మినీ కాదు మెగా డీఎస్సీ కావాలి – డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ :మినీ డిఎస్‌సి వద్దు మెగా డిఎస్‌సి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని టవర్‌క్లాక్‌ సర్కిల్‌ వద్ద నిరుద్యోగ యువత శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మినీ డిఎస్‌సి వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తక్షణమే మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువత పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలిచ్చారని…ఆచరణలో మాత్రం అది సాధ్యం కాలేదని విమర్శించారు. రైౖల్వే, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థలను కేంద్రం ప్రైవేటీకరించడంతో ఉద్యోగ అవకాశాలు తగ్గాయని, ప్రభుత్వ రంగ సంస్థలను యథావిధిగా కొనసాగించి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఎపిపిఎస్‌సి ద్వారా ఉద్యోగాల భర్తీ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేలా డిఎస్‌సిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ అనంతపురం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొలన్నారు.

error: Content is protected !!