BEL Recruitment 2022 for Engineering Assistant Trainee posts; notification and apply online

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఘజియాబాద్‌ యూనిట్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 అసిస్టెంట్‌ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 13, మెకానికల్ విభాగంలో 3 అందుబాటులో ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌ ఉన్న వారికి సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 15-08-2022తో మొదలై, 03-09-2022తో ముగియనుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,500 నుంచి రూ. 90,000 వరకు చెల్లిస్తారు.

* జనరల్ అభ్యర్థుల రూ. 295 అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

error: Content is protected !!