TSPSC 2670 MUNCIPAL DEPARTMENT POSTS
TS Government Jobs: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కింద 6 రకాల కేటగిరీల కింద ఈ పోస్టులను క్రియోట్ చేశారు. విభాగాల వారీగా పోస్టుల విషయానికి వస్తే..
ప్రధానాంశాలు:
- తెలంగాణ జాబ్ రిక్రూట్‌మెంట్ 2022
- మున్సిపల్ శాఖలో 2670 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
- త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల
మొత్తం పోస్టుల సంఖ్య: 2670
- జూనియర్ అకౌంట్ ఆఫీసర్- 07
- సీనియర్ అకౌంటెంట్- 37
- సీనియర్ అసిస్టెంట్- 138
- జూనియర్ అకౌంటెంట్- 94
- జూనియర్ అసిస్టెంట్- 122
- వార్డ్ ఆఫీసర్- 2242
జీతం వివరాలు:
- జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కు నెలకు రూ.42,300 నుంచి రూ. 1,15,270 మధ్య చెల్లిస్తారు.
- సీనియర్ అకౌంటెంట్ ,సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు రూ. 32,810 నుంచి రూ. 96,890 మధ్య చెల్లించనున్నారు.
- జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు రూ.24280 నుంచి రూ.72.850 మధ్య చెల్లించనున్నారు.
- వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నెలకు రూ.22,240 నుంచి రూ.67,300 మధ్య చెల్లిస్తారు.
పైన మంజూరు చేసిన ఉద్యోగాలకు సంబంధించి పోస్టుల్లో వీఆర్ఓలను కొన్ని పోస్టుల్లో జిల్లాల వారీగా సర్దుబాటు చేసినట్లు సర్క్యూలర్ లో పేర్కొన్నారు. కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో ఎక్కువగా వార్డ్ ఉద్యోగాలే ఉన్నాయి. వీఆర్ఓలను కూడా ఈ పోస్టుల్లోనే ఎక్కువగా సర్దుబాటు చేశారు. 33 జిల్లాల వారీగా 729 పోస్టులను వీఆర్ఓలతో సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక మిగిలిన 1944 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక ఈ ఉద్యోగాలకు సంబధించి అంత్యంత త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చి.. నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అలాగే.. గ్రూప్ 2 (TSPSC Group 2), గ్రూప్ 3 (TSPSC Group 3) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌లు కూడా అక్టోబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
TSPSC 2670 MUNCIPAL DEPARTMENT POSTS
JOIN OUR TELEGRAM CLICK HERE