TODAY EDUCATION/TEACHERS NEWS ON 05/10/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఉద్యోగులకు ఈ-స్కూటర్లు

  • వాయిదా పద్ధతిలో ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బందికి సర్కారు అవకాశం
  • 60 వాయిదాల్లో ధరను చెల్లించేలా ప్లాన్
  • ఒక్కో వాహనంపై కిలోవాటు రూ.10 వేల వరకూ రాయితీ
  • రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల చార్జింగ్ స్టేషన్లు

వాతావరణంలో కాలుష్యం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఆడీసీఏపీ) అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం పంపింది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి రాయితీలు. కూడా వస్తాయని అందులో పేర్కొంది. ఒక్కో కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి దీనివల్ల ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. వారు కోరితే ఈ-వాహనాల కొనుగో అవకాశ కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా సూచించింది.


  • అందరికీ అవకాశం..

వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి 24-60 నెలల్లో వాయిదాలను వసూలు చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. కనీసం నెలకు రూ. 2,500 చెల్లించేలా వెసులుబాటు కల్పించను. న్నారు. అదే విధంగా ఈ పథకం కింద ప్రభుత్వో ద్యోగులకు రుణాలు అందించేందుకు ధనలక్ష్మి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో నెడ్ కాప్ ఒప్పం కుదుర్చుకుంది. వడ్డీరేటు 9 శాతం. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, వారు ఆ సంస్థ సీఈఓగానీ లేదా మేనేజర్ కిగాని అధీకృత లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆసక్తిగల ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.

  • అందుబాటులోకి చార్జింగ్ స్టేషన్లు

ఈవీల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్ క్యాప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 109 ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి చోట్ల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల ప్రాంతాలను గుర్తించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ అయ్యే స్టేషన్లని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 300 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని నెడ్ కాప్ సంక ల్పించింది. నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కి.మీ.కు ఒకటి ఏర్పాటుచేయనుంది.

డీఏ బకాయిలు విడుదల చేయాలి: ఏపీటీఎఫ్

రాష్ట్ర ప్రభుత్వం జనవరి, జులై డీఏ లను ప్రకటించాలని, ఆరు విడతల డీఏ బకాయిలను చెల్లించా లని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు హృదయరాజు, చిరంజీవి డిమాండ్ చేశారు.

పాఠశాలలకు సేవలు అందించండి

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో విద్యాంజలి పథకం-2.0కింద పాఠశాలల్లో సేవలు అందించడానికి స్వచ్ఛందంగా వాలంటీర్లు ముందుకు రావాలని ఎస్ఎస్ ఏఎంవో సుధాకర్ తెలిపారు. స్వచ్ఛందంగా సేవలుఅందించడానికి ముందుకు వచ్చే వారు ఆన్లైన్లో తమపేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తదితర కార్యక్రమాల్లోవారు సేవలు అందించవచ్చునని పేర్కొన్నారు.

బడి బయట పిల్లల్ని గుర్తించాలి

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో బడి బయట పిల్లల్ని గుర్తించాలని గ్రామ, వార్డు సచివాలయాల డైరె క్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమగ్ర శిక్ష, సచివాల ఆదేశాలు అందాయి. దసరా పండగ సందర్భంగా పిల్లలు ఇళ్లకు వచ్చే అవకాశం ఉందని, సచివాలయాల్లో ఎడ్యు కేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, వాలంటీర్ల సహకారంతో ఇళ్లకు వచ్చిన వారిని గుర్తించి పాఠశాలల్లో చేర్చాలని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో 5052 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 11,130 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దసరా సెలవుల్లో కొన్ని మండలాల్లో వాలంటీర్ల తో బయట పిల్లల్ని గుర్తించడంపై దృష్టి సారించినట్లు సమగ్ర శిక్ష ఎఎల్ ఎస్వో సుధాకర్ తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేయడం చట్టబద్ధమైన హక్కే

