TODAY EDUCATION/TEACHERS TOP NEWS 10/10/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

 ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు ప్రభుత్వం పై బొప్పరాజు ధ్వజం

రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నెల్లూరులో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటన సందర్భంగా నాటి మంత్రులు, అధికారుల కమిటీల చర్చల్లో ఒప్పు కొని రాతపూర్వకంగా రాసిచ్చిన అంశాలను సైతం ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఆర్థి కేతర అంశాలను వెంటనే ప్రకటిస్తామనీ, ఆర్థికాంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితి పెంచిన ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు వయోపరిమితి లేదంటూ జీవో ఇవ్వడం దారుణ మన్నారు. సీపీఎస్ రద్దు చేస్తా మని ఆశ కల్పించి ఇప్పుడు కుద రదని చెప్పడం దుర్మార్గమ న్నారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుండగా ఏపీలో చేయడం లేదన్నారు. డీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలకు నాటి చర్చల సంద ర్భంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు జీవో వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలనీ, లేకుంటే మరో విజయవాడ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఉద్యోగుల ఆగ్రహానికి గురికావొద్దు!: బొప్పరాజు

పీఆర్సీ చర్చల హామీలన్నీ నెరవేర్చాలి: బొప్పరాజు

ప్రభుత్వం పీఆర్సీ చర్చల సందర్భంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చ కపోతే చలో విజయవాడలు ఎన్నైనా రావచ్చు. అయితే అవి పున రావృతం కాకుండా కేవలం చర్చల ద్వారానే డిమాండ్లను పరిష్క రించుకోడానికి ప్రయత్నిస్తున్నాం. మరో చలో విజయవాడకు సిద్ధ మైతే ఉద్యోగుల వెంటే మేము కూడా రావాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిని తలెత్తనీయవద్దు” అని ఏపీజేఏసీ – అమరా వతి రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. “ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే కార్పొరే షన్, గురుకుల పాఠశాలలు, వర్సిటీల్లో పనిచేసే నాన్ టీచింగ్ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతుందని చర్చల సందర్భంలో ఆశించాం. చర్చల్లో దీనికి ఒప్పుకొని ఆ తరువాత వయోపరిమితిని పెంచేదిలేదని జీఓ విడు దల చేశారు. ఇది ఉద్యోగులు, నాయకుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించటమే” అని బొప్పరాజు అన్నారు. “జీపీఎస్కు మేం వ్యతిరే కం. ఓపీఎస్ అమలుకు మమ్ముల్ని వెంటనే చర్చలకు ఆహ్వానిం చాలి. ఇచ్చిన హామీ మేరకు కోర్టు నిబంధనలు, చట్టం ప్రకారం, అర్హత ఉన్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి. కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రధాన కేంద్రాలలో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం హెచ్ఎస్ఏ వర్తింపచేస్తామని మంత్రివర్గ కమిటీలో చెప్పారు. ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైనా స్పందించి ఉద్యో గుల డిమాండ్లను పరిష్కరించాలి. లేనిపక్షంలో ఉద్యోగుల ఆగ్రహా నికి మరోసారి గురికాక తప్పదు” అని బొప్పరాజు హెచ్చరించారు.

మానసిక వైకల్యం కలిగిన ప్రత్యేక అవసరాలు పిల్లలకు ఉచితంగా ప్రత్యేక ఉపకరణాలు

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మానసిక వైకల్యం కలిగిన ప్రత్యేక అవసరాలు పిల్లలకు ఉచి తంగా బోధనా సామగ్రి(టీఎల్ఎం) అందజేయనున్నారు. ఇప్పటికే గూడూరు, మచిలీపట్నం మండలాల విద్యార్థులకు వీటిని అందజేశారు. అక్కడ పని చేస్తున్న ప్రత్యేక ఉపాధ్యా యిని వి. శశికళ నెల్లూరు వెళ్లి సామగ్రి తీసుకుని వచ్చి పిల్లలకు ఇచ్చారు. మిగిలిన మండలాల ప్రత్యేక ఉపాధ్యాయుల నుంచి ఇండెంట్లు సేకరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవలు అందించే ఎస్ఐఈపీఐడి (సికిం ద్రాబాద్ ) సంస్థ రీజనల్ కేంద్రం నెల్లూరుకు విద్యార్థుల దరఖాస్తులు పంపి నట్లు ఎస్ఎస్ సహిత విద్య సమన్వయ కర్త ఎస్. రాంబాబు తెలిపారు. ఒక్కొక్క విద్యార్థికి వారి మానసిక వయస్సును బట్టి రూ.11 వేల నుంచి 20 వేల వరకు విలువ చేసే కిట్లను విద్యార్థులకు అందిం చనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వీటిని అందజేస్తామని తెలిపారు.

