ప్రభుత్వ బడుల్లోని స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2 పదోన్నతు లకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల ఏడో తేదీలోపు సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పెట్టాలని జిల్లా విద్యాధికారులు (డీఈవో), ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితాపై 7, 8 తేదీల్లో అభ్యం తరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల పరిశీలన, పరి ష్కారం 9న, తుది సీనియారిటీ జాబితా 10న ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2గా తాత్కాలిక పదోన్నతులు 11న, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా తాత్కాలిక పదోన్నతులు 12, 13
AP 1000 CBSE Schools 10th Hindi Deleted Syllabus 2024-25 Review the syllabus of Hindi subject…
సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ వెట్రి సెల్వీ బదిలీ
సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వీని ఆంగ్ల మాధ్యమం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగాబదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్త
ర్వులు జారీ చేశారు. పాఠశాల విద్య సంయుక్త కార్యదర్శిగానూ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. పాఠశాలవిద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ను సమగ్ర శిక్షా
అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు ఇన్ఛార్జి డైరెక్టర్గా నియమించారు.
రికార్డు అసిస్టెంట్ పోస్టు పదోన్నతికి మార్గదర్శకాలు
జిల్లా గ్రంథాలయ సంస్థల్లోని రికార్డు అసిస్టెంట్ పోస్టుకు పదోన్నతి, బదిలీకి స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులై, చివరి గ్రేడ్ లో కనీసం రెండేళ్లు పని చేసిన వారికి రికార్డు అసిస్టెంట్గా పదోన్నతి కల్పించాలని పేర్కొంది.
ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు
ఓఎమ్మార్ విధానంలో ఫార్మెటివ్ -1, 3, సమ్మెటివ్-2 పరీక్షలు
దిద్దుబాట్లకు ఆస్కారముందంటూ ఉపాధ్యాయుల ఆందోళన
ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది పార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల్లో మార్పులు చేసింది. ఫార్మెటివ్-1, 3, సమ్మెటివ్-2 పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా (సీబీఏ) విధానంలో నిర్వహిస్తారు, ప్రపంచ బ్యాంకు ఒప్పందం నేపథ్యంలో విద్యా ర్థుల సామర్థ్యాలను విశ్లేషించేందుకు ఎడ్యుకేషన్ ఇనిషి యేటివ్స్ సంస్థతో విద్యాశాఖ మరో అవగాహన చేసుకుంది. ఈ సంస్థ ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు చేశారు. ఫార్మెటివ్ పరీక్షల్లో 15 మార్కులకు ఓఎమ్మార్ విధానంలో, మరో ఐదు మార్కులకు రాతపూర్వకంగా పరీక్ష నిర్వహిస్తారు. 1-8తరగతుల విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎమ్మార్ షీటు ఇస్తారు. ఇందు లోనే ఒక్కో సబ్జెక్టుకు 15 చొప్పున బహుళైచ్చిక సమా దానాలు ఉంటాయి. మొదటి రోజు ఉదయం ప్రశ్నప క్షేత్రంతోపాటు ఓఎమ్మార్ షీటు ఇస్తారు. మధ్యాహ్నం పరీక్షకు మళ్లీ అదే ఓఎమ్మారు ఇస్తారు. ఇలా రెండు రోజులపాటు జరిగే పరీక్షలకు ఓఎమ్మార్ ఇచ్చి, తీసు కుంటారు. ప్రైవేటు వారికి ఓఎమ్మార్ షీట్లు ఉండవు. వారు ప్రశ్నపత్రంలోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఉర్దూ, కన్నడ లాంటి మైనర్ భాషలకు కూడా అంతే. ఈ షీట్ల ముద్రణ ఆలస్యమవుతున్నందున పరీక్షల షెడ్యూలును మార్చేశారు. నవంబరు 2-5 వరకు ఫార్మె టివ్-1 పరీక్షలు ఉంటాయి. 9, 10 తరగతులకు పాత విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
తప్పుల సవరణకు అవకాశం?
