దేశంలోని Indian Institute of Technology (IIT)ల్లో 4,596 అధ్యాపక సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
అత్యధికంగా IIT Kharagpurలో 798, IIT Bombayలో 517 ఖాళీలు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. టాప్ ర్యాంకులో ఉండే IIT Madrasలోనూ 482 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఆయా పోస్టుల భర్తీ నిరంతర ప్రక్రియ అని, ఇందుకోసం ఐఐటీలు ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయని తెలిపారు.