సీనియారిటీలెక్కింపుకు సంబంధించిన జనరల్ రూల్-33లో పొందుపరచబడిన నియమాలు
(ఎ) ఒక సర్వీసు, క్లాసు లేదా కేటగిరీ లేదా గ్రేడులో నియామకం తేదీ నుంచే ఉద్యోగి సీనియారిటీ నిర్ధారింపబడుతుంది. ఒక శిక్షగా అతడు క్రింది పోస్టుకు తగ్గించబడిన సందర్భాలలో ఇది వర్తించదు.
AP 1000 CBSE Schools 10th Hindi Deleted Syllabus 2024-25 Review the syllabus of Hindi subject…
(బి) ఒక సర్వీసుకు ఏకకాలంలో ఇద్దరి కన్నా ఎక్కువ వ్యక్తులను నియామకం చేయునప్పుడు వారి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సు “నిర్దేశించాలి. ఇది నియామకాలలో రిజర్వేషన్లు పాటించడానికి గాని, మరే ఇతర కారణం కోసమైనా కావచ్చు. ఆ విధంగా నిర్దేశించబడిన ఆర్డరు ఆధారంగా వారి సీనియారిటీ గుర్తింపబడుతుంది. పబ్లిక్ సర్వీసు కమీషన్ లేదా ఇతర ఏజెన్నీ / అధికారుల ద్వారా ఎంపికైన వారి సీనియారిటీ వారు ఎంపికైన లిస్టులో కమీషన్ నిర్దేశించిన ఆర్డరు ప్రకారం ఉండాలి.
(సి) ప్రమోషన్ కు నోషనల్ గా ఒక తేదీ నిర్ధారించినపుడు, ఫీడర్ కేటగిరీలో అర్హతగల సర్వీసు లెక్కించడానికి అట్టి నోషనల్ తేదీనే ఆధారంగా తీసుకోవాలి. ఫీడర్ కేటగిరీలో ప్రొబేషన్ ప్రకటనకు కూడా అట్టి నోషనల్ తేదీనే గణించాలి. .
(డి) ఒక సర్వీసులో ఒక తరగతి లేదా కేటగిరీకి చెందిన వ్యక్తిని అదే సర్వీసులో సమానమైన పే-స్కేలు గల ఇతర తరగతి లేదా కేటగిరీకి బదిలీ అయినప్పటికీ, ఆ వ్యక్తి ముందు పోస్టులో రెగ్యులర్ నియామకం పొందిన తేదీ నుండియే సీనియారిటీ లెక్కింప బడుతుంది. ఈ ఉప నియమం అనువర్తింపజేయడంలో నియా మకపు అధికారికి ఏదేని ఇబ్బంది కలిగినపుడు ప్రభుత్వం, ఇతర సందర్భాలలో నియామకపు అధికారి కన్నా పై స్థాయి అధికారి సీనియారిటీ నిర్ణయిస్తారు.
(a) విర్దేశిత కాలంపాటు ఒక ఉద్యోగి క్రింది పోస్టు, కేటగిరీ లేదా గ్రేడుకు తగ్గించబడినపుడు:
(i) అతనికి శిక్షను నిర్దేశించిన ఉత్తర్వులలో వేరు విధంగా చెప్పని సందర్భాలలో, ఆ శిక్ష అతని భవిష్యత్ ఇంక్రిమెంట్లు వాయిదా పడే ప్రభావం లేనపుడు, ఆతని రీ-ప్రమోషన్ తర్వాత పనిష్మెంటు కన్నా ముందు అతడు ప్రమోషన్లో చేరిన తేదీ నుంచే సీనియారిటీ వర్తిస్తుంది.
(it) ఉద్యోగిని శిక్షగా క్రింది స్థాయికి పంపినపుడు, అతని భవిష్యత్ ఇంక్రిమెంటు వాయిదాపడే సందర్భాలలో అతని రీ-ప్రమోషన్ తర్వాత ప్రమోషన్ పోస్టులో అతని పూర్వపు సర్వీసు ఆ మేరకు తగ్గించి సీనియారిటీ లెక్కించాలి.
(ఇ) (1)]
ఎఫ్) రిట్రెంచ్ లేదా రీ-అప్పాయింట్ అయిన వ్యక్తి సీనియారిటీ: ఏదేని కారణాన రిట్రెంచ్ అయిన ఉద్యోగికి అతడు పునర్నియామకం పొందిన తేదీ నుండే సీనియారిటీ లెక్కించబడు తుంది.
ఇటువంటి సందర్భాలలో పునర్నియామకం పొందిన వ్యక్తుల అంతర్గత సీనియారిటీ క్రింది విధంగా గణింపబడుతుంది.