విద్యార్థులకు ఉదయం పరీక్షకు సంబంధించిన ఓఎమ్మార్ షీటునే మళ్లీ మధ్యాహ్నం ఇస్తే సమాధానాలు మార్చే అవకాశం ఉంటుందని, తద్వారా అందరికీ ఎక్కువ మార్కులు రావొచ్చని ఉపాధ్యాయులు చెబు తున్నారు. ఉదాహరణకు.. 1-5 తరగతులకు నవం బరు ఒకటిన మొదటి రోజు ఉదయం తెలుగు ప్రశ్న పత్రంతోపాటు 15 మార్కుల బహుళైచ్చిక జవాబులు రాసేందుకు ఓఎమ్మార్ షీటు ఇస్తారు. అందులో విద్యార్ధులు కొన్నింటికి తప్పుడు సమాధానాలు రాయొచ్చు. పరీక్ష తర్వాత పిల్లలు తాము రాసిన జవా బుల్లో తప్పులను గుర్తిస్తారు. మధ్యాహ్నం జరిగే గణిత పరీక్షకు ఉదయం ఇచ్చిన ఓఎమ్మార్ షీట్నే మళ్లీ ఇస్తే ఉదయం మార్క్ చేసిన సమాధానాల్లోని తప్పులను సరిచేసే అవకాశం ఉంటుంది. అలాంట ప్పుడు విద్యార్థుల సామర్థ్యాలను ఎలా అంచనా వేయ ”గలం’ అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ఒప్పందం కారణంగా బేస్ లైన్ పరీక్ష, తరగతి గది ఆధారిత అంచనా పరీక్షలంటూ ముద్రణకే రూ. కోట్లు వెచ్చిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పండగొచ్చినా పడని జీతాలు
చెల్లింపులు 24 నుంచి 30 శాతమే
శనివారం కొద్దిగా, ఆదివారం ఇంకాస్త జమ
సోమవారం మెసేజ్కోసం ‘సెల్’ చూపులే
తీవ్ర ఆవేదనలో ఉద్యోగులు, పెన్షనర్లు
అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి చెల్లింపులే లేవు
దసరా సరదా కూడా మిగల్చరా అంటూ వేదన
రేపే దసరా! రెండు రోజుల్లో పండగ పెట్టుకుని ఈ నెల జీతాలు ఇంకా పడకపోవడంతో చాలామంది ఉద్యోగుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. వేడుక మూడ్‌లోకి ఇప్పటికే వెళ్లిపోవాల్సిన వీరు.. శాలరీ మెసేజ్‌ల కోసం సెల్‌ఫోన్లు చూస్తూ గడిపేయాల్సి వస్తోంది. వేతనాలు పడితే తీసుకోవాల్సిన కొత్త దుస్తులు, ఇంటికి తెచ్చుకోవాల్సిన గృహోపకరణాలపై వేసుకున్న లెక్కలు వెక్కిరిస్తుంటే..పలువురు ఉద్యోగులు ఆవేదనతో నిట్టూరుస్తున్నారు. ‘దసరా సరదా కూడా మాకు మిగల్చరా’ అంటూ వేదనతో ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షలమంది, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. వీరిలో సోమవారం అర్ధరాత్రి నాటికి ఉద్యోగుల్లో పాతికశాతం మందికి మాత్రమే జీతాలు అందాయి. మూడోవంతుమందికి మాత్రమే పెన్షన్లు పడ్డాయి. ప్రభుత్వం ఇంకో రూ.2 వేల కోట్లు అప్పు తీసుకురావడంతో మరికొంత మందికి పడే అవకాశం ఉంది. అయితే.. ఉద్యోగులందరికీ ఒకేసారి వేతనాలు అందే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. జీతాలు దశలవారీగానే అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల కింద నెలకు రూ. 3,700 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ. 1000 కోట్ల విలువైన చెల్లింపులు మాత్రమే ఇప్పటివరకు జరిగాయి. పెన్షనర్లకు రూ. 1600 కోట్లు పెన్షన్లు కింద ఇవ్వాలి.అందులో రూ. 500 కోట్లు విలువైన చెల్లింపులు జరిగాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపే జరగలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు..ఇలా మొత్తంగా చూసుకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 24 శాతం నుంచి 30 శాతం వరకు మాత్రమే ప్రభుత్వ వేతనాలు, పెన్షన్ల రూపంలో అందుకున్నారు. రాష్ట్రంలో ఏ ఇద్దరు ఉద్యోగుల కలిసినా ఇప్పుడు ఒకటే చర్చ! జీతం పడిందా? లేదా? అని పరస్పరం ఆరా తీసుకుంటున్నారు.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు అందాలి. శనివారం సాయంత్రానికి రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులతోపాటు,. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో మూడోంతుల మందికి ఆరోజు పడలేదు. కొంత మందికి 2వ తేదీ ఆదివారం వారి ఖాతాల్లో జమ అయ్యాయి. మొత్తం మీద వీరికి వేతనాలు పడినాయి…పడలేదు అని చెప్పడానికి వీలు లేకుండా అంతా ఆర్థికశాఖ కార్యదర్శి చేతుల్లోనే ఉందనే వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లోనే వినిపిస్తోంది. దీంతో క్షణక్షణం ఉద్యోగులు తమ సెల్ ఫోన్‌కి బ్యాంకు నుంచి ఏమైనా సందేశం వచ్చిందేమో అని చూసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలను పదేపదే చెక్ చేసుకుంటున్నారు. తోటి ఉద్యోగులను జీతం పడిందా అంటూ వాకబు చేస్తున్నారు. ఉద్యోగులు ఇళ్ల రుణాలు, కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరోగ్య కారణాలతో బ్యాంకుల్లో పలు రుణాలు తీసుకుంటారు. అయితే ఆ రుణాలు నెల నెలా ఈఎంఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల ఈఎంఐ 5వ తేదీకి కటాఫ్ డేట్‌గా ఉంటుంది. అయితే మూడవ తేదీ సాయంత్రానికి వేతనాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ పెరిగిపోయింది. సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ దెబ్బ తింటుందని, ఆ తర్వాత తమకు బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి పోతుందని వాపోతున్నారు.