ఎన్నికల్లో నామినేషన్‌ తిరస్కరణపై హైకోర్టులో వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం చట్టబద్ధ హక్కు మాత్రమేనని, ప్రాథమిక హక్కు కిందికి రాదని పేర్కొంది.
ఎన్నికల్లో నామినేషన్‌ తిరస్కరణపై హైకోర్టులో వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం చట్టబద్ధ హక్కు మాత్రమేనని, ప్రాథమిక హక్కు కిందికి రాదని పేర్కొంది. ప్రస్తుత వ్యవహారంలో ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్ట నిబంధనలను అనుసరించి జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ వ్యాజ్యాన్ని గరిష్ఠంగా 6నెలల్లో పరిష్కరించాలని జిల్లా కోర్టును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చారు. ఏపీ సచివాలయ సెక్షన్‌ అధికారుల సంఘం ఎన్నికల విషయంలో తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలుచేస్తూ రెవెన్యూ శాఖలో సెక్షన్‌ అధికారిగా పనిచేస్తున్న వాసుదేవరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. నామినేషన్‌ తిరస్కరించడం ద్వారా పిటిషనర్‌ ప్రాథమిక హక్కును హరించారని, వ్యాజ్యానికి విచారణ అర్హత ఉందని ఆయన తరఫు న్యాయవాది సింగయ్యగౌడ్‌ పేర్కొన్నారు. నామినేషన్‌ తిరస్కరణపై అభ్యంతరం ఉంటే జిల్లా కోర్టులో ఎన్నికల పిటిషన్‌ వేసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదించారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పై విధంగా తీర్పునిచ్చారు.

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల కోసం ఆండ్రాయిడ్‌ యాప్‌ సిద్ధం

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల గురించి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో, కచ్చితమైన సమాచారం తెలియజేసేందుకు ఆ సంస్థ ఒక ఆండ్రాయిడ్‌ యాప్‌ను అభివృద్ధి చేసింది. ‘యూపీఎస్సీ అఫిషియల్‌’ పేరుతో గూగుల్‌ ప్లే  స్టోర్‌లో దీన్ని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా సమాచారాన్ని వేగంగా అందించేందుకు దీన్ని సిద్ధం చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది. అయితే ఇందులో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం లేదు. సమాచారం తెలిపేందుకు మాత్రమే దీన్ని తయారుచేశారు. అభ్యర్థులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా నేరుగా ప్రతి చిన్న అప్‌డేట్‌నీ సులువుగా తెలుసుకోవచ్చు.

ఉద్యోగ కల్పనే ధ్యేయంగా నూతన కరికులం

  • ఉన్నత విద్యలో ఉన్నత ప్రమాణాలు
  • పది నెలల పాటు తప్పనిసరి ఇంటర్న్షిప్
  • • నాణ్యత పెంచేందుకు పొడొకాస్ట్స్


ఉన్నతవిద్యలో ఉన్నత ప్రమా
ణాలు నిలిపే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభిం
చింది. ఉన్నత విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.
ముందుగా
కరికులమ్లో భారీ మార్పులు చేసింది. పాఠ్యాంశాల్లో
స్కిల్ డెవలప్మెంట్కు ఆస్కారం ఉండేలా, స్కిల్ ఎన్యాన్స్
మెంట్ జరిగేలా, లైఫ్ స్కిల్క్ కోర్సులు ఉండేలా మార్పులు
చేసింది. ప్రొఫెషన్ కోర్సులతోపాటు సంప్రదాయక కోర్సులైన బికాం, బిఎ,
బిఎస్సీలలో కూడా పది నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్ను అమలు చేస్తోంది.
అంతేకాక రెండు నెలల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు ఆన్ జాబ్ ట్రైనింగ్
అందిస్తుంది. 25 రకాల మార్కెట్ ఓరియేంటెడ్
డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టింది. 67
రకాల బ్యాచ్లర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్న ప్రవేశపెట్టింది. వీటితోపాటు
2021-22 విద్యా సంవత్సరం నుండి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పిజి ప్రోగ్రాము
అందిస్తోంది. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులోనూ ఇదే మార్పులను ప్రవేశపెట్టింది.
వీటికితోడు బిటెక్ విత్ హానర్, బిటెక్ విత్ మైనర్ కోర్సులను ప్రవేశపెట్టింది.

