CBA ప్రశ్నాపత్రాల నమూనా
🅰🅿️
*CBA ప్రశ్నాపత్రాల నమూనా*
*1 నుండి 8 తరగతులకు CBA (Class room Based Assessment – తరగతి గది ఆధారిత మూల్యాంకనం) నందు ప్రశ్నలు రెండు రకాలుగా ఉండును.*
*1) MCQs (Multiple Choice Questions – బహుళైచ్చిక ప్రశ్నలు)*
*2) FRs (Free Response questions – అంతం లేని స్వయం ప్రతిస్పందన ప్రశ్నలు)*
*1 నుండి 2 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.
*3 నుండి 8 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.
*MCQ (Multiple Choice Questions) లు :*
ప్రతి ప్రశ్నకు తార్కిక ఐచ్చికాలు ఇవ్వబడతాయి.
వాటి నుండి విద్యార్థులు ఒక ఖచ్చిత జవాబును ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.
*MCQ ల వలన లాభాలు:*
1) విద్యార్థులకు సంబంధించిన యదార్ధ జ్ఞానం, వినియోగం, అనుమితిల యొక్క వివిధ రకాల నైపుణ్యాలను పరీక్షించేందుకు సహాయపడతాయి.
2) విద్యార్థుల యొక్క సాధారణ దోషాలను ఖచ్చితత్వంతో కనుగొనేందుకు సహాయపడతాయి.
*FR (Free Response questions) లు :*
విద్యార్థులు తమకు ఇవ్వబడిన అంతం లేని ప్రశ్నలకు స్వయం ప్రతిస్పందనలు ఇస్తారు.
వీనిలో *ఖాళీలను పూరించుము* , *అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు* , *స్వల్ప సమాధాన ప్రశ్నలు* , *దీర్ఘ సమాధాన ప్రశ్నలు* ఇవ్వబడతాయి.
*MUA Balance questions (Mechanical – Understanding – Application balance యాంత్రిక – అవగాహన – వినియోగ సంతులిత ప్రశ్నలు)*
*Mechanical యాంత్రిక ప్రశ్నలు :* సాధారణంగా పాఠ్యపుస్తకాల నుండి తీసుకొనబడిన / సేకరించబడిన ప్రశ్నలు.
*Understanding అవగాహనను పరీక్షించు ప్రశ్నలు :* సంభావిత జ్ఞానం మరియు జోడించిన / అదనపు స్థాయిని పరీక్షించు ప్రశ్నలు.
*Application వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు :* సముపార్జించిన సంభావిత జ్ఞానాన్ని నిజ జీవిత సందర్భాలలో వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు.
*1 నుండి 2 తరగతులకు MUA ల సంతుల్యత అన్ని సబ్జెక్టులకు 50% – 25% – 25% ఉండును.*
*3 నుండి 8 తరగతులకు MUA ల సంతుల్యత క్రింది విధంగా ఉండును.*
తెలుగు,హిందీలకు 40% – 40% – 20%
ఇంగ్లీష్ కు 30% – 40% – 30%
సైన్స్,సోషల్, గణితం లకు 30% – 40% – 30%
*Difficulty level of question paper – ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి*
ప్రతి ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి 48% నుండి 50% వరకు ఉండగలదు.
#CCE
You might also check these ralated posts.....