”సెప్టెంబరు నెల జీతం, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు ఇంకా కొంతమందికి జమ కాలేదు. పండగ దగ్గరపడినా.. ఇంకా తమకు జీతాలు అందలేదంటూ నాకు ఫోన్లు, వాట్సా్‌పల ద్వారా పలువురు ఉద్యోగులు తెలియజేస్తున్నారు. ఈ విషయమై సోమవారం ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాం. మంగళవారంలోగా అందరికీ జీతాలు, పెన్షన్లు వారి వారి అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు”
పండుగ వేళ.. వేతన వేదన
జీతాలకు నోచుకోని ఉద్యోగులు
కొందరి ఖాతాలోనే జమ.. మిగిలిన వారిలో ఆందోళన
ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగ నేతల సంప్రదింపులు
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు… ఉపాధ్యాయులు.. పిం ఛనర్లలో పండుగ గుబులు పట్టుకుంది.. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఆర్ధిక వెసులు బాటును దృష్టిలో ఉంచుకుని 15వ తేదీలోపు ప్రభుత్వం జీతాలు, పింఛన్లు చెల్లిస్తోం ది.. గత కొద్ది నెలలుగా సకాలంలో వేతనాలు.. పింఛన్లు ఎప్పుడు తమ ఖాతాలా జ మ అవుతాయా అని నిరీక్షించి నీరసిస్తున్న ఉద్యోగులు ఈ నెల్లో పండుగ వేళ జీతా లకు నోచుకోకపోవటంతో ఆందోళన మొదలైంది.. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది వరకు రెగ్యులర్ మరో రెండు లక్షల మందికి పైగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉపా ధ్యాయులతో పాటు మరో నాలుగు లక్షల మందికి ప్రభుత్వం చెల్లింపులు జరుపు తోంది. గత నెల జీతం ఈ నెల మొదటి తారీఖున జమ కావాల్సి ఉండగా వీరిలో సగా నికి పైగా చెల్లింపులు నిలిచిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. దసరా నవరా త్రులు ఇప్పటికే ప్రారంభం కావటంతో పాటు పండుగ రోజుల్లో ఇక చెల్లించే అవకాశం ఉండదనే భయాందోళనలో ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ఉద్యోగ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం కోసం సంప్రతింపులు జరుపుతున్నారు. దీనిపై ఏపీజేఏసీ – అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, తదితర నేతలు సోమ వారం ఆర్థికశాఖ ఉన్నతాధికారులను కలుసుకుని పరిస్థితిపై ఆరా తీశారు. అనివార్య కారణాల వల్ల కొందరికి జీతాలు, పింఛన్లు వారి ఖాతాలో జమకాలేదని మంగళవా రం జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. సోమవారం నుంచే పండుగ రోజుల్లో ఆలస్యంగా జీతాలు జమ చేయటం వల్ల కుటుంబాలు ఎలా గడపాలని నగదు జమకాని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పింఛనర్లలో కూ డా చాలా మందికి జమకాలేదని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఆర్థిక సర్దు బాటులో భాగంగా 1వ తేదీన కొందరి ఖాతాల్లో జమ చేసిందని అధికార వర్గాల సమాచారం. దుర్గాష్టమి సందర్భంగా సోమవారం సెలవు కావటంతో మంగళ వారంజమచేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే కొద్దిపాటి జాష్యం జరిగినా తట్టుకోగలమని పండుగ రోజుల్లో సమయానికి అంంచకపోవ టంతో కుటుంబాలను ఏరకంగా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా ఇదేరకంగా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఇటీవల సీఎఫ్ఎంఎస్ సాం కేతిక లోపం సాకుతో జీపీఎఫ్ సొమ్మును తీసుకుని కోర్టు ఆదేశాల మేరకు తిరిగి చెల్లించారని గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం నూతన పీఆర్సీ, డీఏ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామన్నా అందుకు అంగీకరించామని అయితే ఇప్పటి వరకు వాటి ఊసే లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు జీతాలు చెల్లిస్తే చాలనే పరిస్థితికి వచ్చా మని అది కూడా ఆలస్యమైతే తమ భవిష్యత్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విభా గాల్లో అవినీతిని నిర్మూలిస్తామని ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటిస్తున్న ప్రభుత్వం అదే నిబద్దతతో తమ బకాయిలు, జీతాలు చెల్లించే దిశగా ఆలోచనలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా ఉద్యోగులు, పింఛనర్లకు పీఆర్సీ, డీఏ బకాయిలు దాదాపు రూ. 10 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము కూడా సర్దుకుపోతున్నా ఇలాంటి జాప్యంతో ఉద్యోగులు, పింఛనర్లలో అభద్రతా భావం పెరుగుతోందని వాదిస్తు న్నారు. ఇదిలా ఉండగా జీతాలు, పింఛన్లు రాని అందుకోని ఉద్యోగుల్లో మంగళ వారమైనా తమ ఖాతాలో జమ అవుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం డిమాండ్ చేశారు.
జీతాలు వెంటనే చెల్లించాలి: యుటిఎఫ్
నెల చివరి వరకు కష్టపడి పనిచేసిన వారికి మొదటి తారీఖున జీతాలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చాలని ఐక్య ఉపాధ్యాయ
ఫెడరేషన్(యుటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పండుగఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవడం ఘోరమన్నారు.ప్రతి నెలా ఇలాగే ఆలస్యమౌతోందని, పదే పదే ఈ పరిస్థితిని పునరావృతం చేయడం
మంచిదికాదని అన్నారు.
నెల జీతాలు చెల్లించాలి: ఎపిటిఎఫ్
ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ మాసానికి గాను నెల జీతాలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఎపిటిఎఫ్) డిమాండ్ చేసింది. అతిపెద్ద పండుగ అయిన దసరా సందర్భంలోనూ మూడో తారీఖ్ అయినా ఇంకా 20 శాతం జీతాలు కూడా ఇవ్వకపోవడం విడ్డూరమని ఆ సంఘ నేతలు హృదయరాజు, చిరంజీవి పేర్కొన్నారు.
