జేఈఈ మెయిన్ ర్యాంకులను ఆగస్టు 6న రాత్రి ప్రకటిస్తారా?… 7న ఉదయం ప్రకటిస్తారా? అని దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మంది ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఏప్రిల్ 14న ఐఐటీ బాంబే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే జేఈఈ మెయిన్ ర్యాంకుల్ని ఆగస్టు 7న ఉదయం 10 గంటలలోపు వెల్లడించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షలు జులై 30న ముగిశాయి. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను తెలిపే గడువు ఆగస్టు 5న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మెయిన్-1, 2లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణలోకి తీసుకొని ర్యాంకుల్ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడిస్తుంది. కానీ ఫలితాలు ఎప్పుడన్నది ఆ సంస్థ అధికారికంగా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. ఫలితాలను సెప్టెంబరు 11న విడుదల చేస్తారు.
JEE MAINS SESSON 2 RESULTS: ఆగస్టు 6న రాత్రి ప్రకటిస్తారా?… 7న ఉదయం ప్రకటిస్తారా?
You might also check these ralated posts.....