VANGAPANDU PRASAD RAO:వంగపండు వెళ్ళిపోయి అప్పుడే రెండేళ్ళయి పోయిందా?ఏం పిల్లడో ఎల్దా మొస్తవా….

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
🙏 *వంగపండు వెళ్ళిపోయి అప్పుడే* 
 *రెండేళ్ళయి పోయిందా?*🙏
*ఏం పిల్లడో ఎల్దా మొస్తవా …!!*
 *శ్రీకాకుళం సీమ కొండలో ఒరిగిన వంగపండు.!!*.
*పార్వతీ పురంలో పొద్దు గుంకింది..ఇక తెల్లారనే లేదు…*
*విప్లవ సూరీడు ఇక నిద్ర  లేవనేలేదు.ఎర్రజెండా* *రెపరెపలు ఒక్కసారి గా నిలిచి పోయాయి.ఉత్తరాంధ్ర జనపదం  నోరు పెగలడం లేదు.కవి,వాగ్గేయ* *కారుడువంగపండు ప్రసాద*
*రావు ఇక లేరన్న నిజం జీర్ణం కావడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ..ఆయన* *మాటా..పాటా.చిందు మాత్రం శాశ్వతం.అనితర సాధ్యం ఆయన మార్గం*
*ఏం పిల్లడో ఎల్దామొస్తవా* 
*శ్రీకాకుళంలో సీమకొండకి* 
*ఏం పిల్లడో ఎల్దమొస్తవా*
*అరె చిలకలు కత్తులు* *దులపరిస్తయట* 
*ఏం పిల్లడో ఎల్దామొస్తవా*
*అరె సాలూరవతల* *సవర్లకొండకు*
*చెమర పిల్లులే* *శంఖమూదేనట*
*నల్లగొండ నట్టడవిలోనికి*
*పాముని పొడిచిన* *చీమలున్నయట*
*తెలంగాణ కొమురయ్యకొండకీ*
*అరెరరె అరె హహూ హహూహ*
*అరె గద్దని తన్నిన* *చేతులున్నయట*
*ఆకులు మేసిన మేకలకొండకు*
*పులుల్ని మింగిన* *గొర్రెలున్నయట*
*రాయలసీమ రాలుకొండకీ*
*రక్తం రాజ్యం ఏలుతుందట*
*అరె తూరుపు..*
*తూరుపు దిక్కున దోర కొండకీ*
*అరెరరెరరె హహూ హాహూహ*
*అరె తుపాకీ పేల్చిన* *తూనీగలున్నయట*
*కలకత్తా కొద కారుకొండకీ*
*ఎలుకలు పిల్లిని ఎంటా* *తగిలెనట* 
*ఏం పిల్లడో ఎల్దామొస్తవా…!!*
*ఎక్కడి శ్రీకాకుళం నక్సల్ భారీ ఉద్యమం.ఎక్కడి తెలంగాణ*
*సాయుధ సమరం..ప్రాంతాల మధ్య విభజన రేఖను చెరిపే*
*శాడు.ఉద్యమమే ఊపిరి గా బతికాడు.అది ఉత్తరాంధ్రా ?..*
*తెలంగాణా.? .లేక మరో ప్రాంతమా..? అన్నది లేకుండా అవసరాన్ని బట్టి  విప్లవ స్ఫూర్తి* *తగిలించాడు.తానే ఓపాట*
*య్యాడు.జనపదాన్ని విప్లవ సందేశంతో ముడిపెట్టి చిందే*
*శాడు.చివరి శ్వాస వరకు* *విప్లవమే ఊపిరిగా బతికాడు.*
*పాటను బతుకు బాటగా* *మార్చుకొని సమాజాన్ని* *చైతన్య*
*పరిచాడు.*
*”సికాకులంలో సీమలకొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా..* 
*చిలకలు కత్తులు* *దులపరిస్తయట..* *సాలూరవతల సవర్ల*
*కొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా.. సెవల పిల్లులే శంఖమూ*
*దెనట…” తెలంగాణా* *కొమరయ్య కొండకి అంటూ” విప్లవ నేపథ్యంలో రాసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి ఆయన రాసిన* *పాటల్లో‌ ఉత్తరాంధ్ర  నుడికారం, యాసా, ఊపూ మిళితమై* *వుంటాయి.పాడటంలో* *చిందేయడంలో*
*చేతుల మధ్య గజ్జల్ని* *మోగించడంలో ఆయన పంథా ప్రత్యేకమైనది అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లోఈ పాటను ఇంగ్లిష్‌లోకి అనువదించి పాడుకున్నా* *రంటే….వంగపండు పాటలకున్న పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు‌..!!*
*కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన  పాటలు ఊతమయ్యా*
*యి‌.తన జానపద గేయాల* *ద్వారా ప్రజా చైతన్యం తీసు*
*కొచ్చేందుకు* *ప్రయత్నించాడు.గద్దర్ వంటి వారితో కలిసి* *జననాట్యమండలి కోసం పనిచేశాడు. ఆయన* *సుమారుగా 400 వరకు పాటలు రాశారు. అవి వివిధ భాషల్లోకి కూడా అనువాదం కావడం విశేషం*.
*వంగపండు కేవలం విప్లవ గీతాలను మాత్రమే రాయలేదు.*
*జానపదంలో శృంగారాన్ని* *కూడా  ఒలికించాడు*
*ఆవులు తోలుకొని*
 *అలుగెల్లి నువ్వొస్థే*
 *ఇలగెల్లి నేనొస్తే…*
 *మద్దెల కింది చేను*
 *ఇద్దరినీ కలిపింది.”!!*
*వంటి పాటలు కూడా వంగపండు కలం నుంచి*
*జాలు వారాయి.*
*రెండు నెలల ముందు తానా అంతర్జాతీయ తెలుగు సాహితీ వేదికలో రెండున్నర గంటల పాటు సోలోగా*
*తన పాటతో మురిపించాడు.వీనుల విందు చేశాడు.*
*మాధురి స్మృతి చెరగనే లేదు.ఆ పాట ఇంకాచెవుల్లో*
*మార్మోగుతునే వుంది.ఇప్పుడేమో. చెప్పాపెట్టకుండా* 
*తన పాటల పిలగాడ్ని మనకొదిలేసీ తాను వెళ్ళి*
*పోయాడు.*
*విశాఖపట్నం షిప్ యార్డులో పనిచేస్తూ, పాటలు రాసి పాడుతూ, విప్లవోద్యమానికీ చేదోడయ్యాడు. తర్వాత* *కాలంలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి జన‌ నాట్యమండలి* *కళాకారుడిగా అనేక విప్లవ, ప్రజా గీతా*
*లు రచించి గానం చేశాడు*
*1974 అక్టోబర్ లో విశాఖలో జరిగిన విరసం సాహిత్య పాఠశాలతో  వంగపండు ప్రస్థానం మొదలైంది.అప్పుడే* 
*వంగపండనే ఓ కొత్త* *గాయకుడు గొంతెత్తి పాడిన వైనాన్ని జనం కథలు కథలుగా చెప్పుకున్నారు. విరసం విశాఖ ప్రచురణ ఏరువాక, వంగపండు ప్రసాద్ పాటలు పుస్తకం* *వెలువడిసాహితీ లోకంలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది*.