త్రిశంకు స్వర్గంలోమున్సిపల్ టీచర్లు
డీడీవో అధికారాల బదలాయింపుపై సందిగ్ధం
పాఠశాల విద్యాశాఖలో విలీనంపై అనుమానాలు
పాఠశాల విద్యాశాఖలో మున్సి పల్ టీచర్లను కలుపుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకు న్నప్పటికీ మున్సిపల్ టీచర్ల పరిస్థితి ఇప్పటికీ త్రిశంకు స్వర్గం లోనే ఉంది. వచ్చే నెల నుండి తమ జీతాలు తామే డ్రాయింగ్ చేసుకునేలా డీడీవో అధికారాలు ఇస్తామని విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చి నప్పటికీ ఆచరణలో సమస్యలు తలెత్తవచ్చుననే అనుమానాలను ఉపాధ్యాయ సంఘాలు వెల్లడి స్తున్నాయి. జిల్లా పరిషత్ స్కూల్లోకి మున్సి పల్ టీచర్లను విలినీం చేస్తామని మూడు నెలలుగా ప్రభుత్వం చెబూతూనే ఉంది కానీ ఆ పని మాత్రం జరగడం లేదు. ఇప్పటి వరకు విద్యాశాఖకు, మున్సిపల్ శాఖకు మధ్య ఒక అవగాహన ఒప్పం దం మాత్రమే జరిగింది. ఆ అవగాహన ఒప్పం దాన్ని కేబినెట్ ఆమోదిం చింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా మున్సిపల్ టీచర్ల విలీ నం. చట్ట ప్రకారం సమస్యలు వస్తాయని, మున్సిపల్ టీచర్లకు ప్రయోజనాలను జిల్లా పరిషత్ స్కూళ్ల లో కలపడం ద్వారా ఇవ్వడం సాధ్యం కాని పని అని న్యాయ శాఖలోనిఓ అధికారి పేర్కొన్నారు. కాగా తమను జిల్లా పరిషత్ స్కూళ్ల లో కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యలో కలపాలని ఉపాధ్యా య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మున్సిపల్
కౌన్సిళ్లు కూడా మున్సి పల్ టీచర్లను ప్రభుత్వ పాఠశాల విద్యలో విలినీం చేయాలనే తీర్మానం చేశాయని, కానీ ప్రభుత్వం మాత్రం మున్సిపల్ టీచర్లను జిల్లా పరిషత్ పాఠ శాల విద్యలో కలుపుతు న్నారని, ఇది అన్యాయ మని అంటు న్నారు. అసలు మున్సిపల్ టీచర్లను ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలో విలినీం చేయా ల్సిన అవ సరమే లేదని, మున్సిపల్ విద్యకు ఒక డైరెక్టరేట్ పెడితే సరిపోతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మున్సి పల్ విద్య మున్సిపల్ శాఖ పరిధిలోనే ఉందని, రాష్ట్రంలో మాత్రం దీన్ని జెడ్పీ పాఠశాల విద్యలో కలిపేస్తున్నారని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నేత రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పురపాలక విద్య పురపాలక చట్టాల ప్రకారమే ఉండాలని, పురపాలక సర్వీసు రూల్స్ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ల పదోన్నతులకు షెడ్యూల్ విడుదల
ప్రభుత్వపాఠశాలల్లో జిల్లా పరిషత్, మండల్ పరిషత్ స్కూళ్లలో స్కూల్ అసి సెంటు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు ఇచ్చేందు కు ప్రాధమిక విద్యాశాఖ షెడ్యూల్ను ప్రకటించింది. ఈనెల రెండో తేదీ నుండి సినీయారిటీ జాబితాను . తయారు చేస్తున్నారు. సీనియారిటీ జాబితాను ఏడో తేదీ నుండి వెబ్సైట్లో ఉంచు తారు. ఈనెల ఏడు, ఎనిమిది తేదీల్లో సీనియారిటీ జాబితాపై ఆన్లైన్లో అభ్యంతరాల ను స్వీకరిస్తారు. తొమ్మిదో తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు. పదో తేదీన తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. పదమూడో తేదీ నాటికి పదోన్నతల ప్రక్రియనంతా ముగిస్తారు.
చర్చించకుండానే పరీక్ష విధానంలో మార్పులా?
ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండానే ప్రభుత్వం పాఠశాల పరీక్షల్లో మార్పులు తీసుకొచ్చిందని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్), ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య పేర్కొన్నాయి. ఇప్పుడు ఉన్న పరీక్ష విధానంలో ఏం లోపం ఉందో.. కొత్త విధానంతో విద్యార్థులకు ఏం లాభం కలుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతి ఏడాది పరీక్షల్లో రకరకాల మార్పులు చేయడం వల్ల విద్యార్థులు నష్ట పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి.
