, సాయంత్రం రోజుకు రెండు సార్లు హాజరు నమోదు చేయాలి.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
10 విడతల్లో.. పిల్లల సంరక్షణ సెలవులు
*🌻ఈనాడు, అమరావతి*: సర్కారు ఉద్యోగినులకు ప్రభుత్వం కల్పించిన 180 రోజులు పిల్లల సంరక్షణ సెలవులను మొత్తం సర్వీసులో పది విడతలుగా విని యోగించుకునేందుకు ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. ఇందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో ఈ సెలవులు 60 రోజులుగా ఉండేది. 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ సెలవులను 180 రోజులకు పొడిగించారు. 2022 మార్చి నెలలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. గరిష్ఠంగా మూడు విడతల్లో మాత్రమే ఆ సెలవులు వినియోగించుకునేందుకు అవకాశం. ఉండేది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం దీన్ని 10 విడతలకు పెంచాలని విన్నవించింది. వారి విన్నపం మేరకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 60 రోజులు సెలవులు వినియోగించుకున్న ఉద్యోగినులు కూడా మిగిలిన సెలవు రోజులు వినియోగించుకోవచ్చు. విడతల విషయంలో కూడా వారు గతంలో వినియోగించుకున్న సంఖ్యను మినహాయించి మిగిలిన విడతల్లో ఆ సెలవులు వినియోగించుకునేందుకు ఆస్కారం కల్పించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ప్రశాంతంగా ముగిసిన ఏపీఆర్‌సెట్
*🌻విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి)*: ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్)-2022 ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19 వరకూ 15 కేం ద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. 62 సబ్జక్టుల్లో ప్రవేశాలకు 7,590 మంది దరఖాస్తు చేసుకోగా.. 6,352 మంది (83.69 శాతం) హాజరయ్యారు. పరీక్ష నిర్వహించిన రోజే యూనివర్సిటీ అధికారులు ‘కీ’ విడుదల చేసి వెబ్‌సైట్‌లో పొందుపరచారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
బకాయిల బండ
*♦️జిల్లాలో ఉద్యోగులకు రూ.169.75 కోట్ల ప్రభుత్వబకాయిలు*
*♦️దసరాకు నో.. దీపావళిపైనే ఆశలు*
*🌻(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :* జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా పర్వదినం సందర్భంగా కొంతమేర చెల్లింపులు జరుపుతారేమోనని ఆశించినా అదీ జరగలేదు. తాజాగా దీపావళి కానుకగా అయినా బకాయిలు చెల్లిస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి దీపావళికి ఉద్యోగులకు ప్రయోజనం కల్పించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో మన జిల్లా పరిస్థితిని పరిశీలిస్తే..
*♦️బకాయిలు ఇవీ..👇👇👇*
జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, డీఏ అరియర్స్, సరెండర్ లీవ్‌లు, ఇతర అరియర్స్ కలిపి రూ.169.75 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిలో పీఎఫ్ లోన్లు/పార్ట్ ఫైనల్స్/ఫైనల్ పేమెంట్లకు సంబంధించి రూ.50.49 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఏపీజీఎల్‌ఐ లోన్లు, ఫైనల్ పేమెంట్లకు సంబంధించి రూ.55.60 కోట్లు, డీఏ అరియర్స్ రూ.31.22 కోట్లు, అర్ధ జీతపు సెలవులు, జీఐఎస్‌లు రూ.31.22 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ 2018, జూలై నుంచి రావాల్సి ఉంది. ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్‌ఐ లోన్/పార్ట్ ఫైనల్ మంజూరైన వారికి ఆ సొమ్ము చెల్లించకపోవడం వల్ల వేలాది రూపాయల వడ్డీని నష్టపోవాల్సి వస్తోంది. సరెండర్ లీవులు మంజూరైన వారికి కూడా ఆ డబ్బు చెల్లించట్లేదు. డీఏ అరియర్స్‌ను పీఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండానే ఉద్యోగుల నుంచి ఆదాయ పన్ను వసూలు చేశారు. ఈ చర్యలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 2018 నుంచి వందలాది సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చెందారు. వారికి కూడా పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, అర్ధ జీతపు సెలవు నగదు, గ్రాడ్యుటీ, కమ్యుటేషన్ మొత్తాలు ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో పదవీ విరమణ చెందిన ఉద్యోగుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాకుండా ఉన్నాయి.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