DEO Anantapuram: Most important instructions tothe teachers
*//అత్యంత ప్రధానం//*
🔊జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా క్రింది అంశాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయించాల్సిందిగా సూచించడమైనది.
🌟1) *విద్యార్థుల నమోదు:*
జిల్లాలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు Student Info వెబ్సైట్ కు సంబంధించి క్రింది వివరాలు సరిచూసుకుని నమోదు చేయాలి.
🔹మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ Student Info వెబ్సైట్ నందు నమోదయ్యెలా చూడాలి.
🔹మీ పాఠశాల నుండి బదిలీ సర్టిఫికేట్ తీసుకున్న వారిని ఆన్లైన్లో TC issue చేయడం. పాఠశాల లో చదవని ఏ ఒక్కరి వివరాలు Student Info వెబ్సైట్ నందు కొనసాగించకూడదు. వాటిని డ్రాప్ బాక్స్ లో వేయడం/TC issue చేయడం చేయాలి.
🔹మీ పాఠశాల లాగిన్ లో డ్రాప్ బాక్స్ లో ఉన్న పిల్లలకు సంబంధించి కారణాలు నమోదు చేయాలి.
*గమనిక:* ఈ నెల 30 వ తేదీనాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలి. తరువాత Student Info నమోదు ప్రక్రియ నిలిపివేయబడుతుంది. త్వరలో జరగనున్న పోస్టుల పునర్విభజన ప్రక్రియకు ఇది అత్యంత కీలకం. తరువాత ఎటువంటి మార్పులకు ఆస్కారం ఉండదు.
🌟 2) *TIS పునఃనిర్దారణ (TIS Re confirmation):*
జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులందరి( నాన్ టీచింగ్ సిబ్బంది, పీ.టీ.ఐ.లు,సీ.ఆర్.పీలు, మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది మొదలగు) వివరాలు సంబంధిత ఉద్యోగుల సర్వీసు రికార్డు పరిశీలించి పునః నిర్దారణ చేయాలి.
TIS నందు కేడర్ స్ట్రెంగ్త్ కూడా అప్డేట్ చేయాలి.
*గమనిక:* ఈ నెల 30 వ తేదీనాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలి. తరువాత TIS నమోదు ప్రక్రియ నిలిపివేయబడుతుంది. త్వరలో జరగనున్న పోస్టుల పునర్విభజన, బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియకు ఇది అత్యంత కీలకం. తరువాత ఎటువంటి మార్పులకు ఆస్కారం ఉండదు.
🌟 3) *ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల హాజరు:*
గౌరవ కమిషనర్ పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులందరూ(నాన్ టీచింగ్ సిబ్బంది మరియు సీ.ఆర్.పి/పీటీఐ లందరూ) సెప్టెంబర్ 1వ తేది నుండి స్కూల్ అటెండెన్స్ ఇంటిగ్రేటెడ్ మొబైల్ యాప్ ద్వారా తమ హాజరు నమోదు చేయాలి. హాజరు నమోదు చేయకపోతే సెలవు/ఆబ్సెంట్ గా పరిగణిస్తారు. సెప్టెంబర్ 1వ తేది నుండి మాన్యువల్ హాజరు పరిగణనలోకి తీసుకోబడదు.
🌟4) *మండల విద్యాశాఖ సిబ్బంది హాజరు:*
గౌరవ కమిషనర్ పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ అందరూ సెప్టెంబర్ 1వ తేది నుండి స్కూల్ అటెండెన్స్ ఇంటిగ్రేటెడ్ మొబైల్ యాప్ ద్వారా తమ హాజరు నమోదు చేయాలి. హాజరు నమోదు చేయకపోతే సెలవు/ఆబ్సెంట్ గా పరిగణిస్తారు. సెప్టెంబర్ 1వ తేది నుండి మాన్యువల్ హాజరు పరిగణనలోకి తీసుకోబడదు.
*జిల్లా విద్యాశాఖ అధికారి*
*అనంతపురం జిల్లా*