*📚✍️విద్యాసంస్థల ఏర్పాటు*
*ప్రాథమిక హక్కు✍️📚*
*♦️కార్యనిర్వాహక ఉత్తర్వులతో ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోలేవు*
*♦️సుప్రీంకోర్టు స్పష్టీకరణ*
*🌻దిల్లీ:* విద్యా సంస్థలను నెలకొల్పడమన్నది ప్రాథమిక హక్కు అని, ఈ విషయంలో ప్రభుత్వం చట్టపరమైన నిబంధనలను విధించగలదే తప్ప… కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఈ హక్కును అడ్డుకోజాలదని సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది. ఈ విషయంలో భారత ఔషధ మండలి (పీసీఐ) నిర్ణయానికి వ్యతిరేకంగా దిల్లీ, కర్ణా టక, ఛత్తీస్గఢ్ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు సబబేనని తేల్చిచెప్పింది. దేశంలో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు కొత్త ఫార్మసీ కళాశాలలను ఏర్పాటు చేయకుండా పీసీఐ 2019లో మారటోరియం విధిం చింది. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ పలు ప్రైవేటు విద్యా సంస్థలు హైకోర్టులను ఆశ్రయించగా, అనుకూల తీర్పులు వచ్చాయి. దీంతో వీటిని వ్యతిరేకిస్తూ పీసీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ అంశంపై జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కళాశాలల ఏర్పా టుకు ప్రభుత్వం చట్టబద్ధ నిబంధనలను వర్తింపజేయ గలదే తప్ప, వాటిని ఏర్పాటు చేసుకునే ప్రాథమిక హక్కును మాత్రం కార్యనిర్వాహక ఆదేశాలతో హరించ లేదని స్పష్టం చేసింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