BASARA IIIT RESULT 2022 IS ON 22 AUGUST 2022
BASARA RGUKT Results 2022: బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల జాబితాను ఆగస్టు 22న ప్రకటిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ప్రవేశాల జాబితా ప్రకటన జాప్యమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది సైతం 1500 సీట్లు భర్తీ చేస్తాం. ఇందులో ప్రత్యేక కేటగిరి కింద 96 సీట్లు పోగా మిగిలిన 1404లో 702 సీట్లు వివిధ రిజర్వేషన్లకు కేటాయిస్తాం. జనరల్‌కు మిగిలిన 702లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 140 సీట్లు కేటాయిస్తాం. దీంతోపాటు 30 ఎన్‌ఆర్‌ఐ సీట్లు, 75 గ్లోబల్ సీట్లు అందుబాటులో ఉంటాయి’’ అని ఇన్‌ఛార్జి వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను https://www.rgukt.ac.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
You might also check these ralated posts.....