  • ఆన్లైన్ విద్యకు అధిక ప్రాధాన్యత

ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేందుకు
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి లెర్నింగ్
మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)ను అమలు
చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులకు నాణ్యత
గల ఇ-కంటెంట్ను అందిస్తున్నారు. అంతేకాక
పొడ్కాస్ట్లను కూడా ఇస్తున్నారు. 411
పొగ్రామ్లపై పొడుకాస్ట్లను మొదటి సెమిస్టర్
కోసం రూపొందించారు. సెకండ్ సెమిస్టర్ సబ్జె
క్లకు కూడా పొడ్కాస్ట్లను రూపొందిస్తున్నారు.
140 ద్విభాషా పాడ్కాస్ట్లను కూడా ఎల్ఎంఎస్
కార్యక్రమం కూడా రూపొందించారు.
విద్యార్థులు క్లాసులో పాఠాల కోసం పొడా కాస్ట్లను వినడం ద్వారా మరింత
బాగా పాఠాలను అర్ధం చేసుకుంటారు. ఉన్నత విద్యా మండలి నాస్కామ్ ప్యూచర్
స్కిల్స్ ఎంవోయు కుదుర్చుకోవడం ద్వారా మైక్రోసాఫ్ట్ సిస్కో, సేల్స్ఫర్స్
వంటి సంస్థలతో కలిసి లక్ష విర్చూవల్ ఇంటర్న్షిప్ లు చేయనున్నారు.
ఎంప్లాయిమెంట్ ఎక్స్ప్రెస్తో ఎంవోయు కుదుర్చుకోవడం ద్వారా 50 వేల
విర్చూవల్ ఇంటర్న్షిప్లను ఐసిసిఐ, విప్రో, ఐబిఎం, హీరో, హోండా లాంటి
కంపెనీలతో కలిసి చేయనున్నారు.

జియో ల్యాప్టాప్ వచ్చేసింది :ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే

 రిలయన్స్ జియో నుంచి బడ్జెట్ ల్యాప్టాప్ మార్కెట్లోకి వచ్చిం
ది. ఈ ల్యాప్టాప్లు ప్రారంభంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే విక్ర
యించనున్నారు. అది కూడా ముంబై నగరంలో ఉన్నవారికి మాత్రమే అందుబా
టులో ఉండనుంది. జియో ల్యాప్టాప్ను ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ జీ ఈఎం పో
ర్టల్లో అమ్మకానికి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సాధారణ వినియోగదారు
లకు దీపావళీ నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు జియో తెలిపింది. జీఈఎం
పోర్టల్ ఉన్న వివరాల ప్రకారం ఈ ల్యాప్టాపు జియో నోట్బుక్ గా వ్యవహరిస్తు
న్నారు. దీని ధర 19,500 గా నిర్ణయించారు. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డన్
665 ఆక్టాకోర్ ప్రాసెసరు వాడారు. జియో ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇది పని
చేస్తుంది. 2జీబీ
ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్ ఇచ్చారు. ర్యామ్న పెంచుకునే అవ
కాశం లేదు. 32 జీబీ స్టోరేజీతో లభిస్తుంది. ల్యాప్టాప్ డిస్ప్లే 11.6 అంగుళాల
హెచ్ ఎల్డీ బ్యాక్ట్ యాంటీగ్లేర్ డిస్ప్లేతో ఉంది. టచ్ స్క్రీన్ సదుపాయం
ఇవ్వలేదు. యూఎస్బీ 2.0, 3.0 హెచ్ఎం పోర్టులు ఇచ్చారు. వైఫైకు సపోర్టు
చేస్తుంది. ఇందులో డ్యూయల్ ఇంటర్నల్ స్పీకర్స్, డ్యూయల్ మైక్రోఫోన్స్, స్టాం
డర్ట్ కీబోర్డు, మల్టీ గెశ్చర్ సపోర్టు కలిగిన టప్ప్యాడ్ ఉంది. బ్యాటరీ 6 నుంచి 8
గంటల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ల్యాప్టాప్లను
ముంబైలో మాత్రమే డెలివరీ ఇస్తున్నారు. పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉం
చారు. ఈ ల్యాప్టాప్ ముదురు నీలం రంగులో మాత్రమే లభిస్తుంది. తరువాత
కాలంలో ఇందులో కలర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

సైన్స్‌లో అద్భుతమైన ప్రయోగాలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2022 సంవత్సరానికి గానూ భౌతిక శాస్త్రంలో అత్యున్నత పురస్కారమైన నోబెల్‌ బహుమతి లభించింది. క్వాంటమ్‌ మెకానిక్స్‌లో వారు చేసిన విశేష కృషికి గానూ అలియాన్‌ యాస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌.క్లాజర్‌, ఆంటన్‌ జెలింగర్‌లను ఈ పురస్కారం వరించిందని రాయల్‌ స్వీడిష్‌ సైన్స్‌ అకాడమీ మంగళవారం ప్రకటించింది. ఫోటాన్ల చిక్కుముడులతో ప్రయోగాలు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతల ఉల్లంఘనను ధ్రువీకరించడం, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించినందుకు వీరిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రయోగాత్మక సాధనాలను ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరచడంతో క్వాంటమ్‌ సాంకేతికతో కొత్త శకం ఆరంభానికి పునాది పడిందని రాయల్‌ అకాడమీ ప్రకటించింది. గతేడాది కూడా ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలు నోబెల్‌ అవార్డును పంచుకున్నారు. బుధవారం రసాయన రంగంలో, గురువారం సాహిత్య రంగాల్లో అవార్డు విజేతలను ప్రకటించనుండగా, శుక్రవారం నోబెల్‌ శాంతి బహుమతి విజేత ఎవరో తెలుస్తుంది. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు డిసెంబరు 10న బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. విజేతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనార్లు అందజేస్తారు.

డీసీసీబీ ఉద్యోగులకు దసరా కానుకగా నెల వేతనం

నాబార్డు అభ్యంతరాన్ని తోసిపుచ్చిన పాలకవర్గం
గుంటూరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్రబ్యాంక్
ఉద్యోగులకు పాలకవర్గం నెలరోజుల వేతనాన్ని ఎక్స్ప్రెషియోగా
ప్రకటించింది. దసరాకానుకగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలకు మంగళవారం
నగదు జమచేసింది. నాబార్డు ఏజీఎం కార్తీక్ గత పాలకవర్గ
సమావేశంలో దీనిపై అభ్యంతరం తెలిపారు. దానిని తోసిపుచ్చి నెల
వేతనాన్ని విడుదల చేస్తూ ఆదేశాలిచ్చారు. ఎక్స్రేషియో విడుదల
చేయటంతో ఉద్యోగ సంఘాల నేతలు సీఈవో కృష్ణవేణి, చైర్మన్ లాలప్పురం
రామును సత్కరించారు.

ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలి

గుంటూరు(విద్య):జిల్లాలో మైనార్టీ
ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు విద్యార్థులు
చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖాధికారి షేక్ మహ్మద్ ని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సయ్యద్, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ప్రీ మెట్రిక్,
బేగమ్ హజరత్ మహల్ స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు తెలిపారు.
అర్హత ఉన్న వారు ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇతర వివరాల కోసం 93909497323లో సంప్రదించాలని పేర్కొన్నారు.

రష్యన్ హ్యాకర్ సాయంతో పరీక్షలు!:820 మంది జెఇఇ మెయిన్స్ విద్యార్థులు
అవకతవకలకు పాల్పడినట్లు సిబిఐ దర్యాప్తులో వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటిల్లో
ప్రవేశానికై నిర్వహించే జెఇఇ మెయిన్స్ పరీక్షలు పాసయ్యేందుకు
కొంతమంది విద్యార్ధులు రష్యన్ హ్యాకర్ సాయం తీసుకున్నారని సిబిఐ
దర్యాప్తులో వెల్లడైంది. గతేడాది పరీక్షల్లో మొత్తంగా 820మంది
విద్యార్ధులకు రష్యన్ హ్యాకర్ మిఖాయిల్ షర్గిన్ సహకరించినట్లు సిబిఐ
మంగళవారం ఢిల్లీ కోర్టులో వెల్లడించింది. కోర్టు వెంటనే మిఖాయిల్ను
రెండు రోజుల కస్టడీకి పంపింది. గత సెప్టెంబరులో 9లక్షల మందికి
పైగా విద్యార్ధులు జెఇఇ మెయిన్స్ రాశారు. నిర్దేశిత కేంద్రాల్లో కంట్రోల్
నియంత్రిత కంప్యూటర్లపై మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. కానీ
మిఖాయిల్ షర్గిన్ ఈ కంప్యూటర్ వ్యవస్థను హ్యాక్ చేశాడు. తమ
అసోసియేట్లతో మాట్లాడుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించేలా
చర్యలు తీసుకున్నాడు. ఆ అసోసియేట్లు వారి దగ్గర వున్న కంప్యూటర్ల పె
విద్యార్థుల ప్రశ్నా పత్రాలకు జవాబులు రాశారని సిబిఐ దర్యాప్తులో
వెల్లడైంది. ఒక్క మాటలో చెప్పాలంటే పరీక్షా కేంద్రాల వెలుపల గల
టీచర్లు లేదా కోచ్లు విద్యార్థుల కంప్యూటర్లను తమ అధీనంలోకి
తీసుకుని, ప్రశ్నలకు జవాబులు రాశారు. ఇప్పటివరకు ఇందుకు
సంబంధించి 24
మందిని అరెస్టు చేశారు. కజకిస్తాన్ నుంచి ఇక్కడు
రాగానే
మిఖాయిల్ను సోమవారం అరెస్టు చేశారు. దర్యాప్తు
అధికారులకు సహకరించడం లేదని సిబిఐ కోర్టుకు తెలియచేసింది.
మిఖాయిల్ ప్రొఫెషనల్ హ్యాకర్ అని ఐలియాన్ సాఫ్ట్వేర్ను ఛేదించాడని
తెలిపింది.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!