JAGANANA VIDESHI VIDYA DEEVENA APPLICATIONS, PAYMENT STATUS,G.O COPY
జగనన్న విదేశీ విద్యా
దీవెనకు దరఖాస్తులు
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సాంఘిక సంక్షేమశాఖ సంచాలకులు కె.హర్షవర్ధన్ సూచించారు. ఎస్సీ, ఎస్బీ బీసీ, మైనార్టీ, ఈబీసీ కాపు కులాలకు చెందిన విద్యార్థుల నుంచి 200 లోపు క్యూఎస్ ర్యాంకు ప్రకారం ఏదైనా దేశంలోని యూనివర్సిటీల్లో, విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్, ఎంబీబీఎస్ చదువు కోవాలనుకుంటున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుటుంబ వార్షిక ఆదా యం రూ. 8 లక్షల లోపు ఉండాలని, 35 సంవ త్సరాలకు మించి వయసు ఉండకూడదన్నా రు. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడు కలిగి ఉండాలన్నారు. ఎంబీబీఎస్ కోర్స్ నీట్ క్వాలిఫై ఉండాలన్నారు. వంద శాతం లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలం, విద్యాసంస్థ లో అడ్మిషన పొందితే ఫీజు మొత్తం ప్రభు త్వమే చెల్లిస్తోందన్నారు. 101 నుంచి 200 లోపు ర్యాంకు గల విశ్వ విద్యాలయం, విద్యా సంస్థలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజు ఏది తక్కువ అయితే దాని ప్రకారం చెల్లించడం జరుగుతోందన్నా రు. అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తుల్ని హెచ్ఐటీపీఎస్://జెఎన్ఎన్ఎబిహెచ్ఎయు ఎంఐ డాట్ ఏపీ జీఓవీ డాట్ ఇన్ నందు నమోదు చేయాలన్నారు. ఈనెల 30 లోపు దరఖాస్తుల్ని ఆన్లైన్ ద్వారా పంపాల్సిందిగా సూచించారు.