Justice U U Lalit: U U Lalit has been selected as the new Chief Justice of the Supreme Court

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Justice U U Lalit : సుప్రీంకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్ ఎంపిక‌..

 
సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ఎంపికయ్యారు. ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది.

Justice U U Lalit

సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్‌ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ఉన్నారు. దీంతో ఆయన పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.

భారత 49వ సీజేఐగా..
ఆగ‌స్టు 26వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్‌ లలిత్‌ భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్‌ 8 వరకే ఉంది. సీజేఐగా రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది.

error: Content is protected !!