మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు.

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
*🌅మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు..*
🌱 1.  రోజూ.. ఒక సమయం లో నీకోసం నీవు… కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
🌱2. నీవు ప్రతిస్పందించే తీరును గమనించుకో.  బాధలు, అవమానాలు,ఉద్రేకాల నుండి ఎలా బయట పడాలో… జ్ఞానాన్ని ఆశ్రయించి ఎలా శాంతిలోకి నడవాలో… సాధన చెయ్యి !
🌱3. ప్రతి రోజూ… ధ్యానం చేయడం… నీలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ను తగ్గించగలదని గుర్తుంచుకో !
 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో !
🌱 5. *కక్ష* కన్నా *క్షమ* గొప్పది 
క్షమ కన్నా *కరుణ* గొప్పదని  అని తెలుసుకొని, తోటి వారి పట్ల పాటించడం అలవాటు చేసుకో !
🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత వరకు ఆలోచించటం అవసరం అని… నిర్ణయించుకుని అంత వరకే ఆలోచించు !
 🌱7. నవ్వుతో పరిస్థితులను ఎదుర్కో ,  ఇతరులతో నీ భావాలు పంచుకో!
🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని…దాని గురించిన జ్ఞాన సాధన చెయ్యి.  
🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుటి వారి గురించి తక్కువ అంచనా వేయడం మానుకో !
🌱 10. పాజిటివ్ గా ఆలోచించటం నేర్చుకో. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం అవుతుంది  !
🌱11. *అసూయ కూ, దురలవాట్ల కూ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో*   *యోగా,ధ్యానం* చేయడం నేర్చుకో!
🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కొంత.. మంచి పనులకు ఖర్చు చెయ్యడం నేర్చుకో!
🌱13. నాకు రాదు, నాకు చేత కాదు.. అనే మాటలను చెప్పడం మానుకో !
 🌱14. బయటి ప్రదేశాలకు వెళ్ళటం, మిత్రులతో  బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం,  సత్సంగం  వలన…నీకు రిలాక్సేషన్ కలుగుతుంది అని తెలుసుకో ! 
🌱 15. *టి వి కన్నా, సెల్ ఫోన్ కన్నా.. నీకు ఇష్టమైన సంగీతం..నీలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది అని గ్రహించు* !
🌱16. నీలోని మానసిక ఒత్తిడి.. నీ బలాన్ని చంపగలదు అని తెలుసుకో !
🌱17. సత్ సంబంధాలను కాపాడుకో…ఎక్కువ విను , తక్కువ మాట్లాడు..ఎక్కువ నేర్చుకో !
🌱18. ప్రతీదీ పరిశీలించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !
🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !
🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుండా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని.. అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ..పూర్తి కావు అని గుర్తుంచుకో !
🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అని..  ఒక ప్రణాళిక వేసుకో !
🌱24. ప్రతీ రోజూ… భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని సంతోషించు. ఈ అద్భుత ప్రపంచం లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
🌱 25. *ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి వుండు*.
 *నీకు జ్ఞానాన్ని ఇచ్చే గురువుల పట్ల కృతజ్ఞత కలిగి వుండు* .

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!