(1) పబ్లిక్ సర్వీస్ కమీషన్ లేదా ఇతర సెలెక్టింగ్ అథారిటీలతో సంప్రదించిన మీదట జరిగే పునర్నియామకాలలో పబ్లిక్ సర్వీసు కమీషన్ లేదా సెలెక్టింగ్ ఆథారిటీ నిర్దేశించిన మెరిట్ ఆర్డరు లేదా 1 ప్రాధాన్యతా క్రమం ప్రకారం ఉంటుంది. మరియు
(ii) ఇతర సందర్భాలలో, తొలగింపుకు ముందు ఆ వ్యక్తి పునర్నియామకం కానున్న ఉద్యోగానికి సమమైన లేదా ఉన్నత సర్వీసు, తరగతి లేదా కేటగిరీలో చేసిన సర్వీసు మొత్తం ఆధారంగా సీనియారిటీ పరిగణించాలి.
(జి) ఏదేని సర్వీసు, తరగతి లేదా కేటగిరీలో చేరుటకు (ముందు మిలిటరీ సర్వీసు చేసిన వారి విషయంలో, ఆయా సర్వీసు, తరగతి లేదా కేటగిరీలలో నియమాకానికి ఉద్దేశించి తయారయిన అభ్యర్థుల అధికారిక లిస్టునందలి సూచించిన ప్రాధాన్యతా క్రమము ప్రకారం సీనియారిటీ నిర్ణయించాలి.
#SERVICE_MATTERS
🅰🅿️
💥Todays Short News 1st Oct 2022💥
💥.పండగ పూట ఈఎంఐల మంట
రెపో రేటు 0.5 శాతం పెంచిన రిజర్వు బ్యాంకు
2019 ఏప్రిల్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరిక
గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియం
💥.మండలానికిద్దరు ఎంఈవోలపై 20వ తేదీ వరకు ముందుకెళ్లొద్దు
రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విచారణ అక్టోబరు 20కి వాయిదా
💥.మినిమం టైం స్కేల్ ఇవ్వలేం
సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై తేల్చేసిన ప్రభుత్వం
💥.వలంటీర్ల సేవలకు మరో ఏడాది పొడిగింపు
గ్రామ, వార్డ్ సచివాలయాలల్లో పనిచేస్తున్న 2.60 లక్షల వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ, వార్డ్ సచివాలయాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
💥.బడికెళ్లే బాలలు తగ్గుతున్నారు
దేశవ్యాప్తంగా స్కూళ్లలో చేరికలపై జనాభా తగ్గుదల ప్రభావం
ఎన్సీఈఆర్టీ నివేదికలో వెల్లడి
2011 నుంచి పడిపోతున్నఒకటో తరగతి చేరికలు
💥.టెట్’ ఆశలు ఆవిరి!
కొందరికి నూరుశాతానికి పైగా మార్కులు .. ఆపై దిద్దుబాటు
💥.విదేశీ విద్యార్థులకు 25 శాతం సీట్లు
ఉన్నత విద్యాసంస్థల్లో సూపర్ న్యూమరరీ కోటా కింద ఇచ్చుకోవచ్చు
ప్రవేశాల మార్గదర్శకాలను జారీ చేసిన యూజీసీ
💥.గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ ముఖఆధారిత హాజరు
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ శనివారం నుంచి ముఖ ఆధారిత హాజరు నమోదు చేయను న్నారు.
💥.92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఏపీపీఎస్సీ గ్రూప్- 1 (జనరల్ మిటెడ్ రిక్రూట్మెంట్)లో 92 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
💥.ఏపీ టెట్లో 150కి 151 మార్కులు!
పాఠశాల విద్యాశాఖ నిర్వ హించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో 150కి 151 150.86, 150.64, 150.26, మార్కులు వచ్చాయి. ఇదేంటి? అని అనుకుంటున్నారా? అధికారులు నిర్వహించిన నార్మలైజేషన్ విధానంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
💥.ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణలో ఇష్టారాజ్యం
అమరావతి: ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణ వ్యవహారం గందరగోళంగా మారింది. కళాశాలల రెన్యువల్ను నిలిపివేసిన అధికారే హడావుడిగా అర్ధరాత్రి మళ్లీ కొన్నింటి అనుమతు లను పునరుద్ధరించాలని వర్సిటీలపై ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశమైంది.
💥.గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలు!
అమరావతి: గ్రూపు-1 పోస్టుల భర్తీకి మాత్రమే మౌఖిక పరీక్షలను పరిమితంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు
💥.పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ
ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2023 మార్చి 29వ తేదీన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాంల ముగియనుండటంతో ఓటర్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకటన విడుదలైంది.
💥.పాఠశాల విద్యాశాఖ సలహాదారు రాజీనామా
పాఠశాల విద్యాశాఖలో మౌళి కసదుపాయలకల్పనకు సలహాదారుగా ఉన్న ఎ.మురళీతన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు సిఎం జగన్కు లేఖ రాశారు.
💥.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతకే విద్యాంజలి 2.0
ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత గల విద్యని అందించడానికి విద్యాంజలి 2.0, స్వచ్ఛంద సేవల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టామని, దీన్ని జయప్రదం చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు.