*EOL… EXTRAORDINARY LEAVE …సమాచారం*
*వివిధ కారణాలతో కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీస్ నుంచి సస్పెన్షన్ కు గురవుతారు. కొన్ని నెలలపాటు సస్పెన్షన్ ఉన్న తర్వాత Competent Authority …. సస్పెన్షన్ ఎత్తివేసి… వారిని తిరిగి రీఇన్స్టెట్ చేస్తారు. చాలా కేసుల్లో సస్పెన్షన్ పీరియడ్‌కు ఎలిజిబుల్ లీవ్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలూ జారీచేస్తారు. ఇలాంటి సందర్భాల్లో సదరు ఉద్యోగికి సస్పెన్షన్ కాలానికి సరిపోయే సెలవులు…. Half Pay Leave మరియు Earned Leave నిల్వ లేనప్పుడు… అనివార్యంగా జీతనష్టపు అసాధారణ సెలవు (Extraordinary Leave on Loss of Pay) మంజూరు చేయాల్సి ఉంటుంది. మామూలుగానైతే, జీతనష్టపు అసాధారణ సెలవు మంజూరు ఎన్ని రోజులు ఉంటుందో…. అన్ని రోజులు వార్షిక ఇంక్రిమెంటును కూడా పోస్టుపోన్ చేస్తారు. చేయాలి కూడా! కానీ, సస్పెన్షన్ పీరియడ్‌కు అసాధారణ సెలవు మంజూరు అయిన సందర్భంలో మాత్రం ఆ EOL పీరియడ్‌ను ఇంక్రిమెంట్లకు, పెన్షన్ లెక్కించాల్సిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం Sub-Rule (5) of FR-54 మరియు Sb-Rule (7) of FR-54 ను సవరిస్తూ… GO Ms No 307 Fin (FR.II) Department dated 03.12.2012 నంబర్ జీవో జారీచేసింది.*