CBA ప్రశ్నాపత్రాల నమూనా

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
🅰🅿️
*CBA  ప్రశ్నాపత్రాల  నమూనా*
*1 నుండి 8 తరగతులకు  CBA (Class room Based Assessment – తరగతి గది  ఆధారిత మూల్యాంకనం) నందు ప్రశ్నలు రెండు రకాలుగా ఉండును.*
*1) MCQs (Multiple Choice Questions – బహుళైచ్చిక ప్రశ్నలు)*
*2) FRs (Free Response questions – అంతం లేని స్వయం ప్రతిస్పందన ప్రశ్నలు)*
*1 నుండి 2 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.
*3 నుండి 8 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.
*MCQ (Multiple Choice Questions) లు :*
ప్రతి ప్రశ్నకు తార్కిక ఐచ్చికాలు ఇవ్వబడతాయి.
వాటి నుండి విద్యార్థులు ఒక ఖచ్చిత జవాబును  ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.
*MCQ ల వలన లాభాలు:*
1) విద్యార్థులకు సంబంధించిన యదార్ధ జ్ఞానం, వినియోగం, అనుమితిల యొక్క వివిధ రకాల నైపుణ్యాలను పరీక్షించేందుకు సహాయపడతాయి.
2) విద్యార్థుల యొక్క సాధారణ దోషాలను ఖచ్చితత్వంతో కనుగొనేందుకు సహాయపడతాయి.
*FR (Free Response questions) లు :*
 విద్యార్థులు తమకు ఇవ్వబడిన అంతం లేని ప్రశ్నలకు స్వయం ప్రతిస్పందనలు ఇస్తారు.
వీనిలో  *ఖాళీలను పూరించుము* , *అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు* , *స్వల్ప సమాధాన ప్రశ్నలు* , *దీర్ఘ సమాధాన ప్రశ్నలు* ఇవ్వబడతాయి.
*MUA Balance questions (Mechanical – Understanding – Application balance యాంత్రిక – అవగాహన – వినియోగ సంతులిత ప్రశ్నలు)*
*Mechanical యాంత్రిక ప్రశ్నలు :* సాధారణంగా పాఠ్యపుస్తకాల నుండి తీసుకొనబడిన / సేకరించబడిన ప్రశ్నలు.
*Understanding అవగాహనను పరీక్షించు ప్రశ్నలు :* సంభావిత జ్ఞానం  మరియు జోడించిన / అదనపు స్థాయిని పరీక్షించు ప్రశ్నలు.
*Application వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు :* సముపార్జించిన  సంభావిత జ్ఞానాన్ని  నిజ జీవిత సందర్భాలలో వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు.
*1 నుండి 2 తరగతులకు MUA ల సంతుల్యత అన్ని సబ్జెక్టులకు  50% – 25% – 25% ఉండును.*
*3 నుండి 8 తరగతులకు  MUA ల   సంతుల్యత  క్రింది విధంగా ఉండును.*
 తెలుగు,హిందీలకు 40% – 40% – 20%
 ఇంగ్లీష్ కు 30% – 40% – 30%
 సైన్స్,సోషల్, గణితం లకు 30% – 40% – 30%
*Difficulty level of question paper – ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి*
 ప్రతి ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి    48% నుండి 50% వరకు ఉండగలదు.
#CCE

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!