Instructions for storage of cooking equipment and toilet maintenance equipment for AP mid-day meal scheme,మధ్యాహ్న భోజన పథకంనకు సంబంధించిన వంట సామగ్రి మరియు టాయిలెట్ నిర్వహణ సామగ్రి భద్రపరుచుటకు తగు సూచనలు జారీ చేయుట
ఆర్.సి.నెం2029/బి1/2022. తేది.04.10.2022.
Instructions for storage of cooking equipment and toilet maintenance equipment for AP mid-day meal scheme,మధ్యాహ్న భోజన పథకంనకు సంబంధించిన వంట సామగ్రి మరియు టాయిలెట్ నిర్వహణ సామగ్రి భద్రపరుచుటకు తగు సూచనలు జారీ చేయుట
విషయము:- పాఠశాల విద్య – మధ్యాహ్న భోజన పథకంనకు సంబంధించిన వంట సామగ్రి మరియు
టాయిలెట్ నిర్వహణ సామగ్రి భద్రపరుచుటకు తగు సూచనలు జారీ చేయుట గురించి.
సూచిక:-స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, పాఠశాల విద్య, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి సూచనలు, తేది. 24.09.2022.
పై సూచిక నందు ది. 24.06.2022 న స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, పాఠశాల విద్య, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారు
పశ్చిమ గోదావరి జిల్లాలోని నాడు-నేడు పాఠశాలలను సందర్శనలో భాగంగా మధ్యాహ్న భోజన పథకంనకు
సంబంధించిన వంట సామగ్రి మరియు సరుకులతో పాటుగా టాయిలెట్ నిర్వహణ సామగ్రిని కూడా తనిఖీ
చేసియున్నారు. సదరు తనిఖీ నందు మధ్యాహ్న భోజన పథకములోని సామగ్రిని టాయిలెట్ నిర్వహణ సామర్రి
(యాసిడ్, బ్రేష, ఫీనాయిల్, టాయిలెట్ ఫ్రెష్నర్ మరియు ఇతర టాయిలెట్ వస్తువులు) తో కలిపి నిల్వ ఉంచుట
గమనించి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారిని మరియు మండల విద్యాశాఖాధికారులను సదరు
విషయముపై ప్రశ్నించడం జరిగినది.
కావున, సదరు విషయముపై సంబంధిత ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు
మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులుకు ఈ క్రింది తెలియజేసిన సూచనలు జారీ చేయడమైనది.
మధ్యాహ్న భోజన పథకంనకు సంబంధించిన వంట సామగ్రి మరియు టాయిలెట్ నిర్వహణ సామగ్రి భద్రపరుచుటకు తగు సూచనలు
1. మధ్యాహ్న భోజన పథకములోని సామగ్రిని టాయిలెట్ నిర్వహణ సామర్రి (యాసిడ్, బ్రేష్, ఫీనాయిల్,
టాయిలెట్ ఫ్రెష్నర్ మరియు ఇతర టాయిలెట్ వస్తువులు) తో కలిపి నిల్వ ఉంచరాదు.
2. తరగతి గదుల యందు ఏ విధమైన మధ్యాహ్న భోజన పథకములోని సామగ్రి మరియు టాయిలెట్ నిర్వహణ
సామగ్రిని ఉంచరాదు.
3. మధ్యాహ్న భోజన పథకములోని సామర్రిని వాటిని నిర్ధేశించిన ప్రదేశము (ఎటువంటి క్రిమీ కీటకాలు లేని
పరిశుభ్రత కలిగిన ప్రదేశము) లో ఉంచి ప్రతి రోజు సదరు ప్రదేశమును ప్రధానోపాధ్యాయులు వారి తనిఖీ
చేయవలెను.
4. టాయిలెట్ నిర్వహణ సామర్రిని వాటిని నిర్దేశించిన ప్రదేశము (పిల్లలకు అందుబాటులో లేని ప్రదేశము) లో
ఉంచవలెను.
5. పాఠశాల తరగతి గదులు మరియు ఆవరణలో పరిశుభ్రత పాటించే విధంగా తగు చర్యలు తీసుకొనవలెను.
6. పాఠశాలలోని పిల్లలకు బాత్ రూమ్ లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేవిధంగా తగు చర్యలు
తీసుకొనవలెను.
7. పాఠశాలలకు ఏజెన్సీ వారి నుండి సరఫరా చేయబడిన గుడ్లును సైజు మరియు పరిమాణం (30 గుడ్లకు 1500
గ్రాములు) నిబంధనల ప్రకారం తీసుకొనవలెను.
8. ఏజెన్సీ వారి నుండి ప్రతినెల మూడు విడతలుగా గుడ్లు సరఫరా చేయబడతాయి. మొదటి విడతలో (బ్లూ
కలర్), రెండో విడతలో (పింక్ కలర్) మరియు మూడో విడతలో (గ్రీన్ కలర్) లో రంగులను ముద్రించి
ఉన్నవాటిని మాత్రమే తనిఖీ చేసి తీసుకొనవలెను.
9. ప్రతినెల 15 రోజులకు ఒక్కసారి సరఫరా చేసే చిక్కి ల యందు తయారు చేసే తేది, కాల పరిమితి తేది
మరియు బ్యాచ్ నెంబర్ కలిగిన పేకెట్లను మాత్రమే తీసుకొనవలెను.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా పై అంశాలను పాటించవలసినదిగా ఆదేశించడమైనది
మరియు ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు మరియు ఉప తనిఖీ అధికారులు పాఠశాలలను
తనిఖీ చేసిన సందర్భాలలో పై అంశాలన్నీ కూడా పరిశీలించి ఏ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయిన సదరు
విషయముపై నిర్లక్ష్యం వహించనట్లెతే వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకొను నిమిత్తం ప్రతిపాదనలను ఈ
కార్యాలయమునకు సమర్పించవలసినదిగా ఆదేశించడమైనది.
జిల్లా విద్యాశాఖాధికారి,
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం.