*📚✍️తమిళనాట పాఠశాల*
*విద్యార్థులకు అల్పాహారం✍️📚*
*🌻ఆర్కేనగర్ (చెన్నై), న్యూస్టుడే:* తమిళనాట 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించే పథకం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా మదురైలోని నెల్పట్టైలోని ఆదిమూలం కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. అనం తరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. 1,545 ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో తొలి విడతగా 1. 16 లక్షల మందికి ఈ పథకాన్ని రూ.33.56 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నారు. అల్పాహారంలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రవ్వ ఉప్మా, సేమియా ఉప్మా-సాంబారు, రవ్వ కిచిడి, సేమియా కిచిడి, రవ్వ పొంగల్ ఉంటాయని సీఎం తెలిపారు. శుక్రవారం ప్రత్యేకంగా రవ్వకేసరి, సేమియా కేసరి కూడా అందిస్తారని వివరించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