హిందీ మాధ్యమంలోనూ ఎంబీబీఎస్ :ఈఏడాది నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అమలు

దేశంలో తొలిసారిగా ఈ విద్యాసంవ త్సరం (2022-23) ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించేం దుకు రంగం సిద్ధమైంది. గత ఏడాది నుంచి బీటెక్ ను ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది ఏపీలోని ఒక కళాశా లతోపాటు మొత్తం 14 కళాశాలల్లో ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ బోధిం చేందుకు ముందుకు వచ్చాయి. ఈ సారి ఆ సంఖ్య 20కి పెరిగింది. తాజాగా హిందీలో ఎంబీబీఎస్ ను అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకువచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లోని గాంధీ మెడికల్ కళాశాల, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని అటల్ బిహారీ వాజ్ పేయి విశ్వవిద్యాలయం దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఎంబీ బీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పాఠ్యపుస్తకాలను హిందీలోకి అనువాదం చేశారు. వాటిని ఈ నెల 16న భోపాల్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఈ రెండు వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవే. వాటిలో 15 శాతం సీట్లను జాతీయ కోటా కింద కేటాయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో హిందీయేతర రాష్ట్రాలకు సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు పేర్కొం టున్నారు.

ఐఐటీల్లోనూ ఆంగ్లం వద్దు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు

 హిందీ, ప్రాంతీయ భాషలకు సంబం ధించి కేంద్ర హోంమంత్రి అమిషా నేతృత్వం లోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ఐఐటీల్లాంటి ఉన్నత సాంకేతిక, సాంకేతికేతర విద్యాసంస్థల్లోంచి బోధనామాధ్యమంగా ఇంగ్లీషును క్రమంగా తప్పించాలని సూచించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీలో, మిగతా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లిషు కంటే స్థానిక భాష లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ తన సిఫార్సుల్లో స్పష్టం చేసింది.®️👆

ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..12 నుంచి కౌన్సెలింగ్

ఆర్టీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపుల పాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవే శాలకు సంబంధించి సాధారణ జాబితా అభ్యర్థులు ఎంపిక పూర్తయ్యింది. వారికి ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ పీయూసీ రెండు, ఇంజినీరింగ్ నాలుగు సంవత్స రాల చొప్పున మొత్తం ఆరు సంవత్సరాల సమీ కృత విద్యను అభ్యసించాల్సి ఉంటుంది.

®️ఈ నెల 12, 13 తేదీల్లో నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ) ప్రాంగణాల్లో, 14, 15 తేదీల్లో ఒంగోలు ప్రాంగణానికి సంబంధించి ఇడు పులపాయలో, 15, 16 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ ఎచ్చెర్లలో జరుగుతుంది. 

*®️రుసుములు ఇలా..*

విద్యార్థులు ప్రభుత్వ పథ కాలు (విద్య, వసతి దీవెన) అర్హత లేని వారు పీయూసీలో సంవత్సరానికి రూ.45 వేలు, ఇంజినీ రింగ్లో సంవత్సరానికి రూ.50 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు నెలకు రూ.2,500 నుంచి రూ.3000. వరకు చెల్లించాలి. ప్రవేశ రుసుము రూ.1000, (ఎస్సీ, ఎస్టీలు రూ.500), గ్రూపు బీమా కింద రూ.1,200(ఈ సొమ్ము బీమా ఏజెన్సీకి చెల్లిస్తారు), కాషన్ డిపాజిట్ రూ.1000(ఇది ఆఖరులో అభ్యర్థికి తిరిగి చెల్లిస్తారు), వసతి గృహ నిర్వహణ రుసుము రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 

*®️అవసరమైన పత్రాలు..:* సంబంధిత బోర్డు జారీ చేసిన ఎస్ఎస్సీ/తత్సమాన పరీక్ష ధ్రువీక రణ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ, తాజా ఈడబ్ల్యూఎస్ (2021 తర్వాత), ప్రత్యేక విభాగాలకు చెందిన ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్ట్ ఫొటోలు.