*జనం నోళ్లలో జజ్జనకరి జనారే, ఏం పిల్లడో ఎల్దామొస్తావా జీపీ వత్తంది రండిరా, యంత్రమెట్లా నడుస్త ఉందంటే, సుత్తీకొడవలి గుర్తుగ ఉన్నా ఎర్రని జెండ ఎగురుతున్నదీ*
*వంటి .పాటలు జనం నోళ్ళలో నానాయి.*
*సికాకులం, ఇజీనారం జిల్లాలో ఎం ఎల్ ఎ అనే ఇంగ్లిష్ మాటకు రూపాంతరపదం…అమ్మోలె గానీ “అనేది ఆరోజుల్లో అందరూ చెప్పుకునే వారు. ఆయన పాటల్లోని మాటల్లో   ఉత్తరాంధ్ర* *సొగసుఎగిసిపడేది‌.ఎమర్జన్సీలో ఆయన బహిరంగ పాటకు కొంత విరామం.ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ* *గొంతుపెగిలింది.వంగపండు పాట జనం గుండెల్ని తాకింది*
*1978లో ఆయన రాసిన  “భూమి భాగోతం”  సృజనలో*
 *అచ్చైంది.తర్వాత  సృజన ప్రచురణ పుస్తకంగా వచ్చింది. భూమి భాగోతం  కొన్ని వేల ప్రదర్శనలు జరిగాయి..* *1990లో విరసం ఇరవై‌యేళ్ళ మహాసభల సందర్భంగా ఆయన పాటల సంపుటం, ఎంపిక చేసిన పాటల ఆడియో కాసెట్ వచ్చాయి*
*పార్వతీపురం దగ్గర పెదబొండపల్లిలో 1943 జూన్‌ లో*
*జగన్నాధం, చినతల్లి దంపతులకు వంగపండుజన్మించారు*. 
*జానపద కళాకారుడిగా మూడు దశాబ్ధాల ప్రయాణంలో… ఆయన* *పాటతెలుగువారి గుండెల్లో  గూడు కట్టుకుందంటే* *అతిశయోక్తి కాదు.*
*అనేక మంది కళాకారులకు ఆయతర్ఫీదునిచ్చారు.ఆయన*
*కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గత కొన్ని రోజు*
*లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.జానపద వాగ్గేయ*
*కారుడు, గాయకుడు, జననాట్యమండలిఅధ్యక్షుడు.హేతు*
*వాది, ఉత్తరాంధ్ర గద్దర్గా పేరుతెచ్చుకున్నాడు. 2017 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే* *కళారత్న పురస్కారం అందు*
*కున్నాడు.*
*2008, నవంబరు 23 న తెనాలిలో ఈయనకు బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ అవార్డును బి.నరసింగరావు చేతుల*
*మీదుగా ప్రధానం చేశారు.ప్రజలకోసం బ్రతికిన నాజర్లాంటి*
 *కళాకారుడని వంగపండును నాజర్ తో పోలుస్తారు. వంగ*
*పండు ప్రసాదరావు, గద్దర్ తో కలిసి 1972లో పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగం జన నాట్యమండలిని స్థాపించా*
*డు.‌వంగపండు రాసిన 12 పాటలు అన్ని గిరిజన మాండలి*
*కాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి..* *”యంత్రమెట్టా నడుస్తు ఉందంటే” అనే పాటఆంగ్లంలో కూడా అనువదించ*
*బడి అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది.విప్ల*
*వ కవిత్వంలో పాటకు పెద్ద* *పీట వేసిన‌ సుబ్బారావు పాణి*
*గ్రాహి, గద్దర్ తో పాటు* *వంగపండు ప్రసాదరావు పేరు కూడా ముడిపడిపోయింది*.
*కమ్యూనిస్టు ఉద్యమాలకు కుల స్పృహ లేని రోజుల్లోనే…. ‘ఉందర్రా మాల పేటా ఊరి చివరా/కష్టాలున్నచోటా ఊరి* *చివర కాష్టాలున్న చోటా’ అని ఈ దేశ కులవాస్తవికతను*
*ప్రకటించిన…అభ్యుదయవాది వంగపండు*
*వంగపండు ప్రసాదరావు వంటి వాగ్గేయకారులు బహు అరుదుగా పుడతారు…మళ్ళీ మన కోసంఆయనే తిరిగి పుడతారేమో ఎదురు చూద్దాం..!!*
*వంగపండు ప్రసాదరావుగారికి లాల్ సలామ్..!!*
ఎ.రజాహుస్సేన్ !!

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!