IBPS RRB Clerk Admit Card 2022: ఆర్‌ఆర్‌బీ ‘క్లర్క్’ మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, డౌన్‌లోడ్ లింక్ ఇదే!
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. అభ్యర్థులకు సెప్టెంబరు 24న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు
IBPS RRB Clerk Admit Card 2022: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్ మెయిన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు(కాల్ లెటర్లు) విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి మెయిన పరీక్ష కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 24న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
Direct Link: IBPS RRB Online Main Exam Call Letters