*®️నూజివీడుకు రావాలంటే..*

®️విశాఖపట్నం నుంచి రైలులో వచ్చే వారు. హనుమాన్ జంక్షన్ (నూజివీడు స్టేషన్)లో దిగి బస్సు లేదా ఆటోలో నూజివీడు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వచ్చే వారు విజయవాడలో దిగి, బస్సులో నూజివీడు చేరుకోవచ్చు.

కనీసం ఇద్దరు టీచర్లను నియమించాలి: యుటిఎఫ్ డిమాండ్

విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్న వాటిల్లో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది.ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 8 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని, సంస్కరణల్లో భాగంగా మరో 8 వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిల్లో మరో టీచర్‌ను నియమించకపోతే ఇవి సహజ మరణం చెందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో టీచర్‌ ఉంటేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలను నడుపుతోందని విమర్శించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఉపాధ్యాయులు లేకపోవడమే కారణమని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశంపై తన విధానాన్ని పున్ణపరిశీలించుకోవాలని కోరింది. లేదంటే అన్ని ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యాపార కోణంలో చూడొద్దు: ఎస్‌టియు

విద్యను వ్యాపార కోణంలో చూడొద్దని ఎస్‌టియు అధ్యక్షులు సాయిశ్రీనివాస్‌ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే నాణ్యమైన విద్య అవసరమన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులుంటేనే అన్ని తరగతుల్లో బోధన చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. పిల్లలు తక్కువ మంది ఉన్నారని నెపంతో ఒక ఉపాధ్యాయుడినే కేటాయిస్తే పిల్లల భవిష్యత్‌ను పాడు చేసినట్లు అవుతుందని తెలిపారు.

గత నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలి:ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం

ప్రస్తుతం జరగనున్న ఉపాధ్యాయ పదోన్నతులలో విద్యాశాఖ తాజా నిబంధనలు టీచర్ల ప్రమోషన్ అవకాశాలు దెబ్బతీసేలా ఉన్నాయని, కాబట్టి గతం నుండి అమలు చేస్తున్న నిబంధనలమేరకు ఉపాధ్యా యులకు పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. ఒకటి కన్నా ఎక్కువ ప్రమోషన్ చానల్స్ ఉన్నప్పుడు ఒక  ప్రమోషన్ తిరస్కరించిన రెండవ ప్రమోషన్ కు అర్హత ఉంటుందని, అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఒక సబ్జెక్టుకు ప్రమోషన్ తిరస్కరిస్తే మరలా ఒక సంవత్సరం పూర్తి అయ్యేంతవరకు వేరొక సబ్జెక్టు లేదా ప్రమోషన్ చానల్ కు అవకాశం లేదని విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం చాలా అన్యాయమన్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు విద్యాశాఖ నిర్ణయాలు తీరని అన్యాయానికి గురి చేసేవిగా ఉన్నాయని సామల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా మాటమాటికీ నిబంధనలు మార్చి ఉపాధ్యాయ ప్రయోజనాలు దెబ్బ తీయడం సరి కాదన్నారు. ఈ విషయమై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తక్షణమే దృష్టిసారించి ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగే విధానాన్ని అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సామల డిమాండ్ చేశారు.

