30 సం౹౹ల స్కేల్(SPP II B) అమలుపై వివరణ

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

30 సం౹౹ల స్కేల్(SPP II B) అమలుపై వివరణ

పదోన్నతి లేక ఒకే క్యాడర్ లో కొనసాగుతున్న ఉద్యోగులకు 2022 పీఆర్సీలో కొత్తగా 30 సం౹౹ల స్కేల్ మంజూరు చేస్తు GO Ms No. 1 Finance (PC-TA) dept dt. 17.01.2022 ఉత్తర్వులు ఇచ్చారు. అయితేఈ 30 సం౹౹ల స్కేల్ అమలుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా డిటిఏ గారు Lr No. FIN02-18069/ 65/2022-H SEC-DTA dt.02.09.2022 లేఖ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అందులో 2011 లో కొత్తగా మంజూరు చేసిన 18 సం౹౹ల స్కేల్ అమలుపై ఇచ్చిన Cir. 020091ని అనుసరించాలని సూచించారు.
2010 పీఆర్సీకి మునుపు 8/16/24 సం౹౹ల స్కేల్స్ అమలులో ఉండగా GO 96 తేదీ 20.05.2011 మేరకు 8/16/24కు బదులుగా 6/12/24 స్కేల్స్ గా మారుస్తు కొత్తగా 18 స్కేల్ మంజూరు చేయడం జరిగింది. 18 స్కేల్ అమలుపై ఆనాడు 11 అంశాలపై వివరణలు ఇస్తు Cir.Memo No.020091/ 125/PC.II/2011 Finance dept dt.17.08.2011 ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరణలు 30సం౹౹ల స్కేల్ అమలుకు అన్వయించుకోవాలి. అందులోని వివరణల మేరకు
1)01.07.2018నాటి కన్నా ముందు ఒకే క్యాడర్ లో 30సం౹౹ల సర్వీస్ పూర్తి చేసుకుని 01.07.2018 నాటికి అదే క్యాడర్ లో కొనసాగుతున్న ఆ ఉద్యోగికి 1.7.2018 నుండి మాత్రమే 30సం౹౹ల స్కేల్ మంజూరు చేయవచ్చు.
2)01.07.2018 తేదీ నాటి కన్నా ముందు 30స౹౹ల సర్వీసు పూర్తయి 01.07.2018 నాటికి క్యాడర్ మారిన వారికి ఈస్కేల్ వర్తించదు.
3)01.07.2018 తర్వాత 30 సం౹౹ల సర్వీసు పూర్తయి తర్వాత పదోన్నతి పొందిన వారికి కూడా 30 సం౹౹ల స్కేల్ వర్తిస్తుంది.
4)24/30 సం౹౹ల స్కేల్స్(SPP II) పొందిన తర్వాత పదోన్నతి పొందిన వారికి FR22(B) వర్తించదు. అనగా FR 22(a)(1) మేరకు ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే మంజూరు చేస్తారు.
5)24/30 సం౹౹ల స్కేల్ పొందిన తర్వాత పదోన్నతి పొందిన క్యాడర్ లో AAS వర్తించదు.
6)30 సం౹౹ల స్కేల్ వేతన స్థిరీకరణ 01.01.2022 నుండి మాత్రమే నగదుగా చెల్లిస్తారు.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!