No merger of JEE Main, NEET UG with CUET for at least two years: Minister

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

No merger of JEE Main, NEET UG with CUET for at least two years: Minister

CUET: నీట్‌, జేఈఈ విలీనం ఇప్పట్లో లేదు! స్పష్టం చేసిన కేంద్ర మంత్రి!!

యూనివ‌ర్సిటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)తో ఇంజినీరింగ్ కోర్సుల ఎంట్రెన్స్ జీఈఈ, వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ను విలీనం చేసే ప్రణాళికే లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. భ‌విష్యత్‌లో సీయూఈటీతో నీట్‌, జేఈఈల‌ను విలీనం చేస్తామ‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) చైర్మన్ జ‌గ‌దీశ్ కుమార్ గ‌త నెల‌లో ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సెప్టెంబరు 6న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్రధాన్ ఈ మేరకు స్పష్టం చేశారు. 

సీయూఈటీలో నీట్‌, జేఈఈ విలీనం కోసం కేంద్రం సూత్రప్రాయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేద‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్ తేల్చి చెప్పారు. విద్యార్థులు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. సీయూఈటీలో నీట్‌, జేఈఈ విలీనం చేయ‌డానికి క‌నీసం రెండేళ్ల సమయం ప‌డుతుంద‌న్నారు.

నూత‌న విద్యా విధానానికి అనుగుణంగా వ‌చ్చే రెండేళ్లలో కొత్త పాఠ్య పుస్తకాలు వ‌స్తాయ‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వ‌చ్చే ఫిబ్రవ‌రి నుంచి స్కూళ్లలో బాల్ వాటిక (కిండ‌ర్ గార్డెన్‌) అనే పేరుతో ఐదేళ్ల ఫౌండేష‌న్ కోర్సుకు పుస్తకాలు పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. దేశంలోని విద్యార్థులు ఒక‌టి కంటే ఎక్కువ విద్యా కోర్సుల‌ను అభ్యసించ‌డానికి వీలుగా ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోదీ సార‌ధ్యంలోని కేంద్ర ప్రభుత్వం డిజిట‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించింద‌న్నారు.
విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకే విలీనం: యూజీసీ
ఇంజినీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్టులను సీయూఈటీ-యూజీలో విలీనం చేసే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కసరత్తులు చేస్తోంది. మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలకు వేరువేరుగా ఎంట్రన్స్‌ టెస్టులు రాయకుండా ఒకే ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాసి ఆయా సబ్జెక్టుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అంటే ఒకే సింగిల్‌ ఎగ్జాం రాయడం ద్వారా వివిధ సబ్జెక్టుల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చని యూజీసీ చైర్మన్‌ ఎమ్‌ జగదీష్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌కు రాసే జేఈఈ మెయిన్‌, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష, సీయూఈటీ యూజీ పరీక్షతో కలిపి మొత్తం 3 మేజర్ ఎంట్రన్స్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీటికి దేశ వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. మెజారిటీ స్టూడెంట్స్ వీటిల్లో కనీసం రెండు పరీక్షలకైనా హాజరవుతున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలకు మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను అటెంప్ట్‌ చేస్తున్నారు. నీట్‌ యూజీ పరీక్షలో కూడా మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టును బయాలజీ రీప్లేస్‌ చేస్తుంది. ఈ సబ్జెక్టులన్నీ కూడా సీయూఈటీ- యూజీలో ఉన్న 61 విభాగాల్లో ఇప్పటికే ఉన్నాయి. రకరకాల ఎంట్రన్స్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్ధులు ఒత్తిడికి గురికాకూడదనే తాజా ప్రతిపాదన ప్రధాన లక్ష్యం. ఒకే ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించే దిశగా యూజీసీ చర్చలు జరుపుతోంది. తద్వారా విద్యార్దులు ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షను రాయడానికి అవకాశం ఉంటుంది. బోర్డు పరీక్షల తర్వాత ఒకసారి, డిసెంబర్‌లో మరొకసారి రాయవచ్చని జగదీష్‌ కుమార్ అన్నారు.

error: Content is protected !!