ఏఎన్ యూ బోధనేతరసిబ్బందికి ఊరట
62 ఏళ్ల రిటైర్మెంట్ కొనసాగించండి
హైకోర్టు ఆదేశాలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బందికి హైకోర్టులో ఊరట లభించింది. బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయోపరిమితిని 62 ఏళ్లు కొనసాగించాలని తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. అయితే అందులో కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలను మినహాయించింది. అప్పటి నుంచి విశ్వ విద్యాల యాల ఉద్యోగులు, అధ్యాపకులు తమకు కూడా 62 ఏళ్ల రిటైర్మెంట్ వర్తింప చేయా లని ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి. కాగా ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో బోధనేతర సిబ్బంది వయోపరిమితిని 60 ఏళ్లకు కుస్తూ యూనివర్శిటీ రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లు, < ఇతర బోధనేతర సిబ్బంది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే మన్మథరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరుపు న్యాయవాది ఎస్ లక్ష్మీ నారాయణరెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పిటిషనర్ల పదవీ విరమణ వయో పరిమితిని 62 ఏళ్లుగా నిర్ణయిస్తూ వైస్చన్సార్ నిర్ణయం తీసుకున్నారని అయితే రిజిస్ట్రార్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రని కోర్టు దృష్టికి తెచ్చారు. సిబ్బంది పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. వీసీ నిర్ణయాన్ని మార్చే అధికారం రిజిస్ట్రార్కు ఎక్కడుందని ప్రశ్నించారు. పదవీ విరమణ వయసును కుదించాలంటే విశ్వ విద్యాలయ పాలక మండలి నిర్ణయం తీసుకుంటుందని రిజిస్ట్రార్ ఏకపక్షంగా వ్యవ హరించారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి బోధనేతర సిబ్బందికి పెంచిన 62 ఏళ్ల రిటైర్మెంట్ ఎందుకు వర్తింపచేయరని ప్రశ్నించారు. వర్శిటీ రిజి స్ట్రార్ ఉత్తర్వులను తప్పు పట్టారు. వారిని 62 ఏళ్లు సర్వీసులో కొనసాగించా ల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కారుణ్య నియామకం..హక్కు కాదు
ఓ ప్రత్యేక సదుపాయం మాత్రమే: సుప్రీంకోర్టు
కారుణ్య నియామకం.. ఉద్యోగి ఆకస్మిక మృతితో బాధిత కుటుంబం ఆటుపోట్లకు గురికాకుండా ఉండేందుకు ఓ ప్రత్యేక పరిస్థితుల్లో కల్పించిన సదుపాయం మాత్రమేనని, హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకం కోసం ఓ మహిళ చేసిన విజ్ఞప్తిని పరిగణ నలోకి తీసుకోవాలని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును, దాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ తండ్రి 1995లో ఉద్యోగంలో చనిపోయా రని, ఆ సమయానికి కేరళ రాష్ట్ర ఆరోగ్య సేవల విభాగంలో తల్లి ఉద్యోగి అని.. అందుకే అప్పుడు ఆ కుటుంబాన్ని కారుణ్య నియామకానికి పరిగణ నలోకి తీసుకోలేదన్న విషయాన్ని జస్టిస్ ఎం. ఆర్. షా, జస్టిస్ కృష్ణమురారిల ధర్మాసనం ప్రస్తావించింది. ఆ సమయంలో మైనర్ గా ఉన్న కుమార్తె 14 ఏళ్ల తర్వాత కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆకస్మిక సంక్షోభంతో బాధిత కుటుంబం ప్రభా వితం కాకూడదన్నదే కారుణ్య నియామకాల వెనుక ఉద్దేశమని.. అది ఓ సదుపాయం మాత్రమేనని న్యాయమూర్తులు తెలిపారు.
నీట్ పీజీ కన్వీనర్ కోటా ప్రవేశాల జాబితా వెల్లడి
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పేజీ ఎండీ/ఎంఎస్ సీట్లకు సంబంధించి కన్వీనర్ కోటా ప్రవేశాల జాబితాను సోమవారం విజయవాడ లోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరానికి.. మొత్తం 2,513 సీట్లకు గాను జాతీయ కోటా పోను మిగి లిన వాటిలో సర్వీస్ కేటగిరీలో 266 మందికి, నాన్-సర్వీస్ కోటాలో 822 మందికి సీట్ల కేటాయించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలి పారు. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోటాలో సీట్లు పొందిన వారు కళాశాలల్లో చేరే గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించారు.
జాతీయ కోటా వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్ 11నుంచి
ఎంబీబీఎస్, బీడీఎస్ అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి, తెలంగాణలో సీట్లకు 17 నుంచి కౌన్సె లింగ్ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 15 నుంచి తొలి ఏడాది వైద్యవిద్య తరగతులు ప్రారంభం కావాలని సూచించింది.
