సందేహాలు — సమాధానాలు
🖊📗📘🖊
*సందేహాలు — సమాధానాలు*
*ప్రశ్న:1*
*అడ్మిషన్ రిజిస్టర్ లో ఒక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ/కార్పొరేషన్ వారు ఇచ్చిన సెర్టిఫికెట్ లో మరొక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ సెర్టిఫికెట్ ప్రకారం పుట్టిన తేదీ నామినల్ రోల్స్ లో మార్చమని పేరెంట్స్ అడుగుతున్నారు. అలా మార్చవచ్చా?*
*జవాబు:*
*SSC రూల్స్ 6 ప్రకారం తనిఖీ అధికారి అనుమతితో మార్పు చేయవచ్చు.*
*ప్రశ్న:2*
*ఒక టీచర్ జూన్ నుంచి డిసెంబరు వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.ఆమె ఇంక్రిమెంట్ అక్టోబర్ నెలలో ఉంది.ఆమెకు ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి ఇవ్వాలి?*
*జవాబు:*
*జీఓ.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ఇంక్రిమెంట్ అక్టోబర్ 1 నుండి మంజూరు చేస్తూ, ఆర్ధిక లాభం విధులలో చేరిన తేదీ నుంచి మంజూరు చెయ్యాలి.*
*ప్రశ్న:3*
*ఐటీ కేవలం ఫిబ్రవరి జీతంలోనే మినహాయించాలా?*
*జవాబు:*
*ఐటీ నిబంధనలు ప్రకారం చెల్లించవలసిన ఐటీ ముందే అంచనా వేసి మార్చి నెల జీతం నుండి ప్రారంభించి నెలనెలా మినహాయించాలి. ప్రతి క్వార్టర్ కి రిటర్న్స్ ఐటీ శాఖకు సమర్పించాలి. ఈ భాద్యత DDO లదే.*
*ప్రశ్న:4*
*ఒకరు మిలటరీ లో చేసి రిటైర్మెంట్ అయి, మరల sgt గా చేరి రిటైర్డ్ అయ్యారు. ఇపుడు అతనికి రెండు పెన్షన్లు వస్తాయా?*
*జవాబు:*
*ఏపీ పెన్షన్ రూల్స్ ప్రకారం రెండు పెన్షన్లు పొందవచ్చు.*
*ప్రశ్న:5*
*నేను SA క్యాడర్ లో 12 ఇయర్స్ స్కేల్ పొందాను. ఇటీవల HM గా పదోన్నతి వస్తే వదులుకున్నాను. ప్రస్తుతం నాకు జరిగే నష్టం ఏమిటి?*
*జవాబు:*
*మెమో.3307 ; ఆర్ధిక ; తేదీ:24.2.1993 ప్రకారం 18,24 ఇయర్స్ స్కేల్స్ ఇక ఇవ్వరు.ఇచ్చిన 12 ఇయర్స్ స్కేల్ మాత్రం కొనసాగుతుంది.*
🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁
You might also check these ralated posts.....