TS: Notification for 1147 assistant professor posts in Telangana on September 26.. Vacancy details

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TS: Notification for 1147 assistant professor posts in Telangana on September 26.. Vacancy details 

TS: Notification for 1140 assistant professor posts

Assistatn Professors: 26న వైద్య సహాయ ఆచార్యుల పోస్టులకు ప్రకటన!

* 1,147 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం 
 

 తెలంగాణలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు సెప్టెంబర్‌ 26న వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రకటన వెలువరించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ద్వారా 969 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాలను చేపడుతున్నారు. సహాయ ఆచార్యుల నియామక ప్రకటనలోనూ ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం నిబంధన కొనసాగుతుంది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాల్లో అయితే ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం నిబంధన అమల్లో ఉన్నా.. సుమారు 4700 మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులన్నీ ఎంబీబీఎస్‌ అర్హతతో కూడినవే కావడంతో ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, సెప్టెంబర్‌ 26న  ప్రకటన వెలువడనున్న సహాయ ఆచార్యుల పోస్టులన్నీ స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు పోస్టులు. వీటికీ ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని వర్తింపజేస్తున్న నేపథ్యంలో ఎంత మేరకు అభ్యర్థుల నుంచి స్పందన లభిస్తుందనేది వేచి చూడాలి. ప్రైవేటు ప్రాక్టీసుపై ముందుగానే స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యంలోకి రావాలనుకునే వారే దరఖాస్తు చేసుకుంటారని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే మూడు నెలల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపాయి. ఈ పోస్టుల భర్తీలోనూ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. 

 

కొత్తగా భర్తీ చేయనున్న సహాయ ఆచార్యుల పోస్టులు
 

విభాగం                 పోస్టుల సంఖ్య
అనస్థీషియా 154
అబ్‌స్ట్రిషియన్‌ అండ్‌ గైనకాలజీ 138
జనరల్‌ సర్జరీ  116
జనరల్‌ మెడిసిన్‌ 111
పీడియాట్రిక్స్‌ 77
ఆర్థోపెడిక్స్‌ 62
రేడియో డయాగ్నసిస్‌ 46
పాథాలజీ 27
అనాటమీ 26
ఫిజియాలజీ  26
ఫోరెన్సిక్‌ సైన్స్‌ 25
మైక్రోబయాలజీ 25
ఎస్‌పీఎం 23
కార్డియోథొరాసిక్‌ సర్జరీ 21
సైకియాట్రీ  21
బయోకెమిస్ట్రీ 18
ప్లాస్టిక్‌ సర్జరీ 17
కార్డియాలజీ 17
యూరాలజీ 17
న్యూరో సర్జరీ 16
ఫార్మకాలజీ 16
ఈఎన్‌టీ 15
ఎమెర్జెన్సీ మెడిసిన్‌ 15
ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ 14
హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 14
డెర్మటాలజీ 13
డెంటల్‌ సర్జరీ 13
ఎండోక్రైనాలజీ 12
న్యూరాలజీ 11
టీబీ అండ్‌ సీడీ 10
నెఫ్రాలజీ 10
ఆప్తాల్మాలజీ 8
పీడియాట్రిక్‌ సర్జరీ 8
రేడియోథెరపీ  5
మొత్తం 1,147

error: Content is protected !!