TS BC STUDY CIRCLE; FREE OFFLINE COACHING FOR TSPSC GROUP-III, IV, DSC and Gurukulam Teachers 2022-23
తెలంగాణ రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
కోచింగ్ వివరాలు:
* టీఎస్‌పీఎస్సీ గ్రూప్-III, IV, DSC మరియు గురుకులం ఉపాధ్యాయులకు ఉచిత కోచింగ్
అర్హత: గ్రూప్-3, 4 శిక్షణ కోసం పది, ఇంటర్, డిగ్రీలో 60 శాతం మార్కులు, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీఈడీలో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షలో వచ్చిన మార్కులు, సీట్ల లభ్యత ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు బీసీ స్టడీసర్కిల్ వెబ్‌సైట్ ద్వారా ఆగస్టు 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: 25-08-2022.
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 27-08-2022.
కోచింగ్ ప్రారంభం: 01-09-2022.
వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 040-24071178 లేదా 040-27077929.
FREE OFFLINE COACHING FOR TSPSC GROUP-III, IV, DSC and Gurukulam Teachers 2022-23 |
Notification |
Apply Online Acknowledge |