డి.ఎ బకాయిలను విడుదల చేయాలి: యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు
పెండింగ్లో ఉన్న 2 డిఎలను విడుదల చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమావారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ పిఆర్సి తర్వాత కేంద్రం రెండు డిఎలు ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా ప్రకటించలేదన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని ప్రకటనలు చేస్తూ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే మాత్రం ఆర్థిక ఇబ్బందులని చెబుతున్నారని విమర్శించారు. గతంలో ఉన్న డిఎల బకాయిలు ఉపాధ్యాయుల, ఉద్యోగుల అకౌంట్లలోకి రాకుండానే ఇస్కం ట్యాక్స్ చెల్లించిన పరిస్థితి ఉందన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు 2009 నుంచి రావాల్సిన డిఎ ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయని, సిపిఎస్ -ఉద్యోగులు డిఎ నగదు బకాయిలు కూడా ఇంత వరకూ చెల్లించలేదని తెలిపారు. ఉద్యోగుల బకాయిలను పెండింగ్లో పెట్టి ఆర్ధిక ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. పిఆర్సి చర్చల సందర్భంగా తదుపరి ఆర్ధిక శాఖ అధికారులతో చర్చల సందర్భంగా బకాయిలు 2. నెలల్లో చెల్లిస్తామని చేసిన వాగ్దానం అమలు చేయాలని కోరారు. యుటిఎఫ్ ప్రచురణల విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ. పాఠశాలల ప్రారంభానికి ముందే బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి మూడు నెలలు గడిచినా వాటిపై స్పష్టమైన విధానం ప్రకటించలేదన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఎం. కళాధర్, జిల్లా కార్యదర్శి సిహెచ్. ఆదినారాయణ, ఆడిట్ కమిటీ సభ్యులు ధనరాజారావు పాల్గొన్నారు..
వాహనాల ద్వారా అంగన్వాడీ, జగనన్న గోరుముద్ద సరకులు
అంగన్వాడీ కేంద్రాలు, జగ నన్న గోరుముద్ద పథకాలకు సంబంధించిన బియ్యం, ఇతర సరకులను అక్టోబరు నుంచి మొబైల్ వాహనాల ద్వారా సరఫరా చేయాలని పౌరసరఫరాలశాఖ కమిష నర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. రేషన్ డీలర్ల నుంచి అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాల సరకులు తీసు కుని అంగన్వాడీ వర్కర్లు, పాఠశాల బాధ్యులకు అందిం చాలని పేర్కొన్నారు. ఈ మేరకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
6 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
డీఎస్సీ-1998 అభ్య ర్థుల్లో నిర్దేశించిన వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వారి ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 6వ తేదీనుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 502 మంది అభ్యర్థులు ఉన్నారని, వారి జాబితా కూడా వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఈనెల 6, 7, 10, 11, 12 తేదీల్లో వరుసగా రోజుకు వందమంది చొప్పున ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని చెప్పారు. సంబంధిత అభ్యర్థులు అందరూ నిర్దేశించిన తేదీలతో ఉదయం 10.30గంటలకు మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో హాజరు కావాలన్నారు.
పాఠశాలల నర్వహణపైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఉపాధ్యాయులకు సచివాలయ సిబ్బంది సహకారం
ప్రతి వారం, ప్రతి నెలా సందర్శించేలా జాబ్ చార్ట్
సంక్షేమ, విద్య సహాయకుడికి హాజరు, చేరికలు, సదుపాయాల బాధ్యత.. ఏఎన్‌ఎంకు పిల్లల ఆరోగ్యం, భోజన నాణ్యత పరిశీలన పనులు
మహిళా పోలీస్‌కు చిన్నారుల రక్షణ, ఆడపిల్లల భద్రత అంశాలు
గైర్హాజరుపై ఇప్పటికే తల్లిదండ్రులకు ఫోన్ మెసేజ్‌లు
బుజ్జగించి బడికి రప్పించేలా వలంటీర్ల ద్వారా ఏర్పాట్లు
మండలానికి రెండు ఎంఈవో పోస్టులతో పర్యవేక్షణ పటిష్టం
ఇక సాఫీగా అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు
విద్యా సంస్కరణల్లో భాగంగా రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చించి ప్రభుత్వ విద్యా సంస్థలను నాడు – నేడు ద్వారా కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక సమర్థంగా నిర్వహణపై దృష్టి సారించింది. అభివృద్ధి పనులు చిరకాలం మన్నికతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మౌలిక లక్ష్యమైన విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా చర్యలు చేపడుతోంది.
అస్తవ్యస్తంగా, దిశానిర్దేశం లేకుండా ఉన్న అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను గాడిలో పెడుతోంది. ఇవి రెండూ ప్రత్యేక పర్యవేక్షణతో ముందుకు సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఇవన్నీ పాఠశాల విద్యాశాఖ అధికారులు, టీచర్లతో సాగగా ఇప్పుడు ఇతర శాఖలకూ బాధ్యతలు అప్పగిస్తోంది. మండల స్థాయిలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను వేర్వేరుగా పర్యవేక్షించేందుకు ఇద్దరు చొప్పున ఎంఈవోలను ప్రభుత్వం నియమిస్తోంది. ఇందుకోసం అదనంగా 692 ఎంఈవో పోస్టులను ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన విషయం తెలిసిందే.
టీచర్లకు సాయంగా సచివాలయ సిబ్బంది
ఇప్పటివరకు పాఠశాలలకు సంబంధించి విద్యా వ్యవహారాలు, పాలనా వ్యవహారాలను విద్యాశాఖకు చెందిన టీచర్లు, ఎంఈవోలు, ఇతర అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఒకపక్క విద్యా వ్యవహారాలు, మరోపక్క అడ్మినిస్ట్రేటివ్ అంశాల బాధ్యతల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. మండల విద్యాధికారుల పోస్టులు న్యాయ వివాదాలతో దశాబ్ద కాలంగా భర్తీ కాకపోవడంతో మండల స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది.
