*📚✍️21న పాఠశాలల్లో నులిపురుగు*
*నివారణ మందుల పంపిణీ✍️📚*
*🌻మచిలీపట్నం(చిలకలపూడి) :* నులిపురుగు నివా రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 21 జిల్లా లోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగు నివారణమందులు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా విద్యాశా ఖాధికారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలి పారు. ఆరోజు పాఠశాలలకు విద్యార్థులు అందరూ హాజరయ్యేలా ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకో వాలన్నారు. డీవైఈవోలు, ఎమ్యీవోలు కూడా శ్రద్ధతీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పాఠశాలల హెచ్ఎంలు ముందుగానే స్థానిక వైద్య సిబ్బందిని సమన్వయం చేసుకుని అవసరమైన మందులు సమకూర్చుకోవాలని ఆదేశించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