*📚✍️ఎస్సీఈఆర్టీ*
*పాఠ్యాంశాలే బోధించాలి✍️📚*
*♦️ప్రైవేట్ పాఠశాలలకు కమిషనర్ ఆదేశం*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వం (ఎస్సిఇఆరి) నిర్దేశించిన పాఠ్యాంశాలను ఎస్‌సిఇఆర్‌టి నిర్దేశించిన పుస్తకాల ద్వారా మాత్రమే బోధించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పుస్తకాలను ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని కూడా ఆయన హెచ్చరించారు. ప్రైవేట్ పబ్లిషర్ ముద్రించిన పుస్తకాలు, గైడ్లు, వర్కబుక్స్ కొనమని విద్యార్థులపై ఒత్తిడి తేకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2022-23 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం నిర్దేశించిన ధరకు జిల్లా పాఠ్య పుస్తకాల మేనేజర్ల ద్వారా అన్ని మండలాలకు పంపిణీ జరుగుతుందని తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