జగనన్న విద్యా కానుక..ఇక మరింత మెరుగ్గా’:చిన్నపాటి లోపాలు సైతం లేకుండా పకడ్బందీగా పథకం అమలు

*®️పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయ సేకరణ*

*®️నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అన్ని వస్తువులు ఉండేలా జాగ్రత్తలు..*

 *®️2023-24 నుంచి ప్రతి విద్యార్థికీ సరిపడేలా అదనపు యూనిఫాం క్లాత్‌*

*®️లావుగా ఉన్న పిల్లలకు కూడా క్లాత్‌ సరిపోయేలా చర్యలు*

*®️కుట్టు కూలీ ధర పెంపుపై పరిశీలన.. బ్యాగుల్లో మార్పులు*

*®️1-5 తరగతులకు మీడియం సైజ్‌ బ్యాగ్‌.. 6-10 తరగతులకు పెద్ద సైజ్‌.. నోట్‌బుక్‌లు, పాఠ్య పుస్తకాలు అన్నీ అమరే విధంగా వెడల్పాటి బ్యాగ్‌*

*®️షూ సైజులు తీసుకోవడానికి మండల స్థాయిలో సరఫరాదారులతో మేళాలు*

*®️వచ్చే ఏడాది పంపిణీకి ఇప్పటి నుంచే విద్యా శాఖ సన్నాహాలు*

*®️సాక్షి, అమరావతి*: రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్ణీత ప్రమాణాలకు ఎక్కడా తగ్గకుండా వస్తువులను పంపిణీ చేయించేలా పాఠశాల విద్యా శాఖ దృష్టి సారించింది. జగనన్న విద్యా కానుక వస్తువులకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది.

®️అక్కడక్కడ తలెత్తిన చిన్న చిన్న లోపాలు కూడా భవిష్యత్తులో ఉండకుండా చూసుకోవాలని నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ మరింత నాణ్యమైన వస్తువుల పంపిణీకి ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టింది.

*®️ఏటేటా పెరుగుతున్న నాణ్యత*

®️ గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫారం మాత్రమే ఇచ్చేవారు. అదీ విద్యా సంవత్సరం ఆరంభమై ఏడెనిమిది నెలలు గడిచినా అందేవి కావు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారం అందించేలా చర్యలు తీసుకున్నారు. కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారంతో పాటు నోట్సులు, వర్కు బుక్కులు, షూలు, సాక్సులు, బెల్టులు, బ్యాగులు అందించేలా జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టారు.

®️ రెండు జతల యూనిఫారం కాకుండా మూడు జతలు అందిస్తున్నారు. దీనికి అదనంగా విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీలను పంపిణీ చేయిస్తున్నారు. 2020-21లో 42,34,322 మంది విద్యార్థులకు రూ.648.10 కోట్లతో, 2021-22లో 45,71,051 మందికి రూ.789.21 కోట్లతో, 2022-23లో 4,740,421 మందికి రూ.931.02 కోట్లతో జగనన్న విద్యా కానుకను అందించారు. మూడేళ్లలో ఈ వస్తువుల కోసం రూ. 2,368.33 కోట్లు వెచ్చించారు.

®️ అయితే వేలాది స్కూళ్లలో లక్షలాది మంది విద్యార్థులకు పంపిణీకి సంబంధించిన కార్యక్రమం కావడంతో క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు తలెత్తడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు విద్యా శాఖ అధికారులు పరిష్కరిస్తున్నారు. మౌలికమైన అంశాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటినీ పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు.

®️ ఇలా ఏటేటా ఈ పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తాజాగా వారి నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇకపై మరింత నాణ్యమైన వస్తువులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

*®️ఇకపై మార్పులు ఇలా..👇👇👇*

®️► అన్ని ఊళ్లలో ఒక్కో తరగతిలో ఒకరో ఇద్దరో పిల్లలు లావుగా ఉండొచ్చు. వారికి యూనిఫాం క్లాత్‌ సరిపోకపోయి ఉండొచ్చు. ఇకపై ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ సరిపడా రీతిలో మూడు జతల యూనిఫారం క్లాత్‌ ఇచ్చేందుకు చర్యలు.

®️ కుట్టు కూలీ మరింత పెంచి ఇచ్చే విషయమూ విద్యా శాఖ పరిశీలన చేస్తోంది.

