AP teachers Relinquishment Details_Data submission
*Relinquishment Details_Data submission*:
*ఆన్లైన్ పదోన్నతులలో భాగంగా ఉపాధ్యాయ ప్రమోషన్ విషయమై మరికొన్ని అవసరమైన వివరాలు పొందుటకై కొత్తసర్వీసు ఎనేబుల్ చేయడమైనది.ఇది మండల విద్యా శాఖ అధికారులు ధృవీకరించిన వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపడం ద్వారా ఫైనల్ కన్ఫర్మేషన్ చేసుకోవడం జరుగుతుంది. క్లుప్తంగా ఇలా…*
*2. జిల్లా విద్యాశాఖ అధికారి వారి ద్వారా యూజర్ ఐ డీ మరియు పాస్ వర్డ్ పొందాలి.*
*3. User ID మరియు password ,captcha కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వవలెను.*
*4. లాగిన్ అవగానే password రీసెట్ చేసుకోమని కొత్త పాపప్ విండో వస్తుంది.*
*5. Password రీసెట్ చేసుకొని తిరిగి కొత్త password తో లాగిన్ అవగానే…*
*6. Management సెలక్షన్ చేసుకొని పాఠశాల సెలక్షన్ చేసుకొంటే….ఆ పాఠశాల లోని ఉపాధ్యాయుల వివరాలు వస్తాయి.*
*7. ఇందులో కొన్ని వివరాలు ఆటోమేటిక్ గా వస్తాయి.*
*8 విండో చివరలో*
*Relinquishment చేశారా అనిఅడుగుతుంది.*
*అనగా గతంలో ఈ ఉపాధ్యాయునికి పదోన్నతి అవకాశం వచ్చినప్పుడు వ్యక్తిగత కారణాలతో తిరస్కరించారు అనుకొందాము.అప్పుడు yes సెలక్షన్ చేసుకొనండి.*
*ఇప్పుడు ఎన్నిసార్లు relinquishment చేశారు అని అడుగుతుంది.*
*అది కూడా సెలక్షన్ చేయాలి*.
*ఇంతవరకు మీకు ప్రమోషన్ అవకాశం రాకపోతే No సెలక్షన్ చేయాలి.*
*9. తదుపరి DSC ర్యాంకు ఎంటర్ చేయాలి.*
*10.తదుపరి Charges pending అనే ప్రశ్న వస్తుంది.*
*ఆ ఉపాధ్యాయుని పై ఏవైనా కేసులు ఉంటే ఆ వివరాలు yes అని సెలక్షన్ చేసుకొని,details అనే ఫీల్డ్ లో కేసు వివరాలు నమోదు చేయాలి.*
*ఏ కేసులూ లేకుంటే No సెలక్షన్ చేస్తే చాలు.ఇది ఉపాధ్యాయ వ్యక్తిగత బాధ్యత పై వారి నుండి వివరాలు సేకరించి సమర్పించవలెను.*
*11. ఇలా ఈ ఉపాధ్యాయుని ఎదురుగా మొదట్లో ఉన్న check box పై క్లిక్ చేసి సమర్పించవలెను.*
*12. ఇలాసమర్పించే సందర్భంలో ఒక్కొక్క ఉపాధ్యాయునివీ లేదా కొంతమందివి లేదా అందరివీ ఒకేసారి సబ్మిట్ చేసే వెసులుబాటు ఉంది.*
*13. ఈ విధంగా ఆ మండల విద్యా శాక అధికారి తన పరిధిలోని అందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు వివరాలు సమర్పించవలెను.*
*14. మీరు వివరాలు సబ్మిట్ చేయగానే వారి వివరాలు DEO గారి లాగిన్ లోకి వెళ్ళి పోతాయి.*
*15. అంటే ఎప్పటికప్పుడు పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ వివరాలు మీకు తెలిసిపోతాయి*
*16. ఒకవేళ ఏవైనా తప్పు గా సబ్మిట్ చేసి ఉంటే మీ DEO గారకి రాతపూర్వకంగా తెలియజేయగలరు. వారి లాగిన్ లో ఎడిట్ కి అవకాశం ఉంది.*
Subscribe to updates Unsubscribe from updates