APSACS: Prakasam notification for various posts
APSACS Prakasam Paramedical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.. ఒప్పంద ప్రాతిపదికన 30 ఐసీటీసీ కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు దారలు తప్పనిసరిగా ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 65 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా ఆగస్టు 24, 2022 తేదీలోపు దరఖాస్తులను పంపవచ్చు. అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపకైనవారికి నెలకు రూ.21,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు:
- ఐసీటీసీ కౌన్సెలర్ పోస్టులు: 1
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 14
- మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 4
- డేటా మేనేజర్ పోస్టులు: 1
- స్టాఫ్ నర్సులు పోస్టులు: 8
- ఫార్మాసిస్ట్ పోస్టులు: 2
అడ్రస్: Collector & District-Magistrate and chairman of the District selection committee, Prakasam District, Ongole. AP.
పూర్తి సమాచారం కోసం
View (668 KB) APPLICATION (177 KB) ELIGIBILITY CRITERION & RECRUITMENT SCHEDULE (2 MB) |