®️ బ్యాగుల పరిమాణంపై నిపుణుల సూచనల మేరకు మార్పులు చేయిస్తోంది. 1-5 తరగతుల విద్యార్థులకు మీడియం సైజు, 6-10 తరగతుల విద్యార్థులకు పెద్ద సైజు బ్యాగులు అందించనున్నారు. ఈసారి బ్యాగు వెడల్పు పెంచనున్నారు.

®️ బ్యాగులో నోట్‌బుక్కులు, పాఠ్య పుస్తకాలు అన్నీ పట్టేలా కొత్త టెండర్‌లో స్పెసిఫికేషన్లు సవరించనున్నారు.

®️పిల్లల షూ సైజులను తీసుకొనేందుకు మండల స్థాయిలో ఆయా కంపెనీల ద్వారా షూ మేళాలు నిర్వహించేలా చేయడమో, లేదా కూపన్లు అందించి ఆయా కంపెనీల దుకాణాలలో వాటిని రీడీమ్‌ చేసుకొని షూలు పొందేలా చేయడమో చేయాలని ప్రతిపాదించారు.

®️ విద్యా కానుక పంపిణీలో జాప్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేకుండా ఇప్పటి నుంచే విద్యా శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. బడ్జెట్‌ ఎస్టిమేట్లను త్వరగా పూర్తి చేసి ఆర్థిక అనుమతులు పొందడం, టెండర్‌ డాక్యుమెంట్లు ఫైనల్‌ చేయడం, టెండర్లను పిలవడం, కంపెనీల ఎంపిక, వర్కు ఆర్డర్ల జారీ, ఒప్పందాలు చేసుకోవడం వంటివి ఈ ఏడాది నవంబర్‌ చివరికల్లా ముగించాలని భావిస్తున్నారు.

®️ వచ్చే ఏడాది ఏప్రిల్‌ మొదటి వారానికి జిల్లా.. మండల స్థాయికి ఆయా వస్తువులను చేర్చడం. ఏప్రిల్‌ 15 నాటికి కిట్ల రూపంలో వాటిని సిద్ధం చేయడం. పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులందరికీ వాటిని పంపిణీ చేయించడం. వచ్చే ఏడాది విద్యా కానుక అమలు కోసం రూ.958.34 కోట్లు అవసరమవుతాయని విద్మాయ శాఖ అంచనా వేసింది.

®️తిరుపతికి చెందిన వంశీ అనే విద్యార్థి ఇప్పుడు ఆరవ తరగతి చదువుతున్నాడు. ఒబేసిటీ కారణంగా ఈ విద్యార్థిలావుగా ఉంటాడు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది ఇచ్చిన యూనిఫారంతో మూడు జతల డ్రస్‌ కుట్టించడం వీలు పడలేదు. రెండు జతలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉండొచ్చు. ఇలా ఒకరిద్దరికి క్లాత్‌ సరిపోనంత మాత్రాన.. అందరికీ సరిపోలేదని ప్రచారం చేసే ప్రబుద్ధులున్నారు. అందువల్ల ఇకపై ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.®️

ఉద్యోగోన్నతులపై 40 అభ్యంతరాలు

కృష్ణా, ఎన్టీ ఆర్ జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితాలపై డీఈవో కార్యాలయానికి 40 మంది అభ్యంతరాలు నేరుగా అందజేశారు. మరి కొంతమంది ఆన్లైన్లో నమోదు చేశారు. 10న తుది జాబితాను ప్రాథమిక విద్యాశాఖ విడుదల చేస్తుందని డీఈవో కార్యాలయ ఏడీ అజీజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 180 మందికి పదోన్నతులు కల్పించనున్నారు. 23 మంది ప్రధానోపాధ్యాయులు, 13 లెక్కలు స్కూల్ అసిస్టెంట్లు, 6 భౌతికశాస్త్రం స్కూల్ అసిస్టెంట్లు, 3 వ్యాయామ, 135 ఆంగ్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇస్తారన్నారు. 12, 13 తేదీల్లో స్కూల్ అసిసెంట్లకు కూడా ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

JOIN TELEGRAM GROUP

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!