TS ECET COUNSELLING 2022: FIRST PHASE,FINAL FHASE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TS ECET COUNSELLING 2022: FIRST PHASE,FINAL FHASE 


డిప్లొమా విద్యార్థులకు బీటె‌క్‌లో ల్యాట్రల్‌ ఎంట్రీ కోసం నిర్వహించిన ఈసెట్‌ (TS ECET)-2022 వెబ్‌‌కౌ‌న్సె‌లింగ్‌ ప్రక్రియ సెప్టెంబరు 7న ప్రారంభమైంది. ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబరు 7  నుంచి స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్‌కు ముందు అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓబీ, బీసీ అభ్యర్థులు రూ.1200,  ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులు రూ.600 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 

ONLINE SLOT BOOKING FOR CERTIFICATE VERIFICATION

Counselling Website 

Counselling Notification

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 7  నుంచి స్లాట్లు బుకింగ్, సెప్టెంబ‌ర్ 9 నుంచి 12 వ‌ర‌కు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, సెప్టెంబరు 9 నుంచి 14 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవాలి. సెప్టెంబరు 17న సీట్ల కేటాయింపు ఉంటుంది. మొద‌టి విడుత‌లో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌ర్ 22వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబ‌ర్ 25 నుంచి తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. 29న సీట్లు కేటాయించ‌నున్నారు. అక్టోబ‌ర్ 10 లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.

TS ECET – 2022 RANK CARD

ఈ ఏడాది టీఎస్‌ఈసెట్‌-2022 పరీక్షను ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీల్లో కలిపి 24,055 మంది దరఖాస్తు చేసుకోగా 22,001 (91.46శాతం)మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్‌ఈసెట్‌ ప్రాథమిక ‘కీ’ని ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరించారు. దీంతో ఆగస్టు 12న ఫలితాలను వెల్లడించారు. ఈసెట్ ఫలితాల్లో 90.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

error: Content is protected !!