ప్రభుత్వం విద్యారంగంపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ లక్ష సాధనలో కీలకమైన క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరవైంది. ఈ అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో అభివృద్ధి పనులతో పాటు పిల్లల ఆరోగ్య సంరక్షణ, హాజరు, చదువులపై దృష్టి పెట్టే బాధ్యతను సచివాలయాల సిబ్బందికి అప్పగించాలని నిర్ణయించింది. తమ పరిధిలోని పాఠశాలల టీచర్లకు విధి నిర్వహణలో వీరు సహకారం అందించనున్నారు.
క్రమ పద్ధతిలో నిరంతరం..
గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్య, సంక్షేమ సహాయకుడు, ఏఎన్‌ఎం, మహిళా పోలీసులకు స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తోంది. ఎవరెవరు ఏ పనులు చేయాలి? ఎప్పుడెప్పుడు ఆయా స్కూళ్లను పర్యవేక్షించాలో జాబ్ చార్టు రూపొందించింది. స్కూళ్ల పర్యవేక్షణ ఒక క్రమపద్ధతిలో నిరంతర ప్రక్రియగా కొనసాగేలా దీన్ని సిద్ధం చేశారు.
కమాండ్ కంట్రోల్‌కు సమాచారం..
సచివాలయాల సిబ్బంది స్కూళ్లను పరిశీలించిన అనంతరం ఆయా అంశాలను ఆన్‌లైన్‌లో నిర్ణీత లాగిన్ ద్వారా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వాటికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేస్తారు. వారిచ్చే సమాచారం ప్రకారం ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారి వాటిని పరిష్కరిస్తారు.
అంశాల తీవ్రతను బట్టి పరిష్కారానికి సమయాన్ని నిర్దేశిస్తారు. దీనిపై పైస్థాయి అధికారులు పునఃపరిశీలన చేస్తారు. ఇదంతా ఎడ్యుకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్తుంది. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ (14417), స్పందన ద్వారా అందే ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు.
హాజరుపై సంక్షిప్త సందేశాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరును నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్కూలుకు రాని విద్యార్థుల గురించి తల్లిదండ్రులు, ఆయా తరగతుల టీచర్ల ఫోన్లకు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సంక్షిప్త సందేశాన్ని పాఠశాల విద్యాశాఖ అందిస్తోంది.
వరుసగా మూడు రోజుల పాటు స్కూలుకు రాని విద్యార్థి సమాచారాన్ని వలంటీర్ల ఫోన్‌కూ సంక్షిప్త సందేశాల ద్వారా చేరవేస్తున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా ఈ చర్యలు దోహదం చేస్తున్నాయి.
ఈ సీజన్‌లో రైతుల నుంచి స్థానిక (సన్న) రకాల ధాన్యం కూడా సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేస్తుండగా.. ఈ నెల నుంచి ఐసీడీఎస్ (అంగన్‌వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా రవాణా చేయనుంది.
తద్వారా ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూర్చనుంది. ఇప్పటివరకు అంగన్‌వాడీలు రేషన్ దుకాణం నుంచి, స్కూళ్లు, హాస్టళ్ల యాజమాన్యాలు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి వ్యయప్రయాసలతో బియ్యం తెచ్చుకునేవారు. ఒకరోజు ప్రత్యేకంగా బియ్యం కోసం కేటాయించాల్సి వచ్చేది. పైగా రవాణా, ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఇబ్బందులు పడేవారు. వీటన్నింటికి పరిష్కారంగా ప్రభుత్వమే రేషన్‌ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది.
ఫైన్ క్వాలిటీ ధాన్యం సేకరణ
రాష్ట్రంలో అంగన్‌వాడీలు, స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల భోజనానికి ఏడాదికి 2.54 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఇప్పటివరకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు సార్టెక్స్ బియ్యాన్ని (సాధారణ రకాలు) ఫోర్టిఫై చేసి ఆహారంగా అందిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఫైన్ క్వాలిటీ (స్థానిక రకాలు, సన్న రకాలు) బియ్యాన్ని కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే 2022-23 ధాన్యం సేకరణలో మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అవసరమైన ఫైన్ క్వాలిటీ ధాన్యాన్ని ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల మేర రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. తద్వారా విద్యార్థులకు, రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు అప్పుడే పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ద్వారా వచ్చే బియ్యంతో వండే అన్నం ముద్దగా ఉంటుందనే ఫిర్యాదులను పరిష్కరించేలా.. సేకరణకు, మిల్లింగ్‌కు మధ్య రెండు నుంచి మూడునెలల వ్యవధి ఉండేలా చర్యలు చేపడుతోంది.
ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ రైస్
ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాలతో పాటు ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు మాత్రమే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకున్న వారిలో రక్తహీనత శాతం తగ్గినట్టు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి.
ఇందులో భాగంగానే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మొత్తం ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేలా అంగన్‌వాడీలు, స్కూల్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఫోర్టిఫైడ్ రైస్ అంటే..
మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-బి12 వంటి కీలక సూక్ష్మపోషకాలను బియ్యంలో అదనంగా చేరుస్తారు.
విటమిన్ టాబ్లెట్ కంటే పవర్‌ఫుల్
ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ రైస్ విటమిన్ టాబ్లెట్ కంటే ఎంతో పవర్‌ఫుల్. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో 9,260 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అంగన్‌వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు విస్తరిస్తున్నాం.
అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
స్కూళ్లలో ఇక క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్
పక్కాగా తరగతి పురోగతి
పాఠశాలల పరీక్షా విధానంలో కీలక మార్పులు
1-8 తరగతులకు ఓఎమ్మార్ షీట్లతో పరీక్షలు
ఫార్మేటివ్, సమ్మేటివ్ స్థానంలో సీబీఏ టెస్ట్
మైనర్ మీడియం స్కూళ్లలో పాత పద్ధతిలోనే
9, 10 తరగతులకూ పాత విధానమే
నవంబర్ 2 నుంచి పరీక్షలు.. ఏటా 3 సార్లు
మార్గదర్శకాలతో సర్క్యులర్ జారీ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించడం, సరైన బోధనతో సంపూర్ణ సామర్ధ్యాలు సంతరించుకోవడమే లక్ష్యంగా పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త విధానం అమలు లోకి రానుంది. పాఠశాలల్లో ప్రమాణాలుమెరుగుపర్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో అమలు చేస్తున్న ‘సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్’ (సాల్ట్) కార్యక్ర మంలో భాగంగా తరగతి గది ఆధారిత మూల్యాం కన విధానాన్ని తెస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు సీబీఏ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఏపీ ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్ర తాపరెడ్డి తెలిపారు. ఈమేరకు సీబీఏ మార్గదర్శకాలు, షెడ్యూల్లో సోమవారం సర్క్యులర్ జారీ అయింది. ఈ పరీక్షలు పూర్తిగా ఓఎమ్మార్ (ఆప్టికల్ మార్కు రికగ్నిషన్) విధానంలో ఏడాదికి మూడు సార్లు జరుగుతాయి. తొలివిడత పరీక్షలు నవంబర్2 నుంచి ప్రారంభమవుతాయి.
ఈఐతో ఎస్సీఈఆర్టీ ఎంవోయూ
నూతన విధానంలో పరీక్షా పత్రం రూపకల్పన, మూల్యాంకనం కోసం ‘ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్’ (ఈఐ)తో ఎస్సీఈఆర్టీ ఎంవోయూ కుదుర్చుకుం ది. దీని ప్రకారం 1 8 తరగతుల విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు), సెకండ్ లాంగ్వేజ్ (హిందీ), థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీషు). ఈవీఎస్. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో సీబీఏ పరీ క్షలు నిర్వహిస్తారు. ఫిజికల్, బయోలాజికల్ సైన్స్క కలిపి ఒకే పేపర్ ఉంటుంది. ప్రశ్నపత్రాలు బైలింగ్యువల్ (ద్విభాషా) పద్ధతిలో
రూపొందిస్తారు. పక్కా మూల్యాంకనం ద్వారా విద్యార్థుల సామర్ధ్యాలను కచ్చితంగా గుర్తించి లోటుపాట్లను సరిదిద్దడంపై ఈ ఐ సంస్థ నివేదిక అందిస్తుంది. బోధనా విధానాలపై ఎస్సీఈఆర్టీకి సిఫార్సు చేస్తుంది. వాటి ఆధారంగా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకుంటారు.
ఫార్మేటివ్, సమ్మేటివ్ స్థానంలో
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫార్మేటివ్, సమ్మేటివ్ పరి క్షల స్థానంలో సీబీఏ పరీక్షలను నిర్వహిస్తారు. 1-8 తరగతులకు సంబంధించిన 1, 3 ఫార్మేటివ్, సమ్మే టివ్ 2 బదులు సీబీఏ పరీక్షలు ఉంటాయి. ఫార్మేటివ్ 2, 4, సమ్మేటివ్ 1 పరీక్షలను యదాత భంగా పాత విధానంలోనే నిర్వహిస్తారు. విద్యా ర్థుల సామర్ధ్యాలను సంపూర్ణంగా అంచనా వేసేలా ఈఐ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలను అనుస రించి ప్రశ్న పత్రాన్ని రూపొందిస్తుంది. ఓఎమ్మార్ విధానంలో తొలిసారి నిర్వహిస్తున్నందున టీచర్లకు చెబినార్ల ద్వారా సూచనలు అందించనున్నారు.
9, 10 పాత విధానంలోనే
గతంలో మాదిరిగానే 9, 10 తరగతుల విద్యా ర్థులకు అంతర్గత పరీక్షలను నాలుగు ఫార్మేటిష్ రెండు సమ్మేటివ్లతో పాత విధానంలో నిర్వహి స్తారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో పేపర్ల సంఖ్యను ప్రభుత్వం కుదించడంతోపాటు అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా ప్రతి పేపర్ను 100 మార్కులకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, ఒడియా తదితర మైనర్ మీడియం స్కూళ్లలో మాత్రం 1-8 తరగ
తుల విద్యార్థులకు సీబీఏ తరహాలో కాకుండా పాత విధానంలోనే ఫార్మేటివ్ సమ్మేటివ్ పరీక్షలు ఉంటాయి.
ప్రైవేట్ స్కూళ్లకు ఓఎమ్మార్ పంపిణీ ఉండదు.
సీబీఏ పరీక్షల ఓఎమ్మార్ పత్రాలను ప్రభుత్వ స్కూ ళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు డీసీఈబీ (డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు) నుంచి ప్రశ్నప త్రాలను అందుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈఐ సంస్థ విడుదల చేసే ” ఆధా రంగా ప్రైవేట్ స్కూళ్లలో మూల్యాంకనం చేసి మార్కులను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.